Hin

పని ఒత్తిడిని అధిగమించడానికి 5 ఉపాయాలు

September 2, 2023

పని ఒత్తిడిని అధిగమించడానికి 5 ఉపాయాలు

  1. ఒక చక్కని ఆలోచనతో మీ రోజును ప్రారంభించండి – ప్రతి ఉదయం, ఆ రోజు మీకున్న పనులనుబట్టి, మీ కోసం ఒక చక్కని ఆలోచనను చేయండి. పనితోపాటు ఆ ఆలోచనను కూడా రోజంతా గుర్తుంచుకోండి. ఇటువంటి మంచి ఆలోచనలు మీ మనసును పాజిటివ్‌గా, శక్తివంతంగా ఉంచడమే కాకుండా పని సామర్థ్యాన్ని మరియు ఉత్పాదకతను పెంచుతాయి.
  2. ఒక సుగుణాన్ని ఎంచుకుని దానిని మీ మాటల్లోకి, చేతల్లోకి తీసుకురండి – మధురత, సహనము, చిరునవ్వు, సహకారము, ఖచ్చితత్వము, శుభ భావనలు వంటి అనేక సుగుణాలు ఉన్నాయి. ఏదైనా ఒక సుగుణాన్ని రోజూ ఎంచుకుని అందరితో వ్యవహరించేటప్పుడు మీ మాటల్లోకి, చేతల్లోకి మీరు ఎంచుకున్న ఆ సుగుణాన్ని తీసుకురండి. ఇది మీ ఆఫీసు వాతావరణాన్ని పాజిటివ్‌గా ఛార్జ్ చేయడమే కాకుండా మీ మనసును ప్రశాంతంగా మరియు తేలికగా ఉంచుతుంది.
  3. నో యాంగర్ జోన్‌గా మీ ఆఫీసును తయారు చేయండి – పని ఒత్తిడి లేకుండా ఉండాలంటే మీరు చేయవలసిన ముఖ్యమైన పని కోపం లేకుండా ఉంటూ మీ ఆఫీసును నో యాంగర్ జోన్ (కోపం లేని స్థానం)గా తయారు చేయడం. మీకు, ఇతరులకు ఈ విషయం గుర్తుండేలా ఈ మాటను అందరికీ బాగా కనిపించే స్థానంలో రాసి పెట్టండి తద్వారా మీరు పని చేసే స్థానంలో ప్రశాంతత మరియు మంచితనం సహజంగానే ఉండేలా చూసుకోండి.
  4. అందరికీ ప్రేమ, గౌరవాన్ని ఇస్తూ గొడవలు లేని బంధాలను తయారు చేసుకోండి – పని చేసే స్థానంలో ఒత్తిడి కలగడానికి ఒక ముఖ్యమైన కారణం – అనవసరంగా పోటీపడటం మరియు పోల్చుకునే గుణం. ఇవి అసూయ, ద్వేషాలకు దారి తీస్తాయి. అందరిపట్ల ప్రేమ, గౌరవం, వినయం ఉన్నప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఒత్తడి, ఆందోళన లేకుండా  కూడా ఉండగలుగుతారు.
  5. శ్రద్ధ మరియు నిర్లిప్తత యొక్క సమతుల్యతను ఉంచండి – మీ పని మీకు చాలా ముఖ్యం, అందుకు మీరు ఎంతో శ్రద్ధ వహించాల్సిందే. కానీ ఆ శ్రద్ధతోపాటు పని పట్ల అతి అనుబంధం ఒత్తిడికి దారి తీస్తుంది. కనుక, నిర్లిప్తంగా ఉండే వైఖరిని అలవర్చుకోండి, మీ పనిని ఈజీగా మరియు అంచనాల ఒత్తిడి లేకుండా చేయండి. ఈ సమతుల్యతను సాధించేందుకు, ప్రతి గంటకు ఒక నిమిషం మెడిటేషన్ సహాయపడుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th jan 2025 soul sustenance telugu

మీ సంకల్పశక్తి మీకు అతిపెద్ద బలం

మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలనుకున్నా, వ్యసనాన్ని వదులుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించాలనుకున్నా, విజయం లేదా వైఫల్యాన్ని మన సంకల్ప శక్తికి ఆపాదించుకుంటాము. కొన్నిసార్లు మనం అత్యధిక సంకల్ప

Read More »
19th jan 2025 soul sustenance telugu

మిమ్మల్ని విమర్శించే వ్యక్తులపై దృష్టి పెట్టవద్దు

మనం లేదా మనం చేసే పనికి మనల్ని ఇష్టపడని వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారి గురించి మనకు తెలిసినప్పటికీ, వారిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మనకు మద్దతు ఇచ్చి, సానుకూల శక్తిని పంపే

Read More »
18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »