Hin

23rd jan 2025 soul sustenance telugu

January 23, 2025

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 3)

పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు, చదివే సమయంలో దృష్టి కేంద్రీకరించే మీ సామర్థ్యాన్ని మరియు ఏకాగ్రతని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. నేను అధ్యయనం పూర్తి చేయడానికి లేదా నా కోర్సులో ఒక అధ్యాయాన్ని సవరించడానికి చాలా సమయం తీసుకుంటున్నానా? అని మిమ్మల్ని మీరు తనిఖీ చేసుకోండి.  అవును అయితే, మీ మనస్సులోని ఆలోచనల సంఖ్యను తనిఖీ చేయండి. అవి ఎక్కువ సంఖ్యలో ఉండటమే కాదు, వాటిలో చాలా వరకు అనవసరమైనవి మరియు మీ అధ్యయనాలకు సంబంధం లేనివి అనగా అవి గతానికి సంబంధించినవి కావచ్చు లేదా భవిష్యత్తు లేదా ఇతర వ్యక్తులవి కావచ్చు. మీ చదువును ఆపి, రోజులో ప్రతి గంటకు 1 నిమిషం మౌనంగా ఉండి, ఆ తక్కువ సమయాన్ని ధ్యానానికి ఇవ్వడం ద్వారా ఈ అనవసరమైన ఆలోచనలను తగ్గించండి. ఇది మీ ఆలోచనలను తగ్గిస్తుంది మరియు తదుపరి 59 నిమిషాలకు మీ ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే, ఒక విద్యార్థిగా, మీరు ఇప్పుడు చేసే ప్రయత్నం చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోండి, ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారం, మీరు ఏ విత్తనం అయితే నాటుతారో ఆ పంటనే కోస్తారు. మీరు ఎంత కష్టపడి చదివితే , అంత ఎక్కువ ఆనందాన్ని అనుభూతి చేస్తారు. ఇది వర్తమానంలోనే కాకుండా మీ భవిష్యత్ లో కూడా మీకు అనేక విధాలుగా శక్తిని ఇస్తుంది. ఇది మిమ్మల్ని బాధ్యతాయుతంగా మరియు దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. మీరు పరీక్ష వ్యవధిని మరియు దానికి ముందు సమయాన్ని గంభీరంగా చూస్తారు. 

 

పరీక్షలను ఎదుర్కోవటానికి విజయానికి ఏడవ సూత్రం నిర్లిప్తత వైఖరి. ఆధ్యాత్మిక నియమాల ప్రకారం, మనస్సు యొక్క స్వేచ్ఛను మరియు అధ్యయనాలలో విజయాన్ని అనుభూతి చేసుకోడానికి, ఒక ముఖ్యమైన దశ మీ చదువుల నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడం, అనుబంధానికి బదులుగా తేలికపాటి వైఖరితో పనిని చూడటం, ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురి కాకుండా , పనిని పూర్తి చేయడం గురించి ఆందోళన చెందకుండా చేస్తుంది. నిర్లిప్తతను అనుభూతి చేసుకోవడానికి , మీ అధ్యయన గంటలను ఎక్కువసేపు ఉంచకుండా, ఏకాగ్రతతో నిండి ఉండేలా చూసుకోండి. చివరగా, ప్రతి ఉదయం కనీసం ఒక పేజీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదవడం ద్వారా పరీక్ష ఒత్తిడిని తగ్గించడం విజయానికి ఎనిమిదవ సూత్రం.  మీరు మీ చదువును ప్రారంభించడానికి ముందే ఇది చేయవచ్చు. ఇది మిమ్మల్ని రోజంతా తేలికగా, ప్రశాంతంగా మరియు సానుకూలంగా ఉంచుతుంది. మనస్సు తెల్లవారుజామున ఒక బ్లాటింగ్ పేపర్ లాగ ఉంటుంది , మీరు సానుకూలత గురించి ఏ జ్ఞానం ఇచ్చినా, అది చాలా సులభంగా, వేగంగా గ్రహించి  మిమ్మల్ని రోజులో సానుకూల సమాచారంతో,  మీ చదువు పట్ల మీ వైఖరిని సానుకూలంగా మరియు ఖచ్చితమైన విజయాలతో నింపి ఉంచుతుంది  అని గుర్తుంచుకోండి.

రికార్డు

24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »
23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »
22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »