Hin

24th june2024 soul sustenance telugu

June 24, 2024

పోటీ పడకుండా సహకరించుకుందాం

నిజమైన సహకారం అంటే సర్వులకు ఎల్లవేళలా తన వారనే భావన మరియు సాధికారత ఉద్దేశ్యంతో షరతులు లేని సహాయాన్ని అందించడం. ఇది వినయం, ప్రేమ, కరుణ మరియు తాదాత్మ్యం వంటి మన నిజ గుణాలను బలపరుస్తుంది. తద్వారా అహం, అసూయ, పగ మరియు పోటీతత్వం యొక్క ప్రతికూల సంస్కారాలను అధిగమించడంలో సహాయపడుతుంది. చాలా సార్లు, సహకారం అంటే మనం ఏమీ చేయవలిసిన అవసరం లేదు, కేవలం ప్రశాంతంగా మరియు స్థిరంగా ఉండడం. మన వైబ్రేషన్లు మన చుట్టూ ఉన్న వ్యక్తులకు సుఖాన్నిస్తూ ఆ క్షణాలను వారికి అందమైన అనుభూతిగా మార్చడానికి సహకారాన్ని, సహాయాన్ని అందిస్తాయి. మన  వైబ్రేషన్లు  పరిస్థితులకు ప్రతిస్పందనగా వారి దివ్య గుణాలను  వెలికి తీయడానికి సహాయపడతాయి.

సహకారం అనేది పోటీకి విరుగుడు (న్యూట్రలైజర్). మనలో చాలా మంది జీవితం ఒక పోటీ అనే నమ్మకంతో జీవించాం. మనం ఒత్తిడి, కోపం, అసూయ, ద్వేషం సృష్టించి కొన్నిసార్లు ఇతరుల కంటే ముందుకు వెళ్లాలని మన నైతికతపై రాజీ పడవలసి వచ్చింది. ఈ రోజు మనం అంతర్గతంగా ఖరారు చేద్దాం – మనం ఎవరితోనూ పోటీలో లేము. ప్రతి ఒక్కరూ తమ గత మరియు ప్రస్తుత కర్మల ఫలితాన్ని పొందుతారు. ప్రతి ఒక్కరూ తమకు న్యాయమైనదే పొందుతున్నారు. మనల్ని మనం చూసుకుంటూ మన విజయాలను మెరుగుపరచుకోవాలి మరియు పెంచుకోవాలిగానీ ఇతరులను చూస్తూ కాదు.  మనం ఎవరికైనా సహకరించినప్పుడు అపారమైన సంతృప్తిని అనుభూతి చెందుతాం. అది మన ఆత్మిక శక్తిని పెంచుతుంది. మన సహకారాన్ని పొందిన వ్యక్తి నుండి ఆశీర్వాదాలను కూడా పొందుతాము. మన సంస్కారాలు లేదా అభిప్రాయాలు భిన్నంగా ఉన్నందున మనం వ్యక్తులను తిరస్కరించినట్లయితే, మన ప్రేమ, పంచుకోవడం మరియు శ్రద్ధ వహించే శక్తి నిరోధించబడుతుంది. మనం సహకరించినప్పుడల్లా మనం ప్రతిఫలంగా ఏదైనా పొందాలని ఆశిస్తున్నామో లేదో అని ఆ చర్య వెనుక మన ఉద్దేశాన్ని చెక్ చేసుకుందాం. అలా ఆశించినట్లయితే, సహకార శక్తి దురాశ శక్తితో కల్తీ అవుతుంది. అలాగే, మన సహకారాన్ని స్వీకరించే వ్యక్తి కంటే మనం ఉన్నతం అనే అహం ఉందేమో మనం చెక్ చేసుకోవాలి. అహం శక్తిని బలహీన పరుస్తుంది. విభిన్న సంస్కారాలను అంగీకరించి సర్దుకోవడం ద్వారా, పంచుకోవడం మరియు శ్రద్ధ వహించడం ద్వారా, మనం ప్రపంచంలోకి స్వచ్ఛమైన వైబ్రేషన్లను ప్రసరిస్తున్నాము. మన వైబ్రేషన్లు ప్రపంచంలోని సామూహిక చైతన్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మనం మారినప్పుడు, ప్రపంచం మారుతుంది మరియు మరింత ఐక్యంగా, సామరస్యంతో నిండి ఉంటుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »
15th march 2025 soul sustenance telugu

ద్వేషం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అనేక విభిన్న సంబంధాల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒక అందమైన సంబంధం ఎలాంటి ద్వేషం లేని నిజమైన ఆత్మిక ప్రేమ పై

Read More »