Hin

21st july 2024 soul sustenance telugu

July 21, 2024

పరిష్కారాల గురించి మాత్రమే ఆలోచించండి మరియు మాట్లాడండి

కొన్నిసార్లు పరిస్థితులు సవాలుగా లేదా వ్యక్తులను నిర్వహించడం కష్టంగా ఉన్న సందర్భాలను  మనం ఎదుర్కొంటాము. మనం సమస్యపై దృష్టి పెడితే, కలత చెందుతాము, ఆందోళన చెందుతాము, భయపడతాము, నిందిస్తాము మరియు ఫిర్యాదు చేస్తాము. ఇవన్నీ మన శక్తిని తగ్గిస్తాయి, క్షీణించిన స్థితిలో, మన సమస్య మరింత పెద్దదిగా కనిపిస్తుంది. మనం మన శక్తిని ఆదా చేసి, పరిష్కారాలను రూపొందించడంపై దృష్టి పెట్టాలి. మీరు తరచుగా పరిష్కారాల కంటే మీ సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడుతూ, ప్రతికూల భావాలపై దృష్టి పెడుతున్నారా? ఒక సంక్షోభం వచ్చినప్పుడు, ఎవరు బాధ్యులు, ఎందుకు జరిగింది, నాకే విషయాలు అంత తప్పుగా ఎలా జరుగుతూంటాయి? అని మీరు దాని గురించే నెమరవేస్తూ, ఆలోచిస్తూ, చర్చిస్తూ ఇరుక్కుపోతున్నారా – లేదా ఇప్పుడు ఏమి చేయాలనే దానిపై దృష్టి పెట్టాలని మీకు మరియు ఇందులో ప్రమేయం ఉన్న ఇతరులకు కూడా మీరు గుర్తు చేస్తున్నారా? మన పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నప్పటికీ, దాని పరిష్కారం మాత్రమే నిజంగా ముఖ్యమైనది. విపరీతమైన ప్రశ్నలతో మనస్సును నింపడం వల్ల సమయాన్ని వృధా చేయడంతో పాటు మన శక్తి కూడా తగ్గిపోతుంది. మన మనస్సును నిశ్శబ్దం చేయాల్సిన అవసరం ఉంది, నిందించే ఆలోచనలతో, బాధితులుగా భావించడం, పరిస్థితిని విమర్శించడం లేదా తిరస్కరించడం వంటివి జరగనివ్వకూడదు. ఈ ఆలోచనలు మనల్ని, ఇతరులను మరియు పరిస్థితి యొక్క శక్తిని క్షీణింపజేస్తాయి. ఈ విధానం సమస్యను పెంచుతుంది. సమస్య గురించి వివరాలను తరువాత ఆలోచించవచ్చు, పరిష్కారాల వైపుకు మారడం తక్షణ అవసరం. సమస్యను అంగీకరించండి. ఇది ఇప్పటికే జరిగిపోయింది కాబట్టి మనం ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టాలి. ఒక పరిష్కారాన్ని వెతకడానికి, పరిష్కారాన్ని రూపొందించడానికి మరియు దానిని అమలు చేయడానికి మన ప్రతి ఆలోచనను మళ్లించుకుందాం. మీ బాధ్యతను గుర్తుంచుకొని, కలిసి సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టడంలో ప్రతి ఒక్కరికి సాధికారం ఇవ్వండి.

ఈ రోజు నుండి, మీరు కష్టమైన పరిస్థితి మధ్యలో లేదా కష్టమైన వ్యక్తితో ఉన్నప్పుడు, మీ జీవితం పరిపూర్ణంగా ఉందని, ప్రతి దృశ్యం అందంగా ఉందని మీకు మీరే చెప్పుకోండి. పెద్ద లేదా చిన్న సమస్య వచ్చినప్పుడల్లా మీ శక్తిని పరిష్కారాల వైపు మళ్లించండి. పరిస్థితిని, వ్యక్తిని అంగీకరించండి. సన్నివేశాలను లేదా ప్రవర్తనలను ప్రశ్నించడంలో మీ శక్తిని వృధా చేయవద్దు. ఇవి వ్యక్తుల సంస్కారాలు అని, ఇది మీ గత కర్మ అని తెలుసుకోండి, మీరు ఈ సన్నివేశాన్ని మీ విధిలో రాసుకున్నారు. మీపై, మీ చర్యలపై, మీ ప్రవర్తనపై దృష్టి పెట్టండి. మీ లక్ష్యాలపై, తదుపరి సన్నివేశంపై దృష్టి పెట్టండి మరియు వర్తమానంలో ఉండటానికి మీ శక్తిని ఉపయోగించుకోండి. మీ శక్తి వర్తమానంలో ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. పరిష్కారంపై దృష్టి పెట్టండి, పరిష్కారం గురించి ఆలోచించండి, పరిష్కారం గురించి మాట్లాడండి మరియు పరిష్కారాన్ని రూపొందించండి. చివరగా పరిష్కారాన్ని అమలు చేసి పరిస్థితిని అధిగమించండి. పరిష్కార-ఆధారితంగా ఉండటం అంటే ఇది. ఇలా ఉండటమే సానుకూలతకు, సంతోషానికి మరియు స్థిరత్వానికి కీలకం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd march 2025 soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (పార్ట్ 1)

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (భాగం 1) మీ ప్రతిరోజును ప్రకాశవంతంగా ప్రారంభించడానికి మీ వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు సామాజిక జీవితంలో దిన చర్యను సెట్ చేసుకోవాలి. దానితో పాటు, మనస్సు మరియు బుద్ధి

Read More »
20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం బాధపడినప్పుడు, కొన్నిసార్లు ఇతరులను క్షమించడం మనకు కష్టమవుతుంది. క్షమాపణ మాత్రమే ప్రతికూలతను కరిగించడానికి సహాయపడుతుందని మనం గుర్తుంచుకుంటే, అది జీవితంలో

Read More »
20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »