Hin

2nd mar 2024 soul sustenance telugu

March 2, 2024

పరిపూర్ణ ఏంజెల్ గా మారడానికి 5 సోపానాలు (పార్ట్ 2)

  1. భగవంతుడు మిమ్మల్ని చూస్తున్నాడని గుర్తుంచుకోండి – మనం పరిపూర్ణంగా మారడానికి ఉత్తమ మార్గం మన ఆత్మిక తల్లితండ్రి అయిన భగవంతుడు మనల్ని చూస్తున్నారని గుర్తుంచుకొని, మనం ఎల్లప్పుడూ సానుకూల లక్షణాలను అలవర్చుకోవాలని వారు కోరుకుంటున్నారని తెలుసుకోవడం. పిల్లవాడు బాహ్య పర్సనాలిటీతో పాటు ఆంతరికంగా సుందరంగా ఉండాలని ప్రతీ తల్లితండ్రి తన బిడ్డ నుండి కోరుకుంటారు.  అలాగే భగవంతుడు గురువుగా అయ్యి మనల్ని చూస్తున్నాడు. జీవితంలో మనం గౌరవం ఇచ్చిపుచ్చుకునే వ్యక్తిగా, ఇతరులను సంతృప్తిపరిచే వ్యక్తిగా, ఇతరులకు మంచిని ప్రసరింపజేసే వ్యక్తిగా మనం విభిన్న మార్గాల్లో రాణించాలని వారు కోరుకుంటున్నారు. మూడవదిగా, భగవంతుడు ఒక మార్గదర్శిగా మనలను గమనిస్తున్నారు. మనం సరైన జీవన విధానానికి సరైన ఉదాహరణగా ఉండాలనుకుంటున్నారు. మన జీవన విధానంతో ఇతరులు స్ఫూర్తి పొందాలి. ఒక స్నేహితునిగా, మనం వారి చేయి పట్టుకుని, నిజమైన దైవిక సాంగత్యం ప్రస్తుతం ఎంత అవసరమో ప్రపంచానికి చూపించాలని భగవంతుడు కోరుకుంటున్నాడు. జీవితం  ఒత్తిళ్లతో చుట్టుముట్టబడినప్పుడు, కాంతి మరియు ఆనందంగా ఉండటానికి ఇది మూలం.
  2. మీరు ప్రపంచ వేదికపై ఉన్నారని మీకు మీరే గుర్తు చేసుకోండి – మనమందరం ప్రపంచంలోని నటులం, మన ప్రతి చర్య ప్రపంచం దృష్టిలో ఒక ప్రదర్శన వంటిది. మీ ప్రతి ఆలోచన మరియు అనుభూతి కూడా మీ చుట్టూ ఉన్న వ్యక్తులచే నిరంతరం అనుభూతి చెందబడుతుందని, గ్రహించబడుతుందని గుర్తుంచుకోండి. మీరు ఒక వేదికపై ఉన్నట్లు మరియు ఇతరులు చేసే ప్రతిదాన్ని మీరు గమనించినట్లుగా, ఇతరులు కూడా అదే చేస్తున్నారు. మనం ఈ నటుడి స్పృహలో ఉన్నప్పుడు, మనం మన ప్రతి చర్యను మరింత గౌరవంగా మరియు బాధ్యతతో చూస్తాము, ఇతరులకు మనల్ని మనం ప్రదర్శించే విధానంలో నిర్లక్ష్యంగా ఉండము. అలాగే, మనం చేసే పనిని ఇతరులు కూడా చూస్తారు మరియు చేస్తారు అనే నినాదం మన జీవితంలో సానుకూల వాస్తవం అవుతుంది.

(సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

11th july 2025 soul sustenance telugu

చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల

Read More »
10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »