
జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి. మన కర్మలు ఎంత
August 13, 2024
ప్రతి రంగంలో చాలా విజయాలు సాధించి, అనేక సౌకర్యాలతో మరియు సానుకూల ప్రయోజనాలతో జీవిస్తున్న ప్రపంచంలో మనం ఉన్నాము. మనం చాలా ఆధునిక యుగంలోకి ప్రవేశించామని, సాంకేతికతతో నిండి ఉందని, ప్రపంచం మునుపెన్నడూ లేనంత అందంగా కనెక్ట్ అయి ఉందని మనము భావిస్తున్నాము. కానీ అదే సమయంలో, మనుషులు వివిధ రకాల మాధ్యమాల ద్వారా, అనేక ఇతర మార్గాల్లో సన్నిహితంగా వస్తున్నా కానీ ప్రేమ మరియు అవగాహనలో ఒకరికొకరు దూరంగా వెళుతున్నారనే ఆందోళన ప్రపంచంలో పెరుగుతోంది. అలాగే, మునపటి లాగా కాకుండా శారీరిక అనారోగ్యానికి చమత్కారపు వైద్య నివారణలు నేడు అందుబాటులో ఉన్నాయి, కానీ ఇదే సమయంలో శారీరక మరియు మానసిక అనారోగ్యాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయి అంటే అందరూ ప్రపంచానికి ఏమి జరుగుతుందో అని, కొందరు చిన్న వయస్సులోనే, ఊహించని పరిస్థితులలో ఎందుకు చనిపోతున్నారో అని ఆశ్చర్యపోతున్నారు, అనేక కుటుంబాలు అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యల కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోతున్నారు. ప్రస్తుత ప్రపంచంలో, మనస్సు అకస్మాత్తుగా చాలా కోరుకుంటుంది, కోరుకున్నవి త్వరగా కావలంటుంది కనుక దాదాపు ఎల్లప్పుడూ తగినంతగా అసంతృప్తిగా ఈంటుంది. మన వ్యక్తిత్వంలో కోపం, అహం, దురాశ, అసూయ, ద్వేషం మరియు ఆందోళనతో మనం ఎందుకు అంత సంక్లిష్టంగా మారామో మనకు తెలియదు.
నేడు, మనుషులు కొన్ని విధాలుగా సంతోషంగా ఉన్నారు కానీ శాశ్వతంగా కాదు. వారికి అపారమైన వినోద వనరులు ఉన్నాయి, కానీ అదే సమయంలో, బాధ మరియు ఒత్తిడికి పెద్ద సంఖ్యలో వివిధ కారణాలు తలెత్తాయి. కొంతమందికి డబ్బు సంపాదించడం సులభం కానీ అంతగా విజయవంతం కాని కొంతమందికి, ఇది వారి జీవితంలో అత్యంత కష్టమైన అంశం, దీనితో వారు నిరంతరం పోరాడవలసి ఉంటుంది. అనేక ఇతర సమస్యలపై మనుషుల మధ్య ఉన్నత-దిగువ విభజనలే కాక ఇతర విభజనల ప్రపంచంలో అనేకులకు మనుగడ కష్టంగా ఉంది . అందుకే నేడు, ప్రపంచం ఈ సమస్యలను నిరోధించగల, అలాగే ప్రపంచంలో జరుగుతున్న పతనం ఆపగల కొంత మార్పు కోసం చూస్తోంది. ఆధ్యాత్మిక జ్ఞానం మరియు మెడిటేషన్ అనేవి భగవంతుడు ప్రపంచానికి ఇచ్చిన సాధనాలు, ఇవి ఆత్మకు భగవంతునితో అనగా పరమ ఆత్మతో సంబంధాన్ని పునరుద్ధరించడంలో సహాయపడతాయి. మరియు ఆత్మను దాని నిజధర్మాలు-శాంతి, సంతోషం, ప్రేమ, ఆనందం, స్వచ్ఛత, శక్తి మరియు సత్యంతో నింపడంలో కూడా సహాయపడతాయి. మన వ్యక్తిగత జీవితంలోని, మన సమాజంలోని అలాగే ప్రపంచంలోని అన్ని విభిన్న అంశాలను నయం చేయడానికి ఆత్మ వైద్యం కీలకం.
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి. మన కర్మలు ఎంత
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు (నిన్నటి సందేశం నుండి మెడిటేషన్ కామెంటరీ కొనసాగుతుంది…) ఇది నా వాస్తవిక ఇల్లు, శాంతిధామం, భూమిపై వివిధ భౌతిక శరీరాల
Start your day with a breeze of positivity and stay motivated with these daily affirmations
After Clicking on Join, You will be redirected to Whatsapp Community to receive daily message. Your identitiy will be secured and no group member will know about another group member who have joined.