Hin

1st mar 2024 soul sustenance telugu

March 1, 2024

పరిపూర్ణ ఏంజెల్ గా మారడానికి 5 సోపానాలు (పార్ట్ 1)

మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం మనం అందరినీ గౌరవిస్తూ, కలిసే ప్రతి  ఒక్కరినీ  అభినందించడం. వ్యక్తులు మన నుండి ప్రేమతో కూడిన ప్రవర్తనను ఆశిస్తారు. కాబట్టి, నా స్వభావంతో మరియు నా అంతర్గత సానుకూలత నుండి ప్రసరించే శుభాభావనలతో ఇతరులకు సేవ చేయడానికి, నేను అన్ని గుణాల సంపదతో నిండి ఉండాలి. నాలో ఒక్క సానుకూల స్వభావం లేదా సుగుణం కూడా లోపించకూడదు. మనం గుణాలన్నిటితో నిండినప్పుడు, ఇతరులు మన నుండి పరిపూర్ణతను అనుభూతి చెంది వారు కూడా పరిపూర్ణులుగా మారడానికి ప్రేరణ పొందుతారు. కొన్నిసార్లు ఒక ప్రతికూల పదం, చర్య లేదా ముఖకవళిక కూడా వ్యక్తులను మన నుండి దూరం చేసి వారు ప్రతికూలత వైపు మొగ్గు చూపేలా చేయవచ్చు. ఈ సందేశంలో, అందరినీ సంతృప్తిపరిచే మరియు ఇతరులు అనుసరించడానికి ఒక ఉదాహరణగా మారే ఒక పరిపూర్ణ మానవుడు లేదా ఏంజెల్ గా మారడానికి వివిధ ఆచరణాత్మక పద్ధతులను పరిశీలిద్దాం:  

 

  1. నేను ఒక ఆత్మను అనే భావనను సృష్టించండి – పరిపూర్ణంగా మారడానికి మొదటి మరియు అన్నిటికంటే ముఖ్యమైన అడుగు స్వయాన్ని కేవలం మానవ రూపంలో మాత్రమే కాక ఒక ఆధ్యాత్మిక జీవిగా చూడటం. ఎందుకంటే ఆత్మయే అన్ని చర్యలను చేస్తుంది. ఆత్మీక స్పృహ ద్వారా నేను చేసే ప్రతి పనికి నేనే బాధ్యుడను అని గుర్తుంచుకోవడం ద్వారా నన్ను సానుకూలంగా, శక్తివంతంగా చేసి నాలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుతుంది. ఆత్మ అనేది స్వీయ-జ్ఞానం, సంకల్ప శక్తితో ఏదైనా ఆలోచన మరియు వ్యక్తిత్వ మార్పును తీసుకురాగల అపారమైన శక్తి. కాబట్టి, మీరు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచినప్పటి నుండి రోజంతా, నేను ఆత్మను అనే భావనను మీ మనస్సులో ఉంచుకొని చర్యలను అందంగా మరియు పరిపూర్ణంగా చేయండి.

 

(సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »
15th march 2025 soul sustenance telugu

ద్వేషం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అనేక విభిన్న సంబంధాల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒక అందమైన సంబంధం ఎలాంటి ద్వేషం లేని నిజమైన ఆత్మిక ప్రేమ పై

Read More »