Hin

పాజిటివ్ జీవనశైలి కొరకు 10 యుక్తులు (పార్ట్ 3)

September 15, 2023

పాజిటివ్ జీవనశైలి కొరకు 10 యుక్తులు (పార్ట్ 3)

ప్రతి పరిస్థితిలో నిరంతరం పాజిటివ్ గా మరియు శక్తివంతంగా ఉండటానికి మరికొన్ని పద్ధతులను చూద్దాం:

  1. రోజంతా పనులు చేస్తున్నప్పుడు, మీరు చిరునవ్వు నవ్వుతూ, మీ కళ్ళు, ముఖం అలాగే మధురమైన మాటలు మరియు చర్యల ద్వారా అందరికీ తేలికతనం మరియు ప్రేమను ప్రసరింపజేస్తూ ఉండండి.
  2. ప్రతి గంట తర్వాత, మీరు చేస్తున్న పనిని ఆపి 1-2 నిమిషాలు లొలోపలికి చూసుకోండి. మీ ఆలోచనల ప్రవాహం, నాణ్యతను చెక్ చేసుకొని,   వాటిని నెగిటివ్ లేదా వేస్ట్ నుండి పాజిటివ్ మరియు నిర్మాణాత్మకమైన ట్రాక్ పైకి తీసుకురండి.
  3. ఇంట్లో లేదా మీ ఆఫీస్ లో ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, కలిసేటప్పుడు, ప్రతి ఒక్కరూ పాజిటివిటీ తో నిండిన ఆధ్యాత్మిక శక్తి అని నిరంతరం గుర్తుంచుకోండి. మీకు ఏదైనా నెగిటివిటీ కనిపిస్తే, అది వారి అసలు స్వభావం కాదని, తాత్కాలిక వ్యక్తిత్వం అని గుర్తుంచుకోండి.
  4. ప్రతి ఉదయం, మంచి పాజిటివ్ జ్ఞానాన్ని ఎంచుకుని, 1-2 పేజీలను నెమ్మదిగా చదవండి, బాగా గ్రహించుకొని, రోజంతా ఆచరణలో పెట్టండి.
  5. మెడిటేషన్ నేర్చుకొని, నిద్రపోయే ముందు మరియు ఉదయం నిద్రలేవగానే ప్రాక్టీస్ చేయండి. భగవంతుడి నుండి ఆధ్యాత్మిక శక్తి ని నింపుకొని దృఢత్వాన్ని అనుభవం చేసుకోండి. 
  6. రోజంతా ప్రతి పనిలో భగవంతునితో స్నేహితుడిలా మాట్లాడండి. వారి మనస్సును మరియు మీ చేతులను పనులు చేయడానికి ఉపయోగించండి. ఈ విధంగా, మీ పనులు ఎటువంటి తప్పులు లేకుండా పాజిటివ్ గా మరియు శక్తివంతంగా ఉంటాయి, మీరు అన్ని పరిస్థితులను సులభంగా ఎదుర్కోగలుగుతారు.

పాజిటివ్ జీవనశైలికి ఇవి 10 యుక్తులు. ఈ యుక్తులను అనుసరించడం వలన స్థిరత్వం మరియు శక్తితో నిండిన జీవితం తయారవుతుంది. పరిస్థితులు మిమ్ముల్ని డిస్టర్బ్ చేయకుండా వీస్తున్న గాలి లాగా మారతాయి. వాస్తవానికి, మీరు మీ కుటుంబంలో మరియు మీ ఆఫీస్ లో మీ సహోద్యోగుల మధ్య, ఆధ్యాత్మిక శక్తికి ఆధారంగా తలెత్తుకొని ఉంటారు. ఎప్పటికీ ఆధ్యాత్మిక శక్తి  లేకపోవడం వల్ల మానసికంగా వంగి ఉండరు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

12th sep 2024 soul sustenance telugu

మీ జీవితంలో భగవంతుని  జ్ఞానాన్ని తీసుకురావడానికి 5 మార్గాలు

ప్రతిరోజూ మీ మనస్సులో భగవంతుని జ్ఞానంపై దృష్టి పెట్టండి – ప్రతిరోజూ భగవంతుడు మనతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకుంటారు. దానిని చదివి మనం మన డైరీలు మరియు హృదయాలలో నోట్ చేసుకుంటాము. వ్రాసుకున్న తరువాత,

Read More »
11th sep 2024 soul sustenance telugu

సోషల్ మీడియాలో పనిలేని కబుర్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి

వ్యక్తుల  ప్రవర్తన లేదా జీవిత సమస్యల గురించి ప్రతికూల భావంతో మాట్లాడకూడదని, తీర్పు చెప్పేలా, విమర్శనాత్మకంగా లేదా వారి బలహీనతను పేర్కొనకూడదని మనం అభ్యాసం చేస్తాము. అలాగే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చదివే

Read More »
10th sep 2024 soul sustenance telugu

5 రకాల ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోండి

జీవించే కళ  ప్రధానంగా 5 రకాల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది: శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం. పరస్పరం అనుసంధానించబడి ఉండటం వలన, ఇవన్నీ మన

Read More »