Hin

10th june 2025 soul sustenance telugu

June 10, 2025

ఒత్తిడి మరియు ఆందోళన లేని ప్రపంచాన్ని సృష్టించడం (పార్ట్ 1)

మనమందరం ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నాము, చాలా మంది జీవితాల్లో ఒత్తిళ్లు మరియు ఆందోళనలు ఉన్నాయి. శాంతి మరియు ఆనందం సదా ఉండటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులను వారు ఎంత సంతోషంగా ఉన్నారని, వారి అసంతృప్తికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు, ఈ ప్రశ్నకు అనేక విభిన్న సమాధానాలు వస్తాయి. శారీరక అనారోగ్యాలు మరియు సంబంధాలలో సమస్యలతో పాటు ఆర్థిక ఒడిదుడుకులు ఎలా అసంతృప్తిని కలిగిస్తాయని, ఎప్పటికప్పుడు ఒత్తిడిని కూడా కలిగిస్తాయని అందరూ చెప్తూ ఉంటారు. చాలా మందికి వారి స్వంత సంస్కారాల కారణంగా సమస్యలు ఉండగా, మరి కొంత మంది ఇతరులను చూసి వారితో తమను తాము పోల్చుకున్నప్పుడు సమస్యలను ఎదుర్కొంటారు, ఇది కుటుంబాలలో మరియు ఆఫీసులో  అసూయ, ద్వేషం మరియు అహం వంటి భావోద్వేగాలకు కారణమవుతుంది. మన చుట్టూ ఉన్న వ్యక్తులు వారి ఒత్తిడిని అధిగమించడానికి మరియు తమను తాము తేలికగా ఉంచుకోవడానికి 5 విధానాలు ఎలా సహాయపడతాయో చూద్దాం –

మీరు ఎక్కడికి వెళ్లినా అక్కడ హాయిగా, తేలికగా ఉండే వాతావరణాన్ని తయారుచేయండి

చాలా సార్లు, మనం రోజులో అనేక చోట్ల గడిపే సమయంలో, అక్కడ తొందర మరియు క్రియలపై అధిక ఆశక్తితో కూడిన వాతావరణం కనిపిస్తుంది. ఆధునిక సమాజంలో, మన సొంత శ్రేయస్సు మరియు మనం పోషిస్తున్న పాత్రకు సంబంధించిన సానుకూలమైన, శక్తివంతమైన ఆలోచనపై దృష్టి సారించే మనస్తత్వాన్ని కొనసాగించటానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. మనం సానుకూలంగా, నిర్లిప్తంగా ఉన్న స్థితిలో చర్యలు తీసుకోవాలని చాలా సంవత్సరాల క్రితం నుండి భారతీయ జ్ఞానపరంపరలో మనం వింటూ వస్తున్నాం. కానీ వాస్తవ జీవితంలో మనం దీనిని పాటించము. దాని బదులు మనం ఆలోచనలు, మాటలు, చర్యల ద్వారా చాలా నెగటివిటీని మరియు వ్యర్థాన్ని సృష్టిస్తున్నాం. ప్రతిరోజూ ప్రారంభానికి ముందు ఒక ఆధ్యాత్మిక చైతన్యం ఏర్పరుచుకొని, దానిని రోజంతా మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటే, మన చర్యల్లో తక్కువ తప్పులు, తక్కువ తొందర మరియు ఎక్కువ సానుకూలత కనిపిస్తాయి. ఇలాంటి వాతావరణాన్ని మన ఇళ్లలో మరియు కార్యాలయాల్లో ఏర్పరచుకోవాలి. ఇదే సులభమైన జీవనానికి మరియు అన్ని రకాల చర్యలు, సంబంధాలను సులువుగా నిర్వహించుకునేందుకు కీలకం.

(సశేషం…) 

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »