Hin

18th june2024 soul sustenance telugu

June 18, 2024

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 2)

సంతోషం మరియు విజయం వాస్తవానికి పరస్పరం ముడిపడి ఉంటాయి. ఆ రెండు ఒక సాధారణ అంశాన్ని పంచుకుంటాయి – వాటిని అనుసరించలేము. మనం ఆత్మిక స్థితిని అభ్యసిస్తే, విజయం మరియు సంతోషం  రెండింటినీ సాధించిన భావాలు భౌతికమైన దాని కంటే గొప్ప వాటి పట్ల మన అంకితభావం ఫలితంగా ఉండాలని ఆలోచన వస్తుంది. ఈ జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు, మన గత కర్మల వల్ల కూడా, తరచుగా మనం కోరుకున్న దానికంటే భిన్నంగా వస్తాయి. పరిస్థితులు మనిషి కోరికలను పరిగణనలోకి తీసుకోకుండా చాలా సహజంగా బయటపడతాయి కాబట్టే అవి మానవ అసంతృప్తికి మూలాలు అవుతాయి. అవి యాదృచ్ఛికమైనవి మరియు మన లక్ష్యాల ద్వారా మనం సాధించాలనుకునే వాటికి భిన్నంగా ఉంటాయి. ఏదేమైనా, అటువంటి ఊహించని పరిస్థితుల నుండి కూడా అందమైనదాన్ని సృష్టించడానికి మనకు ఎంపిక ఉంటుంది అన్న ఈ అవగాహన చాలా ముఖ్యమైనది, ఇది మన మనస్సుల అంతర్గత ప్రపంచాలను నిర్మించడంలో సహాయపడుతుంది, జీవితంలో సంతృప్తిగా ఉంటాము, ప్రతి క్షణం పెరుగుతున్న ఆనందాన్ని ఆస్వాదిస్తాము. అందువల్ల, మన  స్వస్థితి  యొక్క విషయాలపై నియంత్రణ సాధించడం ద్వారా సంతోషాన్ని పొందడం అనేది ఒక ఎంపిక.

ఆధునిక ప్రపంచంలో- సంపద, హోదా మరియు పాత్ర సంతోషానికి ముఖ్యమైన చిహ్నాలుగా మారాయి. కానీ అవి మనకు ఆనందంగా ఉండటానికి సహాయపడితేనే అవి నిజమైన ఆశీర్వాదాలు మరియు ముఖ్యమైనవి అవుతాయి. ప్రతీ క్షణంలో సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటూనే, మన లక్ష్యాలను సాధించే దిశగా మన ప్రయత్నాలను ఎలా చేయవచ్చో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. భౌతిక విజయం అనేది జీవితంలో ఒక అంశం మాత్రమే. మనకు ఆనందాన్ని, సంతృప్తిని ఇవ్వగల జీవితంలోని అనేక ఇతర కోణాలు కూడా ఉన్నాయి. ఈ అవగాహన భౌతిక స్థాయిలో విజయవంతం కావడంతో పాటు ఇతరుల శ్రద్ధ మరియు ఆమోదానికి బానిస కావడం నుండి మనల్ని విడిపిస్తుంది. ఆధునిక జీవితం యొక్క ఒత్తిడిని అధిగమించడానికి, మనం మొదట మన అసలైన ఆనందాన్ని తిరిగి అనుభవించాలి. మనకు ఏది నిజంగా ముఖ్యమైనది మరియు ఏది కాదు అని తెలుసుకోవడం ద్వారా మనం దీన్ని చేయవచ్చు. అప్పుడు మనం మన కర్మలలో ఆనందాన్ని మరియు ఉద్దేశ్యాన్ని పొంది, దాన్ని సామాజిక ప్రాముఖ్యతతో, బయట పరిస్థితులతో సంబంధం లేకుండా మనకు మనం ప్రతిఫలాన్ని ఇచ్చుకోవటం  నేర్చుకోవచ్చు.

 

(సశేషం …)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th dec 2024 soul sustenance telugu

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల

Read More »
6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »