Hin

7th dec 2024 soul sustenance telugu

December 7, 2024

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల పేర్లతో అతిగా గుర్తిస్తాము. ఇది అపేక్షలు, పోటీ మరియు నియంత్రణను సృష్టిస్తూ ఒత్తిడికి దారితీస్తుంది.

 

  1. రోజంతా మీ స్మృతిని చెక్ చేసుకోండి. మీరు ప్రతి సన్నివేశాన్ని మీ పాత్ర యొక్క అసత్యపు గుర్తింపుతో అభినయిస్తున్నారా – జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సీనియర్, జూనియర్…? మీ పాత్రలతో గుర్తిస్తే, మీరు మీ మనస్సులో పాత్ర గురించి సృష్టించుకున్న ఇమేజ్ లాగా ప్రవర్తిస్తారు.
  2. డిశ్చార్జ్ అయిన ఫోన్ ఏ విధమైన పనిని చేయదు. మనం దానిని 30 నిమిషాలు ఛార్జ్ చేస్తే, దానిని అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. అదే విధంగా, రోజులో అనేక పాత్రలను పోషించడానికి, ఉదయం 30 నిమిషాలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదువుతూ లేదా వింటూ, ధ్యానం చేస్తూ మిమ్మల్ని మీరు ఛార్జ్ చేసుకోండి.
  3. పరిస్థితులు తప్పుగా ఉన్నప్పటికీ ఆత్మ యొక్క సుగుణాలను ప్రసరింపజేయాలని గుర్తుంచుకోండి. ప్రతి పరస్పర చర్యలో, ఇతరుల పాత్రలతో కనెక్ట్ అవ్వకముందు వారి అంతరాత్మతో కనెక్ట్ అవ్వండి. ఇది వ్యక్తి పట్ల నిజమైన గౌరవం మరియు వారి పాత్రల పట్ల ప్రశంస అనే పునాదిని నిర్మిస్తుంది.
  4. మీరు ఒక నటుడు – ఒక ఆత్మ, ఈ ప్రపంచ నాటక వేదికపై ప్రతి సన్నివేశాన్ని, మీ శరీరం మరియు పాత్ర ద్వారా ప్రదర్శిస్తున్నారు. నటులైన మీది శాంతి, ఆనందం, ప్రేమ, స్వచ్ఛత యొక్క అసలైన వ్యక్తిత్వం అని నిర్ధారించుకోండి. అప్పుడు మీ ప్రతి పాత్ర ఎలా అప్రయత్నంగా మారుతుందో చూడండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th april 2025 soul sustenance telugu

మనకు మనమే ఎమోషనల్ డిటాక్స్ చేసుకోవాలి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి కొన్ని నిమిషాలకు వివిధ మీడియా నుండి వచ్చే సందేశాలను చదవడానికి మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ని చెక్ చేసే అలవాటు

Read More »
25th april 2025 soul sustenance telugu

సంతుష్టత – ధారణ చేసి రేడియేట్ చేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన సంతుష్టతని మరియు మన కోరికలను సమతుల్యం చేసుకోవడమే మనం నేర్చుకోవలసిన జీవిత-నైపుణ్యం. నా జీవితంలో అన్ని మెరుగుదలలు చేసిన తర్వాత,

Read More »
24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »