Hin

16th november 2024 soul sustenance telugu

November 16, 2024

పోటీ మరియు సహకారం

జీవితం ఒక పోటీ అని, విజయం అంటే సాధించే వారి లిస్ట్ లో అందరికంటే పైన ఉండటం అని మీరు నమ్ముతారా? మీ లక్ష్యము మీరు ఇతరులకన్నా ముందుండాలనా లేక మీ సొంత సామర్థ్యం కంటే మెరుగ్గా పనిచేయాలనా? మనం పోటీ చేసినప్పుడు, నిరంతరం అభద్రత, మరొకరు మన కంటే ముందుకు వెళతారనే భయం కారణంగా మనం సంతోషంగా ఉండలేము. కాబట్టి అగ్రస్థానాలను సాధించినప్పుడు కూడా అభద్రత ఉంటుంది. పోటీ ఒత్తిడి, భయం, అసూయ, ద్వేషాలను సృష్టిస్తూ మనల్ని సంతోషం నుండి దూరం చేస్తుంది. సహకారం ఆశీర్వాదాలను సంపాదించి మనల్ని విజయవంతం చేస్తుంది. విజయం అంటే ముందుకు పరుగెత్తి నంబర్ వన్ గా ఉండటం కాదు. మన సంతోషం, ఆరోగ్యం, అందమైన సంబంధాలు మరియు మనం సాధించినవి విజయాన్ని తెలుపుతాయి. సహకారం మనకు సహజం, కాబట్టి మనం సహజ మార్గంలో జీవించుదాం. ఈ రోజు, మీరు ఇతరులతో పోటీ పడకుండా లేదా పోల్చుకోకుండా నిరంతరం మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారని మీకు మీరే గుర్తు చేసుకోండి. సహకారాన్ని మీ స్వభావంగా చేసుకోండి, పోటీని కాదు.

సమాజం ఎప్పుడూ పోటీ పడటానికి, పోల్చడానికి మనల్ని ప్రోత్సహించింది. జీవితం ఒక పోటీ అనే నమ్మకాన్ని మనం స్వీకరించాము. కానీ మనం ఎంత బాగా చేసినా, మన కంటే పెద్ద ఇల్లు, మంచి గాడ్జెట్ లేదా ఉన్నత స్థానం ఉన్న వారు ఎవరైనా ఎల్లప్పుడూ ఉన్నారు. ఎవరూ మెరుగైన వారు కాదని, మనం భిన్నంగా ఉన్నామని అర్థం చేసుకుందాం. మీరు సంతోషకరమైన వ్యక్తి అని మీకు మీరే గుర్తు చేసుకోండి. మీ సామర్థ్యం మేరకు ఉన్నతంగా పని చేయండి. మీ మునుపటి పనితీరుతో మాత్రమే పోల్చుకోండి. ఎవరితోనూ పోటీ పడకండి, కానీ మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో సహకరించండి. వారి కోసం మంచి ఆలోచనలను సృష్టిస్తూ సహకరించండి, ప్రోత్సాహక మాటలతో సహకరించండి, మీకు తెలిసిన వాటిని పంచుకొంటూ సహకరించండి, ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ వహిస్తూ సహకరించండి. మీ జీవితమే మీ ప్రయాణం, మీ గమ్యస్థానానికి, మీ వేగంతో, మీ సామర్థ్యాన్ని ఉపయోగించి, మీ విలువల ఆధారంగా అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఈ రోజు నుండి, రేస్ నుండి బయటపడండి, మీ మార్గంపై దృష్టి పెడుతూ మీకు సౌకర్యవంతమైన వేగంతో ముందుకు సాగండి. మీకు తెలిసిన వాటిని పంచుకోవడంతో ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పడతాయి. మీరు అనేక విధాలుగా విజయవంతమవుతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »