Hin

29th-sept-2023-soul-sustenance-telugu

September 29, 2023

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను, సత్యాసత్యాలను,  సందర్భం-అసందర్భాలను గుర్తించి సరైన, ప్రయోజనకరమైన   నిర్ణయాలు తీసుకోవడం.

పరిశీలన శక్తిని ఎలా పెంచుకోవాలో చూద్దాం

సంకల్పం: 

నేను జ్ఞాన స్వరూపాన్ని. నేనే నా భాగ్యాన్ని తయారు చేసుకునేవాడిని… ప్రతిరోజూ ఎన్నో ఎంపికలు… ఎన్నో నిర్ణయాలు సమాచారాన్ని అందించేవి చాలా ఉంటాయి … మీడియా… సోషల్ మీడియా… గత అనుభవాలు… ప్రజాభిప్రాయాలు అయినప్పటికీ నాకు ఏమి అవసరమో నాకు తెలుసు… నాకు పరిశీలన శక్తి ఉంది… నా మనస్సు మరియు బుద్ధి స్థిరంగా ఉన్నాయి… అవి నా బలం… నా బుద్ధి ఉన్నతమైన జ్ఞానం ఆధారంగా సరిగా పరిశీలిస్తుంది….. నేను అన్ని పరిస్థితులలోనూ నా ఆలోచనలు, నమ్మకాలు, భావాలు, ప్రవర్తనలు పరిశీలించేందుకు ఉపయోగించి …… ఏది సరైనదో నిర్ణయించుకుంటాను. నేను … వ్యక్తులు మరియు పరిస్థితులను ఎలా ఉన్నాయో అలానే అర్థం చేసుకుంటాను… తద్వారా ఇది ఏది సరైనదో… ఏది సత్యమో… ఏది ప్రధానమో  … నా వర్తమానం మరియు భవిష్యత్తుకు ఏది ప్రయోజనకరమో…తెలుస్తుంది … ఇది నాకు మార్గదర్శకాలను ఇస్తుంది… నేను ఒక … సరైన నిర్ణయం తీసుకుంటాను… నా ఆలోచనలు, పదాలు లేదా చర్యలలోకి వచ్చే ఫలితం ఎలా ఉంటుందో నేను చెక్ చేసుకుంటాను. నేను నిర్ణయాన్ని అమలులోకి తీసుకువస్తాను. నేను ఏమి చేయాలో వెంటనే చేస్తాను … నేను ఎంచుకుని, నిర్ణయించుకుని వెంటనే అమలు చేస్తాను. పరిశీలించేటప్పుడు నేను ఇతర ప్రభావాల ద్వారా ప్రభావితం కాను. నేను నా అత్యున్నత స్వయాన్ని విశ్వసిస్తాను… వ్యక్తుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ… వారి ఉద్దేశాలు మరియు అలవాట్లను ప్రేరేపించే వాటిని విశ్లేషిస్తాను… నేను వారిని అర్థం చేసుకొని … నేను శాంతితో ప్రతిస్పందిస్తాను. ఇది నా స్వభావం.

మీ బుద్ధిని శక్తివంతం చేయడానికి ఈ సంకల్పాన్ని కొన్ని సార్లు రిపీట్ చేయండి. మీరు తప్పు ఒప్పులను పరిశీలించినప్పుడు, మీరు త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ పరిశీలించే శక్తి  సామర్థ్యం,  పరిస్థితులు మరియు ఇతరుల గురించి మాత్రమే కాకుండా, ఆంతరిక  స్వభావం గురించి కూడా ఖచ్చితమైన అవగాహనను ఇస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th october 2024 soul sustenance telugu

వైఫల్యాలను సులభంగా అంగీకరించడం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విఫలమవుతాము అనేది జీవితంలో ముఖ్యమైన పాఠాలలో ఒకటి. మనం వైఫల్యాలు, లోపాలను మన ప్రయాణంలో భాగంగా పరిగణించి అంగీకరించాలి. మనలో చాలా మంది జీవితంలో వైఫల్యాలకు భయపడతాము .

Read More »
6th october 2024 soul sustenance telugu

నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోండి

మన జీవితాలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితులతో నిండి ఉంటాయి. మనం తరచుగా పరిస్థితుల వల్ల ప్రతికూలంగా ప్రభావితమవ్వడంతో మన ఆంతరిక శక్తి తగ్గుతుంది. నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోవటం అనేది ఆధ్యాత్మికత యొక్క

Read More »
5th october 2024 soul sustenance telugu 1

ధనం  ఆశీర్వాదాలతో  సంపాదించడం

ధనం సంపాదించడం చాలా ముఖ్యం. ఆ ధనంతో మనం కొనుగోలు చేయగల అన్ని భౌతిక సౌకర్యాలను కొనుగోలు చేయడం కూడా ముఖ్యం. కానీ ధనం అంటే కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది ఒక

Read More »