Hin

18th august 2024 soul sustenance telugu

August 18, 2024

పరంధామంలో భగవంతుడిని అనుభవం చేసి విజువలైజేషన్ చేయడం

భగవంతుడు ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానంలో ఆత్మ యొక్క దివ్య జ్ఞానం గురించి, ఆత్మ యొక్క యధార్ధమైన నివాస స్థానం గురించి ఉంది.  ఆ నివాస స్థానమునే  పరంధామం అని అంటారు. పరంధామం పరమాత్మ నివసించే స్థానం కూడా.  స్వయాన్ని ప్రకాశించే బిందువుగా, ఆధ్యాత్మిక స్థితిలో స్థితి అయి ఉన్న ఆత్మగా పరంధామంలో అనుభూతి చెందుతూ ఎదురుగా సర్వోన్నతుడైన పరమాత్మను చూస్తూ, వారు వెదజల్లే శాంతి, పవిత్రత, ఆనందం, ప్రేమ మరియు శక్తుల ఆధ్యాత్మిక ప్రకాశంతో ఆత్మను నింపుకోవడమే రాజయోగ మెడిటేషన్. అనేక జన్మలు తీసుకుంటూ ఆత్మ ఈ గుణాలను ప్రతికూలత మరియు అపవిత్రత కారణంగా కోల్పోయింది. మన మూడవ నేత్రము ద్వారా సర్వోన్నతుడైన భగవంతునిపై స్పష్టంగా దృష్టి పెట్టగలిగే విధంగా, పరంధామం యొక్క లోతైన శాంతి మరియు స్వచ్ఛతను అనుభూతి పొందే విధంగా మన విజువలైజేషన్ని మెరుగుపరిచేందుకు  5 ముఖ్యమైన విధానాలను  చూద్దాం –

  1. మన విజువలైజేషన్ మెరుగుపరచడానికి అత్యంత ముఖ్యమైన విధానాలలో ఒకటి ప్రతి ఆలోచన, మాట మరియు చర్యలో పవిత్రత మరియు స్వచ్ఛత కలిగి ఉండటం. ఆ స్వచ్ఛతను అనుభూతి చెందడానికి మనల్ని మనం భృకుటి మధ్యలో శాంతి మరియు పవిత్రతతో నిండిన శక్తివంతమైన నక్షత్రం అయిన ఆత్మగా అనుభూతి చేసుకోవడం సహాయపడుతుంది.
  2. శాకాహార ఆహారం తీసుకోవడం వల్ల శరీరం మరియు ఆత్మ సానుకూల శక్తితో నిండి, విజువలైజేషన్లో మనకు ఎంతో సహాయపడుతుంది. అలాగే, భగవంతుని జ్ఞాపకం చేసుకుంటూ సాత్విక ఆహారాన్ని వండడం మరియు తినడం వల్ల ఆహరం దైవీ శక్తితో నిండుతుంది.
  3. మన మనస్సును సానుకూల ఆలోచనలతో నింపడం, ప్రతికూల మరియు వ్యర్థ ఆలోచనల నుండి విముక్తి పొందడం వల్ల మూడవ నేత్రం స్వచ్చంగా ఉంటుంది. మనం మెడిటేషన్ చేయడానికి కూర్చున్నప్పుడు, మనం భగవంతుడితో సులభంగా కనెక్ట్ అవ్వగలుగుతాము.
  4. మన ఆలోచనలకు విరామం మరియు రోజులో క్రమం తప్పకుండా ఆలోచనల ట్రాఫిక్ని నియంత్రణ చేయడం వలన మన దృష్టిని నిలిపి ఏకాగ్రతను పెంచగలుగుతాము. ఇదే మంచి విజువలైజేషన్ మరియు మెడిటేషన్ కు మూలం.
  5. నిద్రించే ముందు భగవంతునికి ఒక చిన్న లేఖ రాసి మన జీవితంలోని అన్ని ప్రతికూల పరిస్థితుల నుండి మనల్ని మనం విడిపించుకోవడం మరుసటి రోజు ఉదయం మెడిటేషన్లో సహాయపడుతుంది. ఉదయాన్నే మంచి విజువలైజేషన్ రోజంతా మెడిటేషన్లో సహాయపడుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »