Hin

19th june2024 soul sustenance telugu

June 19, 2024

  పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 3)

భవిష్యత్తు మాత్రమే అత్యంత ముఖ్యమైనది అనే ఆలోచన నుండి కూడా మనం విముక్తి పొందాలి. సామాజికంగా చెల్లుబాటు అయ్యే లక్ష్యాలను సాధించే ఈ ట్రెడ్‌మిల్‌లో, విజయాన్ని గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము,  కనీసం దానిని సాధించినందుకు సంతోషాన్ని కూడా అనుభవించకముందే అది మన చేతుల్లోనే కరిగిపోతుంది. ఈ పోరాటంలో వర్తమానంలోని సంతృప్తికరమైన అనేక అనుభవాలను కూడా మనం గమనించలేము. మనల్ని మనం విముక్తి చేసుకోవడంలో అత్యంత కీలకమైన దశ, ప్రతి క్షణం ప్రతి పరిస్థితులలో ప్రతిఫలాలను పొందగల సామర్థ్యం. వర్తమాన అనుభవాలను మనం ఆస్వాదించడం మరియు అర్థాన్ని కనుగొనడం నేర్చుకుంటే, ఏదో సాధించాలన్న ఒత్తిడి, భారం మన భుజాల నుండి దిగిపోతుంది. ఎప్పుడైతే మన ప్రతిఫలాలు బాహ్యంగా ముడిపడివుండవో అప్పుడు అంతర్గత శక్తి తిరిగి వస్తుంది. అప్పుడు మనం జీవితంలోని నిజమైన ప్రతిఫలాలను ఆస్వాదించడం నేర్చుకుంటాము మరియు అందుబాటులో లేని ప్రతిఫలాల కోసం పరుగెత్తడం మానేస్తాము.

ఒకసారి మనం మన లక్ష్యాలను నిర్ణయించుకున్న తర్వాత, మార్గంలో అడ్డంకులను అధిగమించడం ద్వారా పొందిన అనుభవాలు, మరింత నైపుణ్యం మరియు సమర్థవంతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ వ్యక్తిగత విజయాలను పొందే ప్రక్రియలో, ఇతరులతో సహకారం, సహకారం యొక్క వైఖరి జీవితంలో సామరస్యం మరియు పరిపూర్ణత యొక్క భావాన్ని జోడిస్తుంది. ఇతర ఆత్మల ఆలోచనలు మరియు భౌతిక స్వభావానికి మించిన జీవితాల పట్ల శ్రద్ధ, గౌరవం మనం పెంపొందించుకున్నప్పుడు, జీవితం పట్ల మరింత సున్నితంగా ఉండటం నేర్చుకుంటాము. ఈ మానవ సమైక్యత వర్తమానాన్ని మరింత ఆనందదాయకంగా చేస్తుంది.  ఇది మనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, నైపుణ్యాలను పెంపొందించుతుంది. మన కుటుంబం, స్నేహం, కార్యాలయం మరియు సమాజానికి సరైన సహకారాన్ని అందించడానికి వీలు కల్పిస్తుంది.

(సశేషం …)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

15th november 2024 soul sustenance telugu

సంబంధాలలో విభేదాలను ఎలా పరిష్కరించాలి (పార్ట్ 2)

సంఘర్షణ సమయంలో, మీరు సంఘర్షణకు ఏ రకమైన శక్తిని ఇస్తారో అదే రకమైన శక్తి మీకు ప్రతిఫలంగా లభిస్తుందని తెలుసుకోవటం మంచిది. ఇది కారణ పరిణామాల నియమం. సూక్ష్మ స్థాయిలో, మనం మన వైఖరి

Read More »
14th november 2024 soul sustenance telugu

సంబంధాలలో విభేదాలను ఎలా పరిష్కరించాలి? (పార్ట్ 1)

సంబంధాలలో, కొన్నిసార్లు అవతలి వ్యక్తి సమస్య మాత్రమే కాదు, సంఘర్షణలకు మూలం కూడా అని మనం భావిస్తాము. సంఘర్షణ జరగాలంటే ఎల్లప్పుడూ ఇద్దరు వ్యక్తులు పాల్గొనాలని మనం తెలుసుకోవాలి. మనం ఏదైనా సంఘర్షణలో ఉన్నప్పుడు,

Read More »
13th november 2024 soul sustenance telugu

భగవంతుని ప్రేమ అనే రెక్కలతో ఎగరటం

మన జీవితంలో ప్రతిరోజూ భగవంతుడిని అనుభవం చేసుకుంటాము. అడ్డంకుల ప్రభావం నుండి దూరంగా ఉంటూ మన జీవితాలను అందంగా ఎలా గడపాలో చూపించినందుకు ప్రతి దశలో మనం వారిని గుర్తుచేసుకుంటాము,  వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము.

Read More »