Hin

17th june2024 soul sustenance telugu

June 17, 2024

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 1)

ప్రతి ఆత్మ సంతోషాన్ని కోరుకుంటుంది. సంతోషంగా ఉండటం కోసం సంతోషాన్ని వెతుకుతుంటాము. ఆరోగ్యం, అందం, ధనము, పాత్ర వంటి ఇతర గమ్యాలు కూడా విలువైనవే ఎందుకంటే అవి మనకు సంతోషాన్నిస్తాయి అని మనం భావిస్తాము. నేడు మనం వైద్య శాస్త్రం మరియు సాంకేతికత యుగంలో చాలా అభివృద్ధి సాధించినప్పటికీ సంతోషంగా ఉండే విషయానికి వస్తే పెద్దగా మారలేదు. అసలు ఎటువంటి పురోగతి సాధించలేదని నిస్సందేహంగా నిర్ధారించవచ్చు. సంతోషంతో నిండిపోవడానికి బదులు, మనం ఏదో సాధించాలనే ఆతృతలో, ఒత్తిడిలో మన విలువైన కాలాన్ని వృధా చేసుకుని, ఆ విజయం మనకు ఆనందం వైపు తీసుకెళ్తుందని భావిస్తాము. ఏ ఆత్మకైనా సంతోషం అతి సహజమైన స్థితి. కానీ నేటి ప్రపంచంలో సంతోషం భౌతిక సాధనలు మరియు విజయాలపై ఆధారపడి ఉండడం వలన సంతోషంగా ఉండడం చాలా కష్టంగా మారింది.

బాల్యంలో సహజంగానే ఉత్సాహంగా, సంతోషంగా ఉండేవాళ్లం. పక్షుల కిలకిలలు వినడం లేదా పాఠశాలలో స్నేహితుడితో భోజనం పంచుకోవడం వంటి సాధారణ సంఘటనలకు ఆనందంగా ప్రతిస్పందించేవారం. ఎదుగుతున్న కొద్దీ చదువు,  కుటుంబం, వ్యాపారంలో విజయం పొందాలనే లక్ష్యంతో ఒత్తిడికి గురవుతాము. సంతోషకరమైన జీవిగా ఉండడం మన ప్రాథమిక బాధ్యత అనే వాస్తవిక అవగాహనను కోల్పోతాము. సంతోషంగా ఉండేందుకు మన స్వభావానికి విరుద్ధంగా వెళితే, మనం ఎక్కడికీ చేరుకోలేము. మనలో ప్రతి ఒక్కరికీ కొంత అస్పష్టంగా అయినప్పటికీ, ఈ జీవితంలో మనం ఏమి సాధించాలనుకుంటున్నామో తెలుస్తుంది. మనం వివిధ రకాల విజయాలను అనగా డబ్బు, ఆరోగ్యం మరియు సామాజిక సంబంధాలు కోరుకుంటున్నాము. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఎంత దగ్గరగా ఉంటామో అదే మన జీవిత నాణ్యతకు కొలమానగా భావిస్తాము. అది మన పరిధిలో లేకుంటే, మనకు బాధ కలిగి కోపం వస్తుంది. ఎప్పుడైతే, మనం దానిలో నిమగ్నమై ప్రస్తుత క్షణం నుండి సంతోషాన్ని పొందడం మానేస్తామో అప్పుడు అది ఇబ్బందికరంగా మారుతుంది. ఇది జరిగినప్పుడు, సంతృప్తి చెందడానికి ఉన్న అవకాశాలను వదులుకుంటాము.

(సశేషం …)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »
25th march 2025 soul sustenance telugu

ఆధ్యాత్మిక అవగాహనతో తోబుట్టువుల మధ్య వైరాన్ని అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు తోబుట్టువులు అనగా మీ సోదర సోదరీల మధ్య విభేదాలు ఉండటం సాధారణం, కానీ యుక్త వయసులో కూడా తోబుట్టువుల పట్ల అభద్రత

Read More »
24th march 2025 soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రాక్టికల్ మెడిటేషన్ అనేది కేవలం ఉదయం రోజును ప్రారంభించే ముందు లేదా రాత్రి నిద్రురించే ముందు చేసేటువంటిది మాత్రమే కాదు, మీరు 

Read More »