Hin

19th october 2024 soul sustenance telugu

October 19, 2024

ప్రదర్శించేందుకు బదులుగా వినయాన్నివినయాన్ని అనుభూతి  చేసుకోండి

గుర్తింపుకు బానిసైన ప్రపంచంలో, మనం ఇతరుల దృష్టిని మన వైపు, మన విజయాల వైపు, ఆస్తులు మరియు హోదా వైపు ఆకర్షించాలనుకుంటున్నాము. మనము ప్రదర్శిస్తాము, స్వీయ ప్రచారం చేసి ఇతరుల ప్రశంసలను కోరుతాము. అన్ని విలాసాలను సొంతం చేసుకోవడం మరియు ఉన్నత హోదాను సంపాదించడం ఒక అంశం, కానీ వాటి గురించి ప్రగల్భాలు పలుకడం పూర్తిగా మరొక అంశం. ప్రగల్భాలు జయాపజయాల భాషను మాట్లాడుతుంది. నిరాడంబరత వినయం మరియు సమానత్వం యొక్క భాష మాట్లాడుతుంది.

  1. మీరు నిరాడంబరంగా లేదా వినయంగా ఉండాలనుకున్నప్పటికీ, మీరు దానిని మీ రోజువారీ జీవితంలో అమలు చేస్తున్నారో లేదో తనిఖీ చేయాలి. అంతేకాకుండా, సోషల్ మీడియాలో తమ జీవితంలోని విజయవంతమైన అంశాలను ప్రదర్శించే ఇతర వ్యక్తులను చూడటం మీరు కూడా అదే విధంగా చేయటానికి ఉత్సాహం కలిగించవచ్చు.
  2. నిరాడంబరత పెంపొందించు కోవడానికి, మీ జీవితంలోని ప్రతిదీ అనగా వ్యక్తులను , జంతువులను, మొక్కలను, వస్తువులను గౌరవించి మితంగా వాడండి. ఏదీ మరొకటి కంటే ముఖ్యమైనది కాదని మెచ్చుకోండి. వారందరికీ సమానమైన కృతజ్ఞత మరియు శ్రద్ధ చూపండి.
  3. నీరు, విద్యుత్, డబ్బు, ఆహారం, దుస్తులు వంటి అన్ని వనరులను విలువైనవిగా భావించి వాటిని మితంగా ఉపయోగించుకోండి. మీ అవసరాలు మరియు కోరికలను వేరు చేయండి. మీ అవసరాలను తీర్చడానికి మరియు సౌకర్యవంతంగా జీవించడానికి ప్రయత్నించండి. మీ అంతులేని కోరికలు లేదా ఆశలపై నియంత్రణ పెట్టండి.
  4. నిరాడంబరత అంటే మీరు విజయాన్ని విస్మరించడం లేదా సౌకర్యాలను వదులుకోవడం అని అర్థం కాదు. మీ బలాలు మరియు విజయాలను గుర్తించండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, కానీ ప్రదర్శించకండి. మీ వంతు కృషి చేసి, వినయంగా ఉండండి, ఎక్కడ ఇవ్వాలో అక్కడ క్రెడిట్ ఇవ్వండి. మీ విజయాలన్నింటినీ మరియు గుర్తింపును భగవంతునికి అర్పించండి,దానిని స్వీకరించి అహంభావంతో ఉండవద్దు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »