Hin

17th october 2024 soul sustenance telugu

October 17, 2024

ఒత్తిడి లేని జీవితానికి 5 దశలు (పార్ట్ 2)

 దశ 2- నేను సమయానికి చేరుకోలేదు……. సరే పర్వాలేదు. – ఈ రోజుల్లో మన జీవితంలోని ప్రతి అడుగు పనులను పూర్తి చేయడం, ఆ పనులు వేగంగా మరియు మెరుగ్గా జరిగేలా చూడడానికే కేటాయిస్తున్నాము. కానీ మనం గ్రహించడంలో విఫలమైన విషయం ఏమిటంటే, హడావిడి మరియు సంబంధిత ఆందోళన యొక్క ప్రతి ఆలోచన మన మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక,  అలాగే మన శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే, ఏదైనా సమావేశానికి, అసైన్మెంట్ లేదా విందుకు ఆలస్యం కావడం మంచిదే, కానీ తొందరపడటం చాలా చెడ్డది, ఎందుకంటే హడావిడి యొక్క స్మృతి మీ మార్గంలో కఠినమైన షెడ్యూల్లను తీసుకువస్తుంది, ఎందుకంటే మీరు ప్రసరించే శక్తి అదే కావున మీ వద్దకు కూడా అదే తిరిగి వస్తుంది. ఎంత తొందరపడితే, అంత ఎక్కువ మంది ఆ ప్రతికూల శక్తిని అనుభూతి చెంది మీతో అసౌకర్యంగా భావిస్తారు. అలాగే, మీ మనస్సు, శరీరం మరియు సంబంధాలకు దీర్ఘకాలిక హాని కంటే స్వల్పకాలిక వైఫల్యం మంచిదని గుర్తుంచుకోండి. కాబట్టి, మీ జీవితంలో ముఖ్యమైన పనులను చేయండి, మీ కారులో కార్యాలయానికి వెళ్ళండి, మీ ఇంటి పని మరియు కార్యాలయ దినచర్యను పూర్తి చేయండి మరియు బిజీగా ఉండే సామాజిక జీవితాన్ని కూడా గడపండి, కానీ ఇవన్నీ ప్రశాంతమైన, హడావిడి చేయకుండా, అలసిపోని మానసిక స్థితిలో చేయండి. ఈ విధంగా, మీరు జీవితంలోని క్షణాలను ఆస్వాదిస్తారు, అన్ని స్థాయిలలో దీర్ఘకాలిక విజయాన్ని పొందుతారు మరియు డెడ్ లైన్స్  నుండి, ఇతరులుకు  మీ పట్ల ఉన్న సమయ ఆధారిత అంచనాల నుండి మీరు ఒత్తిడి చెందరు. 

దశ 3-ప్రపంచం మొత్తం ఒక వేదిక మరియు మనమందరం నటులము – ప్రతి ఉదయం నేను ప్రపంచ వేదికపై నటుడిని అని, నేను ఇక్కడ చేసే ప్రతిదీ నేను పోషించాల్సిన పాత్ర అని మీకు మీరే చెప్పుకోండి. నాటక వేదికపై ఒక నటుడు ఎప్పుడూ తన పాత్రతో గుర్తించబడడు. ఎప్పుడూ తన పాత్రతో అనుబంధించబడడు. ఆ పాత్ర తాత్కాలికమైనదని, ఆ పాత్ర పోషించిన తర్వాత రోజు చివరిలో అతను ఇంటికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని అతనికి తెలుసు. ఒత్తిడికి అత్యంత ముఖ్యమైన కారణాలలో ఒకటి – నేను పాత్ర అనే ఆలోచన. ఈ  స్మృతి సరైనది కాదు.  బదులుగా, నేను ఒక ఆత్మ, ఆధ్యాత్మిక నటుడిని మరియు పాత్ర నా చర్య అనేది సరైన స్మృతి. నా పాత్ర తాత్కాలికమైనది, నా నిజమైన స్వభావం కాదు. నేను గుణాలు మరియు శక్తులతో నిండి ఉండే  ఆత్మను, ఇదే నా నిజమైన స్వభావం. పాత్రతో ఎంత ఎక్కువ నిర్లిప్తతత ఉంటుందో, అంత తక్కువ ఒత్తిడి ఉంటుంది. పాత్రలో ఉన్నప్పుడు, విషయాలు నేను కోరుకున్న విధంగా లేదా ఆశించిన విధంగా జరగవు. అలాగే, ప్రతి ఒక్కరూ కూడా ఒక నటుడు, కొన్నిసార్లు వారి నటన నేను ఊహించిన విధంగా ఉండదు, కానీ నేను తేలికగా ఉంటాను ఎందుకంటే ప్రతికూల నియంత్రణ కంటే సానుకూల ప్రభావం సులభం అని నాకు తెలుసు. నేను అవతలి వ్యక్తి చర్యను నియంత్రించడానికి ప్రయత్నిస్తే, నేను ఒత్తిడితో కూడిన మనస్సును, సంబంధాలను మరియు వాతావరణాన్ని సృష్టిస్తాను. బదులుగా నేను నటుడిని ప్రభావితం చేస్తే, అతనికి మంచి భావాలను మరియు శుభాకాంక్షలను వ్యాప్తి చేయడం ద్వారా, అవతలి వ్యక్తి మారి సానుకూలంగా వ్యవహరిస్తాడు మరియు నేను కూడా ఒత్తిడి నుండి విముక్తి పొందుతాను.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

18th july 2025 soul sustenance telugu

స్వీయ సందేహం మరియు అభద్రతలను అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆనందాన్ని క్షీణింపజేసి, మనకు నిరాశ కలిగించే ఒక భావోద్వేగం – అభద్రత. మన గురించి, మన సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థికం

Read More »
17th july 2025 soul sustenance telugu

ఇదే సరైన సమయం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మీరనుకున్న మార్పును తీసుకురావడానికి లేదా అసంపూర్ణంగా ఉన్న పనిని పూర్తి చేయడానికి ఏది సరైన సమయం? నేను నూతన సంవత్సరంలో ప్రారంభిస్తాను…

Read More »
16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »