Hin

24th nov 2023 soul sustenance telugu

November 24, 2023

పాజిటివ్ ఆలోచన మరియు విజువలైజేషన్

పాజిటివ్ గా ఆలోచించడం, పాజిటివ్ మనస్తత్వాన్ని పెంపొందించుకోవడం, పాజిటివ్ గా ఉండటం మొదలైన వాటి గురించి మనం నిరంతరం వింటూనే ఉంటాం. అయితే దాని అర్థాన్ని తెలుసుకుందాం. పాజిటివ్ గా ఆలోచించడం అంటే ప్రతి క్షణం సరైన ఆలోచనను చేయటం. మనం ఉత్తమమైన వాటిని ఆశిస్తాము, ఉత్తమమైనవి జరగాలని భావిస్తాము, కానీ ఏమైనప్పటికీ మనం ఫలితాన్ని అంగీకరిస్తాము కూడా. ఈ సమయంలోని ఫలితం మన కర్మల ఖాతా ప్రకారం ఖచ్చితమైనదని మనం అంగీకరిస్తాము. ఈ అంగీకారమే పాజిటివ్ గా ఆలోచించడంలో కీలకమైనది.

మీరు కాసేపు కూర్చోని పాజిటివ్ ఆలోచన కోసం మీ మనస్సును ఎలా ట్యూన్ చేస్తారో చూడండి –

పాజిటివ్ సంకల్పం:

నేను శక్తివంతమైన వ్యక్తిని. నా జీవితంలోని ప్రతి సన్నివేశంతో సంతృప్తి చెందుతాను.  సరిగ్గా మరియు సరైన సమయంలో… ఎలా జరగాల్సి ఉందో అలాగే అంతా జరుగుతుంది.  నేను ప్రతి సన్నివేశంలోనూ పాజిటివ్ ఆలోచనలను మాత్రమే చేస్తాను… నా ఆలోచనలు శాంతి, స్వచ్ఛత మరియు శక్తిని ప్రతిబింబిస్తాయి… నేను తదుపరి సన్నివేశంలో… ఉత్తమంగా జరిగే వాటిని మాత్రమే నేను విజువలైజ్ చేస్తాను… ఇంట్లో… ఆఫీసులో… స్నేహితులతో… ప్రతి సన్నివేశంలో నా సరైన ఆలోచనలతో సన్నివేశానికి ఉన్నతమైన వైబ్రేషన్స్ ను ప్రసరింపజేస్తాను … నా వైబ్రేషన్స్ తదుపరి సన్నివేశాన్ని ఉన్నతంగా  చేస్తాయి. ఈరోజు సన్నివేశాలు అనుకున్నట్లుగా అవ్వకపోవచ్చు. వ్యక్తులు సరిగ్గా లేకుంటే, నేను ఒకే ఒక పాజిటివ్ ఆలోచనను రికార్డ్ చేస్తాను – ఇది వారి స్వభావం మరియు వారితో నా కర్మల ఖాతా ప్రకారం వారి ప్రవర్తన ఖచ్చితమైనది. నేను కరుణతో ప్రతిస్పందిస్తాను, తిరస్కరించడం లేదా బాధ పెడుతూ కాదు. ఈ రోజు పరిస్థితులు నాకు తగినవి గా కాకపోవచ్చు. నేను ఒకే ఒక పాజిటివ్ ఆలోచనను సృష్టిస్తాను – ఈ పరిస్థితిని నా గత కర్మల ఖాతాల ప్రకారం, ప్రస్తుతానికి ఉద్దేశించినట్లుగా నేను అర్థం చేసుకుంటాను. నా మనసు ప్రశాంతంగా ఉంటుంది… ప్రశ్నలు లేవు… తీర్పులు లేవు… ప్రతి సన్నివేశాన్ని అంగీకరిస్తాను. అందరూ ఎవరి దారిన వారు ఉండవచ్చు … పరిస్థితి అది ఉద్దేశించిన విధంగా కావచ్చు … నా దారిలో నేను ఉంటాను… సరైన మార్గంలో  … పాజిటివ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. నా పాజిటివ్ ఆలోచనలు నన్ను సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి.

ప్రతిరోజూ ఈ పాజిటివ్ ఆలోచన ను రిపీట్ చేయండి. మీ పాజిటివ్ ఆలోచన ఆపేక్షల నుండి అంగీకారానికి మారుతుంది. మీరు సన్నివేశాల గురించి నెగిటివ్ ప్రభావాలను లెక్క చేయరు కూడా. మీ మనస్సు కొత్త, పాజిటివ్ భాషను నేర్చుకుంటుంది మరియు సరైన ఆలోచనలను మాత్రమే సృష్టిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th october 2024 soul sustenance telugu

వైఫల్యాలను సులభంగా అంగీకరించడం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విఫలమవుతాము అనేది జీవితంలో ముఖ్యమైన పాఠాలలో ఒకటి. మనం వైఫల్యాలు, లోపాలను మన ప్రయాణంలో భాగంగా పరిగణించి అంగీకరించాలి. మనలో చాలా మంది జీవితంలో వైఫల్యాలకు భయపడతాము .

Read More »
6th october 2024 soul sustenance telugu

నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోండి

మన జీవితాలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితులతో నిండి ఉంటాయి. మనం తరచుగా పరిస్థితుల వల్ల ప్రతికూలంగా ప్రభావితమవ్వడంతో మన ఆంతరిక శక్తి తగ్గుతుంది. నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోవటం అనేది ఆధ్యాత్మికత యొక్క

Read More »
5th october 2024 soul sustenance telugu 1

ధనం  ఆశీర్వాదాలతో  సంపాదించడం

ధనం సంపాదించడం చాలా ముఖ్యం. ఆ ధనంతో మనం కొనుగోలు చేయగల అన్ని భౌతిక సౌకర్యాలను కొనుగోలు చేయడం కూడా ముఖ్యం. కానీ ధనం అంటే కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది ఒక

Read More »