Hin

14th nov 2023 soul sustenance telugu

November 14, 2023

పరమాత్ముని పూదోటలో ఆత్మిక రోజాలు

భౌతిక పుష్పాలలో ముఖ్యమైనవి వాటి రంగు, రూపం, సుగంధం – వీటితో మనం వాటి సౌందర్యాన్ని నిర్ణయిస్తాం. ఈ గుణాలన్నిటికీ వాటి వాటి ప్రత్యేకత ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగు పెట్టడమంటే సర్వోన్నత తోటమాలి అయిన పరమాత్మ చేతిలో స్వయాన్ని ఉంచడమని అర్థం. భౌతిక తోటమాలి ఓపిక, అవిరామం, ప్రేమ, దూరదృష్టి, నమ్మకం కలిగి ఉంటాడు. సర్వోన్నత తోటమాలి ఈ గుణాలన్నింటి సాగరుడు. వారి పాలన మరియు సంరక్షణలో మనం ఉన్నప్పుడు, కొంత సమయం తర్వాత, మనం అందమైన ఆత్మిక పుష్పాలుగా వికసిస్తాం, మనకున్న ముళ్ళు తొలగిపోతాయి.

రంగు

మనల్ని మనం ఆత్మిక పుష్పాలుగా చూసుకున్నప్పుడు, రంగును ఆధ్యాత్మిక విజ్ఞానంతో పోలుస్తాం. సర్వోన్నత తోటమాలి అందించన జ్ఞానాన్ని ఎంతగా ఆచరిస్తామో; దైనందిన జీవితంలో ఎంతగా ఇనుమడింపజేసుకుంటామో; మన ఆలోచనలు, మాటలు, చేతలు మరియు బంధాలలోకి ఎంతగా తీసుకువస్తామో అంత అందమైన రంగు మనకు వస్తుంది.

 

రూపము

సర్వోన్నత తోటమాలితో మన మెడిటేషన్ ఎంత చక్కగా కుదురుతుందో దానిని బట్టి మన ఆత్మిక రూపం తయారవుతుంది. పరమాత్మునితో ఎంత లోతుగా కనెక్షన్ ఉంటుందో అంత అందమైన రూపం మనదవుతుంది.

 

సుగంధం

చివరగా, సుగంధం అంటే మనం పెంపొందించుకునే పవిత్రత, మధురత, వినయం, సహనం, నిశ్చింతత మొదలైనవి.

చక్కని రంగు, రూపం మరియు సుగంధం ఉన్న భౌతిక పుష్పాలు అందరినీ ఆకర్షిస్తాయి. వాటి వద్దకు వెళ్ళి వాటిని చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆత్మిక పుష్పాల విషయం కూడా ఇంతే. అన్ని పుష్పాలకెల్లా రోజాలు ఉత్తమమైనవి అంటారు. మంచి రంగు, రూపం మరియు సుగంధంతో అవి ఉంటాయి. నిరంతరం ఆధ్యాత్మిక స్పృహలో ఉంటూ  ఆ స్పృహ అనే సుగంధాన్ని అందరికీ పంచేవారే ఆత్మిక రోజాలు. ఈ స్పృహ ఆధారంగానే వారి ఆలోచనలు, మాటలు మరియు చేతలు తయారవుతాయి.  వారికి పరమాత్మతో గాఢమైన అనుబంధం ఉంటుంది. ఇతరులు కూడా సర్వోన్నత తోటమాలితో అనుబంధాన్ని పెంచుకుని వారు కూడా ఆత్మిక పుష్పాలుగా అవ్వాలన్న తపన వారిలో ఉంటుంది. పరమాత్మకు ప్రతి ఆత్మ పట్ల ఉన్న ప్రగాఢ కోరిక ఇది. ఆ సర్వోన్నతుడికి ఉన్న ఈ కోరికను తీర్చడంలో వీరు తమ సహకారాన్ని అందిస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ

Read More »
16th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి

Read More »
15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »