Hin

22nd jan 2025 soul sustenance telugu

January 22, 2025

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 2)

పరీక్షల సమయంలో  లేదా జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కొంటున్నప్పుడు స్థిరంగా ఉండటానికి చాలా ముఖ్యమైన మార్గం అంతర్గత శాంతి, శక్తి , స్థిరత్వంతో నిండిన కొన్ని సానుకూల ఆలోచనలను చేస్తూ రోజులో కొన్ని సార్లు మీ మనస్సులో వాటిని రిపీట్ చేయడం. ఉదా.  నేను శాంతియుతమైన ఆత్మను, ఆంతరిక శక్తితో నిండి ఉన్నాను. నేను ప్రతి పరిస్థితిలో స్థిరంగా ఉంటాను లేదా నేను శాంతియుతంగా చదువుతాను, ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉంటాను. నా చదువు చాలా సులువైనది, నేను దానిపై సులువుగా శ్రద్ధ చూపుతాను. ఈ స్వీయ-సంభాషణలు మీరు మేల్కొన్న వెంటనే ఉదయం నుండి ప్రారంభమై, మీరు నిద్రపోయే ముందు రాత్రి వరకు చేయవచ్చు. సానుకూల ధృవీకరణలు మీ భయాన్ని తగ్గిస్తాయి, మీ ఆత్మవిశ్వాసం మరియు ప్రేరణ స్థాయిలను పెంచుతాయి. రోజుకు 10-12 సార్లు ఏదైనా తినడానికి లేదా త్రాగడానికి ముందు దీన్ని చేయవచ్చు. రెండవది, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తి అయిన భగవంతుడు ప్రతి అడుగులోనూ నాకు నిరంతర సహచరుడు అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అలాగే, నేను భగవంతుడిని గుర్తుచేసి, నా పరీక్ష బాధ్యతను వారికి వదిలేస్తే, నేను ఒత్తిడికి గురికాను. చదువుతున్నప్పుడు భగవంతునితో మాట్లాడండి-భగవంతుడా, మీరు నా మంచి స్నేహితుడు, సహచరుడు మరియు నా విజయ గమ్యస్థానానికి నన్ను తీసుకెళ్లడానికి నేను మీ చేతిని పట్టుకుంటాను. ఈ విధంగా, మీరు చాలా తేలికగా ఉంటారు. అధ్యయనం చేసేటప్పుడు మరియు పరీక్ష ఇచ్చేటప్పుడు భగవంతుడు మీతో కూర్చున్నాడు అని అనుభూతి చేసుకోండి, తద్వారా మీరు తేలికగా ఉండటమే కాకుండా మీరు మీ పరీక్షలలో అపారమైన సంతృప్తి మరియు విజయంతో రాణిస్తారు.

 

పరీక్షల సమయంలో శక్తివంతంగా మరియు మానసికంగా కేంద్రీకృతమై ఉండటానికి మరొక పద్ధతి – మీరు మరియు మీ సన్నిహితులు నిర్వచించిన విధంగా మీ జీవితంలో జరగాలని మీరు కోరుకొని మీ భవిష్యత్తుకు ముఖ్యమైన మీ పరీక్ష ఫలితాల విజయ దృశ్యాన్ని దృశ్యమానం చేయడం.  నేను నా తరగతి లేదా పాఠశాల లేదా కళాశాలలో అద్భుతంగా రాణిస్తానని ఎప్పుడూ అనుకోండి. మీ కంటే చదువులో మెరుగ్గా ఉన్న చాలా మంది స్నేహితులు ఉన్నప్పటికీ, మీ విజయాన్ని నమ్మకంతో దృశ్యమానం చేయండి. ఆశ మరియు సంకల్పంశక్తితో నిండినప్పుడు సానుకూల విజువలైజేషన్ వాస్తవంగా మారుతుంది. నాల్గవది, నా సన్నిహితులందరి శుభాకాంక్షలు నాతో ఉన్నాయని ఎల్లప్పుడూ అలోచించి విశ్వసించండి. ఎవరితో అయితే ఎందరో వ్యక్తుల ఆశీర్వాదాలు మరియు సానుకూల శక్తి ఉంటాయో వారు మరింత విజయవంతమవుతారు. కాబట్టి మీ కుటుంబ సభ్యులు , సన్నిహిత స్నేహితులతో సహా మీరు కలిసే వ్యక్తులందరూ మీకు అన్ని సమయాల్లో వారి ప్రేమ, మద్దతును అందిస్తున్నారని నిర్ధారించుకోండి. అలాగే, మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి, వారు మీ గురించి ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచిస్తున్నారని, బాగా చేయమని మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్నారని నిర్ధారించుకోండి.

(సశేషం…)

రికార్డు

15th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 1)

సంబంధాలు జీవితానికి ప్రాధమిక నిధి, కానీ సంబంధంలో ఏ వ్యక్తిలోనైనా అహం పెరిగినప్పుడు అవి తప్పుడు మార్గంలో వెళ్తాయి. వ్యక్తులు ఎల్లప్పుడూ వినయపూర్వకమైన వారితో సంతృప్తి చెందుతారని మీరు కనుగొంటారు. అలాగే అహంకారం లేని

Read More »
14th feb 2025 soul sustenance telugu

విశ్వసించండి. ఇక మీరు విజయం సాధిస్తారు

మీరు మీ పెద్ద లేదా చిన్న లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటూ వాటిని చేరుకోవడానికి చాలా కష్టపడ్డారా… కానీ ఎక్కడో ఒక చోట విజయం సందేహాస్పదంగా అనిపించిందా? అది ఫలితాన్ని ఎలా ప్రభావితం

Read More »
13th feb 2025 soul sustenance telugu

స్వీయ నియంత్రణ కళలో ప్రావీణ్యం పొందటం

మనమందరం బాగా జీవించడానికి మన జీవితాలపై నియంత్రణ కలిగి ఉండాలని కోరుకుంటాము. మన మనస్సు, బుద్ధి మరియు స్వభావాన్ని నియంత్రించడం మన శక్తి. అది మన భౌతిక ఇంద్రియాలను కూడా ఆటోమేటిక్ గా నియంత్రిస్తుంది.

Read More »