Hin

14th dec 2024 soul sustenance telugu

December 14, 2024

ప్రపంచ పరివర్తనలో మహిళల పాత్ర

ప్రపంచంలో ప్రత్యేకమైనవారిగా చేసే అనేక మంచి సుగుణాలు మరియు శక్తులతో మహిళలు ఆశీర్వదించబడ్డారు. భగవంతుడు వారి ప్రత్యేకతలను చాలా ప్రేమిస్తారు. స్వచ్ఛత, శాంతి, ప్రేమ మరియు ఆనందాల కొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో వారిని ముందుంచుతారు. కొత్త ప్రపంచాన్ని సృష్టించి, వెలుగుతో నిండిన ప్రపంచంలో కొత్త ఉదయాన్ని తీసుకువచ్చే ఈ పనిలో వారు విజయం సాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని చూసి ధారణ చేద్దాం –

  1. బేషరతు ప్రేమ – ఎటువంటి అపేక్షలు, షరతులు లేకుండా ఇచ్చే నిస్వార్థ ప్రేమకు మూలం, ఒక స్త్రీ. తన ఆనందాన్ని, అంతరిక సౌందర్యాన్ని కోల్పోయిన ప్రపంచంలోని ప్రతి ఆత్మ, ఈ ప్రేమను స్వీకరించినప్పుడు తనను తాను పునరుద్ధరించుకొని తాజాగా వికసిస్తూ భగవంతుడు సృష్టించే కొత్త ప్రపంచానికి తనను తాను సిద్ధం చేసుకుంటుంది.
  2. వినయం – ఆంతరిక అందాన్ని కలిగి ఉన్న స్త్రీ, తన అహంభావాన్ని పూర్తిగా త్యాగం చేసి, తనను తాను భగవంతునికి మరియు వారి కర్తవ్యానికి అంకితం చేసుకున్న వ్యక్తి. ప్రతి ఆత్మను పరిపూర్ణంగా, స్వచ్ఛంగా చేయడానికి భగవంతుడు చూపించటానికి నిమిత్తమైనవారు స్త్రీ. ప్రపంచంలోని ఆత్మలందరి కష్టమైన, ప్రతికూల సంస్కారాలను మార్చడానికి భగవంతుడు ఆమె సుగుణాన్ని ఉపయోగిస్తారు.
  3. సహనం – ప్రపంచ పరివర్తన యొక్క దివ్యమైన కార్యంలో ఏ అడ్డంకినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్న స్త్రీ, సహనానికి చిహ్నం. తను అవసరమైనప్పుడు ముందు ఉంటూ, ఇతర సమయాల్లో నమస్కరిస్తుంది. ఎందుకంటే తనకు ప్రతి పరిస్థితికి అనుగుణంగా ఉండగలిగే కళ తెలుసు.

4.అమితమైన సేవా దృక్పథం – ఒక మహిళ ఎంతగా సేవ  చేస్తుందో అంతగా తాను భగవంతుని ఆశీర్వాదాలు లభించినట్లుగా అనుభూతి చెందుతుంది. భగవంతుడు ఆ మహిళను ప్రపంచానికి చూపించి తన ద్వారా ఈ సృష్టిని స్వర్గంగా మారుస్తారు. ఆ స్వర్గంలో ఉత్తమ గుణాలు కలిగిన పురుషోత్తములు కనిపిస్తారు.

  1. ఆనందంగా మరియు శాంతియుతంగా – ప్రపంచాన్ని, ప్రకృతిని శుద్ధి చేయడానికి భగవంతుడు స్త్రీలను ఎన్నుకున్నారు. ఎందుకంటే వారు భగవంతునితో సంబంధం జోడించడంతో శాంతి, ఆనందాలతో నిండి ఉంటారు. ఈ శక్తులు వారి ద్వారా ప్రతి ఆత్మకు, ప్రపంచంలోని ప్రతి జీవికి మరియు భౌతిక వస్తువుకు చేరి దానికి కొత్త ఆకారాన్ని ఇస్తారు.
  2. అమాయకత్వం – మహిళలు అమాయకత్వంతో నిండి ఉంటారు. వారు భగవంతుని అమాయకత్వానికి ప్రతిబింబం. వారు భగవంతుని పట్ల తమ ప్రేమ ద్వారా వారి హృదయాన్ని గెలుచుకుంటారు. ఇతరులతో భగవంతుని ప్రేమను పంచుకుంటారు, ఇది భగవంతునికి దగ్గరగా రావడానికి మరియు అదే భగవంతుని ప్రేమను అనుభవం చేసుకోవటానికి వారిని ప్రేరేపిస్తుంది, ఇది వారిలో సానుకూల పరివర్తనను తెస్తుంది.

 

బ్రహ్మా కుమారీలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ. దీనిని ప్రధానంగా అన్ని వయసుల, మతాలు, కులాలు మరియు జీవితంలోని అన్ని రంగాలకు చెందిన మహిళలు నిర్వహిస్తున్నారు. ఈశ్వరీయ జ్ఞానం మరియు ధ్యానం సహాయంతో కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే లక్ష్యంతో 1936లో భగవంతుడు దీనిని సృష్టించారు.

రికార్డు

15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »
13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »