Hin

20th june2024 soul sustenance telugu

June 20, 2024

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 4)

మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు సమతుల్య మనస్సును ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. కోపం, ఆవేశం, అహం లేదా దురాశ మన ఆలోచనలలో అసమతుల్యతను సృష్టించవచ్చు. మనల్ని మనం మనలాగే అనుభవం చేసుకున్నప్పుడు మరియు జీవితంలో హాయిగా ఉన్నప్పుడు, సాధ్యమయ్యే దేనినైనా సాహసించే శక్తిని మనం అనుభవం చేస్తాము. మనం మన ప్రయత్నాన్ని సులభంగా సమతుల్యం చేసుకోగలిగితే, మనం మన లక్ష్యాల వైపు అంతే ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉంటాము, అలానే జీవన ప్రవాహాన్ని అభినందిస్తాము. చివరికి సంతోషం, స్వేచ్ఛ మరియు ఆనందం వంటి సద్గుణాలే మనకు ముఖ్యమని మనం గ్రహించగలిగినప్పుడు, ఈ సద్గుణాలు మన లక్ష్యాల పట్ల ప్రయత్నాలను మరింత శాంతి మరియు ప్రశాంతతతో నిర్దేశించడంలో సహాయపడటానికి కంపాస్ లాగా పనిచేస్తాయి. ప్రతి పరిస్థితిలో కూడా మన నిజమైన విలువలు మరియు సానుకూల భావాలతో సన్నిహితంగా ఉన్నట్లయితే సరైన జీవిత నిర్ణయాలు తీసుకోవడంలో అది మనకు సహాయపడుతుంది. ప్రయత్నాలతో పాటు లక్ష్యం పట్ల ఒక తేలిక అనుబంధం ఉన్నప్పుడు మాత్రమే, మనం ఒక ప్రవాహాన్ని అనుభవిస్తాము. ఎక్కువ శ్రమ కలిగింది అని భావించకుండా, పరిపూర్ణ వ్యక్తులు, ప్రదేశాలు లేదా అవకాశాలు మనకు ఉత్పన్నమవుతాయి. ఈ విజయం ప్రతి ఒక్కరికీ విజయంగా అనిపించవచ్చు లేదా కాకపోవచ్చు, కానీ మనకు అలా అనిపిస్తుంది.

మెడిటేషన్ మరియు నిర్లిప్తతను అభ్యసించినప్పుడు మనం ఆత్మిక స్థితిలో ఉండగలుగుతాము, అప్పుడు, కర్మ ధ్యాస కన్నా కర్మను చేయిస్తున్న ఆత్మను నేను అన్న ధ్యాస ఎక్కువగా ఉంటుంది. విజయంగా నిర్వచించబడేది ఏదైనా ఉద్యోగం, జీతం, డిగ్రీ లేదా మన గురించి ఇతరుల అభిప్రాయం కంటే మన ఆరోగ్యం, అంతర్గత శ్రేయస్సు చాలా ముఖ్యమైనవి. అందువల్ల, పెరుగుతున్న నిరీక్షణను నియంత్రించే శాంతి మరియు సంతోషకరమైన పరిస్థితిని మనం ఉద్దేశపూర్వకంగా సృష్టించవచ్చు. అప్పుడు మనం నెరవేరని అవసరాలతో ఇబ్బంది పడము మరియు చాలా సాధారణ అనుభవాలు కూడా ఆనందదాయకంగా మారతాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

Aalochanalu mariyu chitraala sukshma paatra (part 2)

ఆలోచనలు మరియు చిత్రాల సూక్ష్మమైన పాత్ర (పార్ట్ 2)

ఆత్మ సృష్టించే ఆలోచనలు, చిత్రాల నాణ్యత అనేది ఆత్మ యొక్క సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది. నాణ్యతను బట్టి, ఆత్మ సానుకూలమైన లేదా ప్రతికూలమైన వివిధ భావోద్వేగాలను అనుభవం చేసుకుంటుంది. పరంధామం నుండి భౌతిక ప్రపంచ

Read More »
Aalochanalu mariyu chitraala sukshma paatra (part 1)

ఆలోచనలు మరియు చిత్రాల సూక్ష్మ పాత్ర (పార్ట్ 1)

మానవ ఆత్మ ఒక సూక్ష్మమైన (భౌతికం కాని) స్టేజి. నిద్రిస్తున్నప్పుడు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, రోజంతా మరియు నిద్రిస్తున్నప్పుడు కూడా ఆలోచనలు, చిత్రాల సూక్ష్మ పాత్ర నిరంతరం దానిపై జరుగుతుంది. మన ఆలోచనలు 4

Read More »
కార్యాలయంలో నిజాయితీ

కార్యాలయంలో నిజాయితీ

మీ కార్యాలయంలో నిజాయితీ అనేది కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదు, విజయం మరియు సంతుష్టతలకు రహస్యం కూడా. నిజాయితీని విలువైనదిగా భావించే ఉద్యోగికి విజయం, నమ్మకం లభిస్తాయి. మన నిజాయితీ విషయంలో రాజీ

Read More »