పాజిటివ్ జీవనశైలి కొరకు 10 యుక్తులు (పార్ట్ 2)

September 14, 2023

పాజిటివ్ జీవనశైలి కొరకు 10 యుక్తులు (పార్ట్ 2)

కఠినమైన పరిస్థితులు, వ్యక్తుల మధ్య ఈ ప్రపంచంలో ఉంటూనే బలహీనమైన మరియు అవిశ్వాసము ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉండే ఒక శక్తివంతమైన స్థితిని మరియు మనస్సు పై నియంత్రణను మనము సాధించగలము. మనం మన ఆలోచనల పై శ్రద్ధ వహించాలి ఎందుకంటే  మన వ్యక్తిత్వానికి పునాది మన ఆలోచనలే. మన అసలైన సుగుణాలు – శాంతి, ఆనందం, ప్రేమ, సంతోషం, స్వచ్ఛత, శక్తి మరియు జ్ఞానం. మొదట, ఆత్మ ఈ 7 ప్రాథమిక సద్గుణాలతో నిండి ఉంటుంది. మనం ఎన్నో జన్మలు తీసుకుంటూ, ఆత్మశక్తిని కోల్పోయి డిశ్చార్జ్ అయినందున, ఈ 7 గుణాలు తగ్గుతూ వచ్చాయి.  మన పాజిటివ్ వ్యక్తిత్వం యొక్క నాణ్యత మరియు పరిధి తగ్గింది. బదులుగా, కోపం, అహం, దురాశ, కామం, భయం, మొహం, అసూయ, అభద్రత, ఆత్మనూన్యత , పగ, ద్వేషం వంటి బలహీనతలతో నిండిపోయాము. దీని కారణంగా, ఆత్మ శక్తి  మరింత తగ్గింది, నెగెటివ్ పరిస్థితులనే  మేఘాలు తరచుగా చాలా సులభంగా మనపై ప్రభావం చూపుతున్నాయి.

ప్రతి పరిస్థితిలో మన స్థిరమైన పాజిటివిటీ ని అనుభవం చేసుకోవటానికి కొన్ని పద్ధతులను తెలుసుకుందాము. పాజిటివ్ జీవనశైలి కొరకు రోజు ఉపయోగించే 10 యుక్తులను చూద్దాము. 

  1. ప్రతి ఉదయం, విజయం మరియు దృఢత్వం యొక్క పాజిటివ్ సంకల్పాన్ని చేయండి. రోజంతా ఆ సంకల్పాన్ని గుర్తుంచుకొని మనసులో దానిని అనుభవం చేసుకోండి. 
  2. రోజంతా చేసిన తప్పుల గురుంచి రాత్రి చెక్ లిస్ట్ తయారు చేయండి, మరుసటి రోజు అవి రిపీట్  కాకుండా నిరోధించండి. బలహీనతలు ఆత్మ లోపల లీకేజీల వంటివి మరియు ఆత్మ బలాన్ని తగ్గిస్తాయి.
  3. ప్రతి ఉదయం, ఒక సుగుణాన్ని ఎంచుకుని, రోజంతా ఆచరణలో పెట్టండి. ఆ గుణాన్ని ఇతరులకు ప్రసరింపజేయండి. రోజంతటిలో మిమ్మల్ని కలుసుకున్న ప్రతి ఒక్కరికి సూక్ష్మమైన సంతృప్తిని కలిగించండి.
  4. ప్రతి ఒక్కరిలో కనీసం ఒక గుణము, ప్రత్యేకత, నైపుణ్యం లేదా ప్రతిభను చూడండి. ఎవరిలోనైనా మీకు  బలహీనత లేదా బలహీనతలు కనిపిస్తే మీ మనస్సును మరియు కళ్లను వాటినుండి దూరంగా ఉంచండి.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »