Hin

21st jan 2025 soul sustenance telugu

January 21, 2025

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 1)

మనమందరం మన ముందు ఎల్లప్పుడూ వివిధ రకాల సవాళ్లతో మన జీవితాలను గడుపుతాము. మనమందరం ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సవాళ్లలో లేదా మన పిల్లలు ఎదుర్కొనే అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటి పాఠశాల లేదా కళాశాల పరీక్షలు. ఇది మన మరియు వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. రాబోయే రోజుల్లో మాకు ఒక ముఖ్యమైన పరీక్ష ఉందని మన సన్నిహితులు కొందరు చెప్పడం మనం తరచుగా వింటాము. ఇవి ఎక్కువగా పాఠశాల లేదా కళాశాల పరీక్షలు, వాటిని ఇవ్వడం చాలా ముఖ్యం. వాటిలో బాగా రాణించాలని కూడా మనము కోరుకుంటున్నాము. 

 

కాబట్టి, తల్లిదండ్రులుగా, స్నేహితుడిగా , బంధువుగా, నాకు దగ్గరగా ఉన్నవారు పరీక్షల్లో విజయం సాధించడానికి నేను ఏమి సలహా ఇవ్వాలి? ముఖ్యమైన పరీక్షలు ఇవ్వడంలో మొదటి అడుగు మానసికంగా దృఢంగా మరియు పట్టుదల ఉండటం. వాటి పట్ల సానుకూల దృక్పథంతో పాటు సానుకూల వైఖరిని కలిగి ఉండటం. కొన్ని సార్లు తెలివైన పిల్లలు లేదా పెద్దలు వారి పరీక్షలలో బాగా రాణించరు. భయం మరియు ఆందోళన వలన ప్రభావితమై, ఏకాగ్రత లోపించడమే అందుకు కారణం. వారి కోర్సులలో మరియు సిలబస్లో  బాగా సిద్ధమైన కొంతమంది విద్యార్థులు, చివరి క్షణంలో, వారికి ఎదురైనా ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేరు ఎందుకంటే వారి మనస్సులు అనేక ఆలోచనలతో నిండి ఉంటాయి. చాలా వరకు ఆ ఆలోచనలు ప్రతికూలమైన మరియు అనవసరమైన వైఫల్యం లేదా వైఫల్య భయం కలిగి ఉంటాయి. మరోవైపు,కొంతమంది విద్యార్థులు  తక్కువ సంసిద్ధమైనా కానీ మానసికంగా బలంగా ఉన్న కూడా కొన్నిసార్లు బాగా రాణిస్తారు ఎందుకంటే వారికి మానసిక స్థిరత్వం మరియు సానుకూలంగా రాణించాలనే ప్రేరణ చాలా ఎక్కువ. ఈ సందేశంలో, మానసిక బలం మరియు ఏకాగ్రతను పెంచడానికి ఎనిమిది మార్గాలను వివరిస్తాము, ఇది విద్యార్థులకు వారి పరీక్షలలో సహాయపడుతుంది. మీరు పెద్దవారైనా, పరీక్షల కొరకు చదివేవారు కాకపోయినా, జీవితంలోని వివిధ సమస్యలలో కూడా అవి మీకు సహాయపడతాయి. 

(సశేషం…)

రికార్డు

18th july 2025 soul sustenance telugu

స్వీయ సందేహం మరియు అభద్రతలను అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆనందాన్ని క్షీణింపజేసి, మనకు నిరాశ కలిగించే ఒక భావోద్వేగం – అభద్రత. మన గురించి, మన సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థికం

Read More »
17th july 2025 soul sustenance telugu

ఇదే సరైన సమయం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మీరనుకున్న మార్పును తీసుకురావడానికి లేదా అసంపూర్ణంగా ఉన్న పనిని పూర్తి చేయడానికి ఏది సరైన సమయం? నేను నూతన సంవత్సరంలో ప్రారంభిస్తాను…

Read More »
16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »