Hin

22th dec 2024 soul sustenance telugu

December 22, 2024

పరధ్యానంను జయించడం

మనలో కొందరు కొన్నిసార్లు మన పర్స్ లేదా ఫోన్ ఎక్కడ ఉందో మర్చిపోతారు. లేదా మనము కార్యాలయానికి చేరుకొని ఇంటి తలుపుకు తాళం వేసి ఇంట్లో లైట్లు ఆపివేసినట్లు గుర్తు ఉండదు. పరధ్యానంగా ఉండటం అంటే మన మనస్సు వేరొక దానిపై నిమగ్నమై, పొంగిపోయి లేదా అలసిపోయిందని అర్థం. మీరు తరచుగా పరస్పర చర్యల మధ్యలో శ్రద్ధని కోల్పోతున్నారా? మీరు ఎప్పటికప్పుడు కార్యకలాపాలు లేదా వస్తువులను ఎక్కడైనా పెట్టేసి మరచిపోతున్నారా? అవును అయితే, పరధ్యానం మీ సాధారణ జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. 

  1. అనేక కార్యకలాపాలతో మనస్సు భారంగా అవ్వడంతో పాటు, ఇబ్బంది పెట్టె గత జ్ఞాపకాలు, ఇతరుల ప్రవర్తనలు, అపరాధం, అంచనాలు మరియు మీ స్వీయ-చిత్రం యొక్క ఆలోచనల గందరగోళాన్ని మీ మనస్సు కలిగి ఉండవచ్చు. అవసరమైన వాటికి స్థలాన్ని సృష్టించడానికి మనస్సు శుభ్రంగా ఉండాలి. 
  2. పరధ్యానంను ఆపడానికి, అంతర్గతంగా స్వయాన్ని శక్తివంతం చేసుకోండి. ధ్యానం, ఆధ్యాత్మిక జ్ఞానం, అధ్యయనం, వ్యాయామం, సకాలంలో ఆరోగ్యకరమైన భోజనం, కార్యకలాపాలు, ఖాళీ సమయం మరియు నిద్ర వంటి రోజువారీ దినచర్యను అనుసరించడానికి కట్టుబడి ఉండండి. ఇవి మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మరియు అంతర్ దృష్టిని మెరుగుపరుస్తాయి.
  3. రోజువారీ పనుల జాబితాను తయారు చేసి, దానిని అనుసరించండి. ఇతరులతో సంభాషించేటప్పుడు, బాగా వినండి. ఇతర ఆలోచనలు, గాడ్జెట్లు లేదా మీ చుట్టూ ఏమి జరుగుతుందో అని పరధ్యానంలో పడకండి. మీ వద్ద ఉన్న కీస్, పర్స్, కళ్ళజోడు మొదలైన వస్తువులకు సరైన స్థలాలను గుర్తించండి.
  4. వర్తమానంలో ఉండండి. ప్రతి గంట తర్వాత మీ ఆలోచనలను చెక్ చేసుకోండి, వాటిని శుభ్రపరచండి మరియు మీ ధ్యాసను ప్రస్తుత క్షణానికి తీసుకురండి. మీ మనస్సును ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంచడానికి ప్రతి పరిస్థితికి సరిగ్గా స్పందించండి.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »