Hin

11th june 2025 soul sustenance telugu

June 11, 2025

ఒత్తిడి మరియు ఆందోళన లేని ప్రపంచాన్ని సృష్టించడం (పార్ట్ 2)

మీ ఎంపికలను వివేకంతో చేసుకోండి మరియు వాటితో ఇతరులను ప్రేరేపించండి

మీ ప్రతి చర్యను ఇతరులు గమనిస్తారని మరియు మీరు చేసే మంచి లేదా చెడు, సానుకూల లేదా ప్రతికూలమైన వాటిని ఇతరులు అనుసరిస్తారని భగవంతుడు మనకు బోధిస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో భౌతికరూపంలో జరుగుతుంది, అంటే మనల్ని చూసి ఇతరులు అలాగే ప్రవర్తిస్తారు. మరికొన్ని సందర్భాల్లో కొందరు మన తరంగాలను గ్రహించి మనల్ని అనుసరిస్తారు. కాబట్టి, మనం స్వయంగా బాధ్యత తీసుకొని, ప్రతీ విషయంలో సానుకూలంగా ఉండటం, మరియు మంచి గుణాల ఆధారంగా సత్కార్యాలు చేయడం చాలా ముఖ్యం. మనం అది ఎలా చేయగలం? భగవంతుని విద్యార్థులుగా అయ్యి, వారి జ్ఞానాన్ని ప్రతిరోజు శ్రద్ధగా వినడం ద్వారా, జీవన కళను వారి నుండి నేర్చుకోవడం ద్వారా చేయగలము. అలాగే, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకునే సరైన విధానం, సంబంధాలను సక్రమంగా నిర్వహించే సరైన విధానం, ధనాన్ని ధర్మపరంగా వినియోగించే సరైన పద్ధతి, భౌతిక వస్తువులు, సాంకేతికత మరియు ప్రకృతితో సరైన సంబంధాన్ని ఏర్పరచుకునే విధానం, తినటం, నిద్రించటం, దుస్తులు ధరించే సరైన విధానాలు, వృత్తిపరమైన పనులు సత్పద్ధతిలో చేయడం, పిల్లలను మంచి సంస్కారాలతో పెంచడం, జీవితంలో ఏ రంగమైనా సరే, దానిలో ముందుకు సాగేందుకు సరైన మార్గాన్ని తెలుసుకోవడం ద్వారా చేయగలం. మనం పనులను ఎంత ఎక్కువగా సరిగ్గా చేస్తే, అంతగా మనం ఒత్తిడులు మరియు ఆందోళనల నుండి విముక్తులవుతాం. ఇదే సమయంలో, మన జీవనశైలి ద్వారా ఇతరులను కూడా ప్రేరేపించి, వారు కూడా అలాంటి జీవితాన్ని అనుసరించి తేలికగా, ఒత్తిడిలేకుండా ఉండగలుగుతారు.

ఆశీర్వాదాలు ఇస్తూ మనుషుల హృదయాలను సంభాళించండి 

మనుషుల హృదయాలకు అతిపెద్ద ఉపశమనం సదా వారికి ఆశీర్వాదాలు మరియు ప్రేమను అందించడమే. ఇది వారికి ఆనందాన్ని కలిగిస్తూ వివిధ కారణాల వలన ఉన్న వారి ఒత్తిడి తొలగిపోతుంది. అందుకే, ప్రతి ఉదయం మీ మనసులో ఒక లోతైన సానుకూల ఆలోచన చేయండి. ఈ రోజు మీరు కలిసే ప్రతి వ్యక్తి గురించి లేదా గుర్తు వచ్చే ప్రతి వ్యక్తి గురించి, వాళ్లతోనూ, ఇతరులతోనూ కూడా మీరు కేవలం వారి ప్రత్యేకతల గురించే ఆలోచించాలి, మాట్లాడాలి. మీ మనస్సు వారి బలహీనతల వైపు, ప్రస్తుత మరియు గతంలోని వారి తప్పుడు చర్యల వైపు మళ్లడానికి మీరు అనుమతించరు, లేదా మీరు వాటి గురించి మాట్లాడరు. ఇది వారికి ప్రేమతో కూడిన ఆశీర్వాదాలు, మంచితనం యొక్క కాంతిని పంపుతుంది. అదే సమయంలో, వారు అప్పుడు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితి లేదా పరిస్థితుల కారణంగా కలిగే ఆందోళనల నుండి తేలికగా మరియు స్వేచ్ఛగా ఉండేందుకు కూడా సహాయపడుతుంది.

(సశేషం)

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »