Hin

3rd mar 2024 soul sustenance telugu

March 3, 2024

పరిపూర్ణ ఏంజెల్ గా మారడానికి 5 సోపానాలు (పార్ట్ 3)

  1. మీ పురోగతి కోసం రోజువారీ చార్ట్ ఉంచండి – పరిపూర్ణతకు ఆధారం స్వపరిశీలన. స్వపరిశీలనలో బలహీనతలు ఉండవు. కాబట్టి, మీ స్వీయ-ప్రగతి కోసం రోజువారీ మానసిక చార్ట్‌ను ఉంచుకోవడం,  ఎటువంటి లోపాలు లేని  వ్యక్తిగా మారడానికి ఇది చాలా ముఖ్యమైది. ఉదా. నాకు చాలా త్వరగా కోపం వస్తుంది. కనుక ఈ మధ్యాహ్నం నన్ను నేను గమనించుకొని, ఉదయం నుండి నేను చాలా ప్రశాంతంగా, ప్రేమగా ఉన్నానని మరియు మిగిలిన రోజంతా కూడా కోపంగా ప్రవర్తించనని నా మనస్సులో నోట్ చేసుకుంటే, అది నన్ను మరింత జాగ్రత్త పరుస్తుంది. చాలా రోజుల పాటు క్రమం తప్పకుండా పురోగమిస్తున్న మానసిక చార్ట్, మనం కోరుకున్న పరిపూర్ణ మానవులుగా సులభంగా చేరుకోవడంలో సహాయపడే వంతెనలను నిర్మించే ఆధ్యాత్మిక ఇంజనీర్లుగా చేస్తుంది.

 

  1. మీరు కలిసే ప్రతి ఒక్కరికీ బహుమతిని ఇవ్వండి – ఎలాంటి తప్పులు చేయని వ్యక్తిగా మారడానికి ఉత్తమ మార్గం సద్గుణాలు, దయగల మాట, మనోహరమైన చిరునవ్వు, స్వచ్ఛమైన దృష్టిని అందరికీ  బహుమతిగా ఇవ్వడం. మీరు మీ ప్రేమ, ఆనందం మరియు ఉల్లాసంతో ఇతరులని ధనవంతులుగా చేస్తే, వారు మీకు అదే తిరిగి ఇస్తారు కనుక మీరు మరింత ధనవంతులు అవుతారు. ఆధ్యాత్మిక సంపదను అందరికీ దానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా సంపన్నులుగా అవుతారు.  అలాగే, ఇతరులు మన నుండి ఈ సంపదను ఎంత ఎక్కువగా తీసుకుంటే, అంతగా ఏరకంగా అయినా దానిని తగ్గించే తప్పులు చేయకుండా మనం మరింత జాగ్రత్తగా ఉంటాము. కాబట్టి, పరిపూర్ణ ఏంజెల్ గా  మారడానికి ఈ 5 సోపానాలను తీసుకోండి! ఈరోజే  ప్రయాణాన్ని ప్రారంభించి ఆస్వాదిస్తూ ఉండండి!

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

9th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 2)

సానుకూల శక్తిని ఎప్పటికీ కోల్పోవద్దు వ్యక్తులు మన జీవితాల్లోకి వేర్వేరు, కొన్నిసార్లు వ్యతిరేక సంస్కారాలతో కూడా వస్తారు. తరచుగా, మన ప్రియమైనవారిలో అలాంటి వ్యక్తులు కనిపిస్తారు – భర్త లేదా భార్య, తల్లిదండ్రులు, పిల్లలు

Read More »
8th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 1) 

ఎమోషనల్ ఓదార్పు మరియు శక్తిని ఇవ్వడం   మన జీవితమంతా మనకు తెలిసిన వ్యక్తులకు మరియు మనకు తెలియని వ్యక్తులకు కూడా సేవ చేస్తాము. ఎందుకంటే ఇవ్వడం, సేవ చేయడం మన సహజ లక్షణాలు.

Read More »
7th feb 2025 soul sustenance telugu

అంతర్గత శాంతి మరియు ఆనందం కోసం ఇంట్లో ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం

ధ్యానం కోసం ఇంట్లో ప్రత్యేకమైన, ఉన్నతమైన తరంగాల గది లేదా చోటును ఏర్పర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మనము అంతర్గత శాంతి, ఆనందం కోసం ఉన్నత ఆధ్యాత్మిక శక్తి గల ప్రదేశాలకు వెళ్తాము. మనం మానసికంగా

Read More »