Hin

29th july 2024 soul sustenance telugu

July 29, 2024

పరిపూర్ణ ఆరోగ్యం కోసం ఆహారం మరియు నీటిని శుద్ధి చేయడం

ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. ఇది కేవలం సేంద్రీయ తయారీలు, పోషకాలు, పండ్లు మరియు కేలరీల గురించి మాత్రమే కాదు. మనం తినే ఆహారం, త్రాగే నీరు వైబ్రేషన్లను కలిగి ఉంటాయి, వీటిని ఒకసారి తీసుకోగానే మన వ్యవస్థలో భాగంగా మారుతాయి. అవి మన ఆలోచనలు, మానసిక స్థితి మరియు సంస్కారాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. దివ్యమైన భావాలతో ఆహారాన్ని తయారు చేస్తూ భోజనాన్ని శక్తివంతం చేయడం దాని వైబ్రేషన్లను ఉన్నతంగా చేసి మన శక్తిని పెంచుతుంది. మీరు పోషకమైన ఆహారం తింటూ, కేలరీలు చూసుకుంటూ, జంక్ ను నివారిస్తూ ఉన్నప్పటికీ, మీరు నిస్తేజంగా లేదా అలసిపోయినట్లు భావిస్తున్నారా? ఆహారం, నీరు తమ పరిసరాల నుండి వైబ్రేషన్లను గ్రహిస్తాయని మీకు తెలుసా? ఆహారం యొక్క వైబ్రేషన్ల శక్తి దాని పోషక శక్తి వలె ముఖ్యమైనది. మన ఆహారంలోని వైబ్రేషన్లు మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. ఉన్నత-శక్తి కలిగిన ఆహారాన్ని ఎంచుకోవడం మరియు ప్రతి భోజనాన్ని ప్రశాంతమైన మానసిక స్థితితో తయారు చేయడం చాలా ముఖ్యం. మనం భోజనం తీసుకునే ముందు దానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, దానిని ఆశీర్వదిస్తూ 30 సెకన్ల పాటు ధ్యానం చేద్దాం. నేను సంతోషంగా ఉన్నాను… నాకు కావలసినవన్నీ నా దగ్గర ఉన్నాయి అనే మన ధృవీకరణలను కూడా ఆశీర్వాదాలతో పాటు జోడించవచ్చు.

పరిశుభ్రమైన వాతావరణంలో మరియు శక్తివంతమైన మానసిక స్థితిలో తయారుచేసిన ఆహారాన్ని తీసుకోండి. ప్రతి భోజనానికి ముందు, అన్ని పరధ్యానాల నుండి వైదొలగి ప్రశాంతంగా, సంతోషంగా ఉండండి. మన ప్లేట్లో ఆహారం ఉన్నందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రార్థన చేయండి, దానిని తయారు చేసి ప్రేమగా వడ్డించిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేయండి. మీ ఆలోచనలు, వైబ్రేషన్లు మీ ప్రతి భోజనం మరియు నీటిలో ఒక భాగంగా మారి వాటిని శక్తివంతం చేస్తాయి. మీ శరీరానికి ఆరోగ్యకరమైనవి మాత్రమే తినండి. రుచి కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆహారం మరియు నీటిని శక్తివంతం చేయడం అలవాటు అయిన తర్వాత, మీరు మంచి భావోద్వేగ ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. భోజనం చేసేటప్పుడు, ఆ 10-15 నిమిషాలు భోజనంపై దృష్టి పెట్టండి, మౌనంగా తినండి, ప్రతికూల సంభాషణలు వద్దు, ఆహారం గురించి ప్రతికూల వ్యాఖ్యలు వద్దు. ఆహారాన్ని గౌరవిస్తూ దానితో మంచి సంబంధాన్ని కలిగి ఉండండి. ఈ విధంగా మీరు తినేవి, తాగేవి సాత్వికమవుతాయి. మీ ఆహారం ప్రసాదం అవుతుంది, నీరు అమృతం అవుతుంది. మీ మనస్సు, శరీరాన్ని నయం చేస్తూ అవి మీకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »
27th april 2025 soul sustenance telugu

మీ సంతోషాల గురించి మాట్లాడండి, బాధల గురించి కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో ఎన్ని మంచి విషయాలు జరిగినా, మంచి మరియు సానుకూల విషయాలకు బదులుగా మన ఆరోగ్యం, ఆర్థిక, సంబంధాలు మరియు

Read More »
26th april 2025 soul sustenance telugu

మనకు మనమే ఎమోషనల్ డిటాక్స్ చేసుకోవాలి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి కొన్ని నిమిషాలకు వివిధ మీడియా నుండి వచ్చే సందేశాలను చదవడానికి మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ని చెక్ చేసే అలవాటు

Read More »