Hin

12th june 2025 soul sustenance telugu

June 12, 2025

ఒత్తిడి మరియు ఆందోళన లేని ప్రపంచాన్ని సృష్టించడం (పార్ట్ 3)

ప్రతి రోజును ఆధ్యాత్మిక ఆనందంతో ఆస్వాదించండి మరియు దానిని ఇతరులతో పంచుకోండి

ఇతరులను శక్తివంతం చేసి వారిని సంతోషపెట్టడానికి చాలా ముఖ్యమైన మార్గం మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవడం. కానీ, మన ఆనందం ఆధ్యాత్మికమైనది మరియు శాశ్వతమైనదిగా ఉండేలా చూసుకోవాలి. అది  తప్పుడు నమ్మకాల ఆధారంగా ఉండకూడదు. ప్రపంచం సంతోషంతో కూడా నిండి ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే, జీవితంలో కష్టసమయాలు ఎదురైనప్పుడు వ్యక్తులు ఒత్తిడికి లోనై తమ ఆనందాన్ని కోల్పోతారు. ఎందుకంటే వారి సంతోషం తప్పుడు నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది, బాహ్య వనరులపై ఆధారపడి ఉంటుంది మరియు వారి భౌతిక ఇంద్రియాల ద్వారా అనుభవించబడుతుంది. కొన్ని సార్లు వ్యక్తుల జీవితాల్లో ఆనందాన్ని కలిగించే కొన్ని మూలాలు ఉన్నప్పటికీ, జీవితంలోని ఏదైనా అంశంలో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవాల్సినప్పుడు, అదే మూలాలు వారికి ఆనందాన్ని ఇవ్వవు. దాంతో వారు తమ జీవితాల్లో ఒక శూన్యతను లేదా కొరతను అనుభవిస్తారు. కావున, మనల్ని మనం ఆధ్యాత్మికంగా శక్తివంతం చేసుకోవడం ద్వారా, మన జీవితంలో జ్ఞానం ఆధారంగా సానుకూల మరియు శాశ్వత ఆనందాన్ని సృష్టించడం ద్వారా, ఒత్తిడిని కలిగిస్తూ వారి ఆనందాన్ని తగ్గించే ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి మన కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు మన కార్యాలయంలోని సహోద్యోగులకు కూడా మనం సహాయపడవచ్చు మరియు ప్రేరేపించవచ్చు. 

అందరూ భగవంతుని తరంగాలకు అనుసంధానం అయ్యేలా చూసుకోండి

భగవంతునితో ఆధ్యాత్మిక సంబంధం గురించి వారికి ఉన్న తప్పుడు నమ్మకాలను అధిగమించడం ఏ మానవుడికైనా ఒక పెద్ద సవాలు. ఎందుకంటే, సరైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ధ్యానం ద్వారా భగవంతునితో సంబంధాన్ని ఏర్పర్చుకొని, వారి వైబ్రేషన్లకు మనం కనెక్ట్ అవ్వడం లేదంటే, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మనలో ఉత్పన్నమయ్యే నెగటివ్ ఆలోచనలు, భావాలు, వైఖరులు తొలగవు. అలా తొలగకపోతే మనకు తేలికగా అనిపించదు, అలాగే ఆ సమయంలో స్థిరమైన ఆనందానుభూతిని పొందలేం. కాబట్టి మనం ఆంగ్లం లేదా హిందీలో లేదా రెండింటిలోనూ లేదా ఇతర భాషలో అయినా ధ్యానానికి పరిచయాన్ని ఇచ్చే ఒక చిన్న పుస్తకం లేదా కరపత్రాన్ని మనతో పాటు తీసుకు వెళ్దాము. ప్రతిరోజూ మనం కలిసే ప్రతి ఒక్కరికీ దానిని కానుకగా ఇద్దాము. ఇది ప్రతి ఒక్కరికీ ఈ సమయంలో అత్యవసరమైనది.

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »