Hin

2nd june 2025 soul sustenance telugu

June 2, 2025

పనిలో నిర్లక్ష్యాన్ని అధిగమించి నిరంతరం అభివృద్ధి చెందడం

నిర్లక్ష్యం అనేది విషయాలను మెరుగుపరచడానికి ప్రయత్నం చేయనవసరంలేదనే భావన. కొన్నిసార్లు మనం మన వృత్తిపరమైన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే మన సామర్థ్యాన్ని అందించలేము మరియు మెరుగుపరచడానికి ప్రేరణ పొందలేము. ఇది మన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత సామర్థ్యానికి, అభివృద్ధికి హానికరం. మన పని పట్ల ఉత్సాహంగా ఉన్నప్పుడు, జీవితంలో సాధించిన భావం ఉంటుంది. మనకు మన ప్రయత్నాలు సరిపోతున్నాయనే భావన కలిగిన వెంటనే, మన దృష్టి, శక్తి తగ్గిపోతాయి, దాంతో మన వృత్తి ఎదుగుదల ఆగిపోతుంది. మన వృత్తిపరమైన పనిలో మనం ఆశించే ఫలితాలను పొందలేము. 

  1. సమయం గడిచే కొద్దీ మరియు మన వృత్తిపరమైన పనిలో ఎక్కువ అనుభవం పొందుతున్న కొద్దీ నిర్లక్ష్యం రావచ్చు. కాలక్రమేణా, కొంతమంది తమ పనిని తేలికగా తీసుకోవడం ప్రారంభిస్తారు. కొంతమందిలో లక్ష్యం లేని తృప్తి భావన కలిగి వారు కేవలం యంత్రాల్లా పనిచేస్తుంటారు. విసుగు, వృత్తిపరంగా ఒకే రకమైన పని లేదా ప్రేరణ లేకపోవడం వల్ల మీరు నిర్లక్ష్యంగా ఉన్నారా? ఒకసారి మీకు కారణం తెలిస్తే, మీరు దాన్ని అధిగమించవచ్చు. 
  2. మీరు మీ ఆఫీసులో సమస్యను ఎదుర్కొంటే, అక్కడ ఉన్న సంబంధిత వ్యక్తితో చర్చించి, సమస్య సంభవించిన లేదా సంభవిస్తున్న కారణాలను తెలుసుకోండి. వెంటనే దాన్ని పరిష్కరించండి. లేదంటే, ఆ సమస్య వల్ల మీలో కలిగిన నిరాశ లేదా అసంతృప్తి పని పట్ల ఆసక్తిని కోల్పోయేలా చేసి, అలసత్వానికి దారితీయొచ్చు.
  3. మీ జీవితంలోని ఇతర అంశాల మాదిరిగానే ప్రేమ మరియు దృఢనిశ్చయంతో మీ వృత్తిని సంరక్షించండి. స్పష్టమైన వృత్తిపరమైన లక్ష్యాలను ఏర్పరచుకొని మీ పురోగతిని సమర్థవంతంగా అనుసరిస్తూ ఉండండి. ప్రతి రోజు మీ పని గురించి మీరు ఎలా భావిస్తున్నారో పరిశీలించండి – వృత్తిపరమైన పనులు, సహోద్యోగులు మరియు సంస్థ గురించి మీ ఆలోచనలు, మాటలు, ప్రవర్తనలపై దృష్టిపెట్టండి. అవి నెగటివ్‌గా లేదా తప్పుగా ఉన్నట్లయితే వాటిని మార్చండి మరియు ఆ మార్పును భవిష్యత్తు కొరకు నిలుపుకోండి. 
  4. ఆధ్యాత్మిక సాధనాలను జ్ఞానం మరియు ధ్యానాన్ని ఉపయోగిస్తూ మీ పాత్రలు మరియు వృత్తిపరమైన బాధ్యతలను చక్కగా నిర్వహించడానికి ప్రేరేపించబడండి. ఉద్యోగం చేసేందుకు మీ చిత్తశుద్ధి, క్రమశిక్షణ, సంకల్పశక్తి మరియు కృతజ్ఞత వంటి లక్షణాలను బలోపేతం చేయడానికి ఆధ్యాత్మికత మీకు సహాయపడుతుంది. మీ ప్రతిభను మరియు నైపుణ్యాలను తెలివిగా ఉపయోగించుకోవడంపై  మీరు మరింత చురుకుగా మారతారు, అలాగే పనిలో ఉన్న అలసత్వాన్ని పూర్తిగా అధిగమించగలుగుతారు.

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »