14th-oct-2023-Soul-Sustenance-Telugu

October 14, 2023

పనికి ముందు స్థితి

జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప గుణం. కోపం మరియు అహం వినయం యొక్క అతిపెద్ద శత్రువులు, ఇతరులు మనల్ని చూసే విధానాన్ని, వారి హృదయాలలో మన గురించి భావనను పాడుచేస్తాయి. అహంకారిని ఎవరూ ఇష్టపడరు, అందరూ వారికి దూరంగా ఉంటారు. వారు ఆశీర్వాదాలను, గౌరవాన్ని కోల్పోవడమే కాకుండా ఆత్మగౌరవాన్ని కూడా కోల్పోతారు. అహంకారి సంతోషంగా ఉండలేరు మరియు వారు సాధించిన వాటితో అనగా నేను అందంగా ఉన్నాను, నేను తెలివైనవాడిని, నేను ధనవంతుడిని, నేను చురుకైనవాడిని, నేను అందమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాను, నేను సాధకుడిని, నా సంబంధాలు అందంగా ఉంటాయి …  అని ఇతరులపై  ఆధిపత్యం చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. అలాగే, వినయంతో పాటు, మీ నిజాయితీ మరియు సత్యత కూడా మిమ్మల్ని విజయవంతం చేస్తాయి. కొందరు వ్యక్తులు తమ జీవితంలో పెద్ద మైలురాళ్లను చేరుకుంటారు, కానీ వారు అక్కడకు చేరడానికి ఏదో ఒక రకమైన అబద్ధం లేదా మోసపూరితంగా ఉంటారు, ఇది అసత్యమైన  విజయం.

చివరగా, విజయం అంటే అడుగడుగునా ఇవ్వడం. మీరు కలిగి ఉన్న ప్రతి మంచిని ఇచ్చేవారుగా ఉండటం – అది భౌతిక లేదా భౌతికేతరమైనది కావచ్చు. ఈ గుణాన్ని కలిగి ఉన్నవారు సరైన మరియు సంపూర్ణ రీతిలో విజయం సాధించిన మంచి మానవులు. కాబట్టి, మీరు కలిగి ఉన్న వాటిని ఇతరులు కలిగి ఉండకపోయినా ఎల్లప్పుడూ వారిని గౌరవంగా చూడండి. అలాగే, వ్యక్తులపై ఆధిపత్యం చెలాయించే బదులు, వారిని ప్రభావితం చేసి, శక్తివంతం చేయండి. భౌతిక సంపదను, భౌతికేతర జ్ఞాన సంపదను కూడా అందరితో పంచుకోవాలి. అప్పుడు మీరు నిజమైన దాత, మీ విజయాల ప్రతికూల ప్రభావంతో మీరు తాకబడలేనట్టు. మీరు మీ విజయాలతో పురోగతి పొందుతారు మరియు వాటిపై ఎప్పుడూ అసత్యమైన ఆహాన్ని కలిగి ఉండరు, ఇదే నిజమైన విజయం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 2 )

ఆత్మానుభూతి పొందుతూ కర్మలలో ఆత్మానుభూతి చేసుకోవడం – మెడిటేషన్ కు ముఖ్యమైన పునాది ఆత్మ యొక్క స్పృహ ఉండడం. స్వయాన్ని ఆత్మగా అనగా జ్యోతి స్వరూపంగా భావిస్తూ, ఆత్మ యొక్క నిజగుణాలను అనుభూతి చేసుకోవడం.

Read More »
2nd Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 1)

ఒక పాజిటివ్ ఆలోచనతో మీ మెడిటేషన్ ను ప్రారంభించండి – మెడిటేషన్ ప్రారంభించే ముందు, మీరు స్వచ్ఛమైన మరియు ప్రశాంతమైన జీవి అని మరియు సర్వ గుణాల, శక్తుల సాగరుడైన భగవంతుడు మీ తండ్రి

Read More »
1st Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మీ ఆనందాన్ని వాయిదా వేయకండి

మనం ప్రతి క్షణం ఆనందంగా ఉండాలనుకుంటాము. అయినప్పటికీ, ఏదైనా కావాల్సినది జరిగే వరకు ఆ ఆనందాన్ని వాయిదా వేయడానికి మన మనస్సును ప్రోగ్రామింగ్ చేశాం. తద్వారా మనం మన మనుసును షరతులతో కూడినదిగా చేస్తాము.

Read More »