Hin

27th feb 2025 soul sustenance telugu

February 27, 2025

పరిస్థితులు మారుతాయని ఎదురుచూస్తున్నప్పుడు సహనాన్ని అనుభూతి చేసుకోండి

మనమందరం వేర్వేరు విషయాల కోసం వేచి చూస్తాము, వాటికీ కొంత సమయం పడుతుంది అని మన అనుభవం మనకు చెబుతుంది. అయినప్పటికీ ఒక క్లిష్ట పరిస్థితి మన ముందు ఉన్నప్పుడు మనం అసహనానికి గురవుతాము.

  1. అలవాటులో మార్పు, ఉద్యోగ ఇంటర్వ్యూ ఫలితం, పదోన్నతి, బరువు తగ్గడం లేదా బిల్లింగ్ కౌంటర్లో మీ వంతు కోసం ఎదురుచూడడంలో మీరు ఎంత బాగా ఓర్పు వహించగలరు? రోజువారీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో తెలిసి లేదా తెలియకుండా జరిగే సాధారణమైన జాప్యాలకు మీరు ఎలా స్పందిస్తారు? 

 

  1. ఓపికగా ఉండటం అంటే అంతర్గత స్వీయ నియంత్రణ లేదా మనస్సును నియంత్రించడం కానీ సమయం గురించి కాదు. స్వయంతో, ఇతరులతో మరియు పరిస్థితులతో సహనం మనలో మరింత శాంతి, కరుణ మరియు అంగీకారాన్ని తెస్తుంది. మీరు సహనాన్ని చూపించినప్పుడు, అసహనం లేదా చికాకును సృష్టించే శక్తిని తగ్గించనందున సవాళ్లను ఎదుర్కొనే శక్తి మీకు ఉంటుంది.

 

  1. ఫిర్యాదు చేయడం, పరిస్థితుల గురించి మళ్లీ మళ్లీ ఆలోచించడం, ఆందోళన చెందడం లేదా మిమ్మల్ని మీరు లేదా ఇతరులను తొందరపెట్టడం పరిష్కారం కాదు. తేలికగా ఉంటూ, కాలపరిమితిని నిర్ణయించుకొని మిమ్మల్ని మీరు, ఇతరులను గౌరవంగా క్రమశిక్షణలో ఉంచుకోవాలి. వారు తమ వంతు కృషి చేస్తున్నారు మరియు ప్రతిదీ సరైన సమయంలో, జరగాల్సిఉన్నపుడు జరుగుతుంది. వేచి ఉన్నప్పుడు ఇతర కార్యకలాపాలపై దృష్టి పెట్టండి లేదా ఇతర విషయాలలో మీ మనస్సును నిమగ్నం చేయండి.

 

  1. కార్యరూపం దాల్చడానికి పట్టే సమయం కారణంగా లక్ష్యాన్ని వదులుకోవద్దు, వేగంగా నిర్ణయాలు తీసుకోకండి మరియు షార్టుకట్స్ కోసం వెతకవద్దు. మీ సహనం, స్థితిస్థాపకత మరియు సహనాన్ని పెంచడానికి ప్రతిరోజూ ధ్యానం చేయండి. నిరీక్షణ కాలంలో మీరు సరైన ఆలోచనలను ఎంత ఎక్కువగా సృష్టిస్తే, వేచి ఉండటం అంత సులభం అవుతుంది.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »