పాజిటివ్ జీవనశైలి కొరకు 10 యుక్తులు (పార్ట్ 1)

September 13, 2023

పాజిటివ్ జీవనశైలి కొరకు 10 యుక్తులు (పార్ట్ 1)

మనం జీవిత ప్రయాణంలో ముందుకు సాగుతూ వెళ్తున్నప్పుడు కొన్ని సార్లు మన జీవితాన్ని మరియు భాగ్యాన్ని మార్చే క్షణాలు ఉంటాయి. మన జీవితంలో ఏదైనా ముఖ్యమైన సంఘటన జరిగి ఇక ఆ తర్వాత జీవితం మళ్లీ అదే విధంగా లేకుండా మార్చేవి ఆ క్షణాలు. మీరు మీ జీవితంలో చాలా ముఖ్యమైన విద్యా పట్టా పొందారని అనుకుందాం. ఆ తర్వాత మీరు మీ కెరీర్‌లో చాలా విజయవంతమవడంతో మీ జీవితం పరివర్తన చెంది అందంగా మరియు ఆనందంగా ఉంటుంది. మీరు మీ కుటుంబంలో, మీ స్నేహితుల నుండి మరియు ప్రపంచంలో చాలా ప్రశంసలు మరియు గౌరవాన్ని పొందుతారు. ఇప్పుడు వేరొకదానిని చూద్దాం – నేను నా ఉద్యోగాన్ని అకస్మాత్తుగా కోల్పోతాను, నా మొత్తం జీవితాన్ని, సమయాన్ని, కృషిని ఇచ్చాను, దానికి ప్రతిఫలంగా నాకు చెడు జరిగింది. నేను నాశనమయ్యాను. నాకు ఇది ఎలా జరుగుతుంది – నన్ను నా కంపెనీ  విడిచిపెట్టమని చెబుతోంది? ఇది నా జీవితంలో ఒక నిస్పృహ క్షణం. ఇలాంటి వ్యతిరేక ఉదాహరణలను ఎందుకు ప్రస్తావించాము అంటే జీవితం ఈ రెండింటితో నిండి ఉంది. విజయం మరియు ఓటమి, ప్రశంసలు మరియు అవమానాలు, ఆనందం మరియు దుఃఖంలో స్థిరంగా మరియు ఒకే విధంగా ఉండటం నిజంగా విజయవంతమైన వ్యక్తికి సంకేతం.

మనము ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను సంభాళిస్తూ, వ్యాపారాలు నిర్వహించడం, పిల్లలను పాఠశాలకు పంపడం వంటివి చేస్తూ ఉండే సమాజంలో ఉంటూ చాలా తరచుగా శారీరక ఆరోగ్య సమస్యలు, కుటుంబం మరియు కార్యాలయంలో సంబంధాలలో సమస్యలు, ఇంట్లో మరియు కార్యాలయంలో ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నాము. వీటన్నింటి మధ్య, మనం స్థిరంగా, శక్తివంతంగా, సంతృప్తిగా మరియు శాంతియుతంగా ఉండాలి. ఒడిదుడుకులు వస్తాయి,  వెళ్లిపోతాయి. కానీ మనం మన అంతర్గత సంపన్నత మరియు సంతృప్తిని వదలకూడదు. పుస్తకాలలో కనిపించే జ్ఞానం మాత్రమే కాకుండా జీవితంలో అనుసరించే జ్ఞానమే అటువంటి స్థితి. ఈ స్థితిని మరియు  పాజిటివ్ జీవనశైలిని ఎలా పొందాలో ఈ సందేశంలో తెలుసుకుందాం.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd oct 2023 soul sustenance telugu

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు

Read More »
2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »