Hin

10th dec 2023 soul sustenance telugu

December 10, 2023

ప్రశంసలు మరియు విమర్శలలో స్థిరత్వం

ప్రశంసలు మన అహాన్ని పెంచితే, విమర్శలు వచ్చినపుడు మనం కలత చెందడం ఖాయం. ప్రశంసలు లేదా విమర్శల ద్వారా ప్రభావితం కాకుండా మన చర్యలపై దృష్టి పెట్టాలని ఆధ్యాత్మిక జ్ఞానం మనకు బోధిస్తుంది.

  1. ఏదైనా అభిప్రాయానికి మీ మొదటి రియాక్షన్ ఎలా ఉందో చెక్ చేసుకోండి: మీరు ప్రశంసల వలన ఆకర్షితులవుతున్నారా? మిమ్మల్ని మీరు విమర్శల నుండి రక్షించుకుంటారా లేదా మీరు విమర్శించబడినప్పుడు తిరిగి స్పందిస్తారా? అలా అయితే, పాజ్ తీసుకోవడం ప్రాక్టీస్ చేసి స్థిరత్వం యొక్క ప్రతిస్పందనను ఎంచుకోండి.
  2. భగవంతుని ఉపకరణం అనే స్పృహతో మానసికంగా నిర్లిప్తంగా ఉంటూ వినయంగా పాల్గొనాలి కూడా. ప్రతి ఒక్కరి అభిప్రాయం భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకుని మీ కార్యాచరణలోకి వెళ్లండి.
  3. ప్రశంసలతో ప్రభావంలోకి రాకుండా ఉండడాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రశంసలు ఎదుట వ్యక్తి యొక్క అవగాహన, వారి స్వచ్ఛమైన ఉద్దేశం మరియు వారి దాతృత్వానికి ప్రతిబింబం. అవతలి వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి భగవంతునికి ఆ ప్రశంసను అప్పగించండి. మంచి పనిలో ఒక సాధనంగా ఉపయోగించినందుకు కృతజ్ఞతతో ఉండండి.
  4. ప్రశంసలో స్థిరంగా ఉండడం వల్ల విమర్శలను గౌరవంగా ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది. మిమ్మల్ని విమర్శించే వ్యక్తి అతని అవగాహన, మానసిక స్థితి మరియు వ్యక్తిత్వాన్ని చిత్రీకరిస్తున్నాడు. దానికి జోడించబడిన భావోద్వేగ శక్తి నుండి వేరు అయి వారి అభిప్రాయాన్ని నిర్ధారించి మీరు చేయవలసింది ఏదైనా ఉంటే అది చేయండి. ఏమీ చేయవలసినవసరం లేక పోతే ఆ విషయాన్ని పూర్తిగా వదిలేసి స్థిరంగా ఉండండి. మీరు మిమ్మల్ని మరియు వారిని గౌరవించండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

10th sep 2024 soul sustenance telugu

5 రకాల ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోండి

జీవించే కళ  ప్రధానంగా 5 రకాల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది: శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం. పరస్పరం అనుసంధానించబడి ఉండటం వలన, ఇవన్నీ మన

Read More »
9th sep 2024 soul sustenance telugu

గందరగోళం కాకుండా స్పష్టత కలిగి ఉండండి

శాంతి మరియు స్థిరత్వంతో కూడిన జీవితాన్ని గడపడానికి స్పష్టత కలిగి ఉండటం కీలకం. కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలి లేదా ఏ దిశలో అడుగు పెట్టాలి అని మనం తరచుగా ఆలోచిస్తూ ఉంటాము.

Read More »
8th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 2)

శ్రీ గణేషుని పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. వ్యక్తుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేషుని చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం చూపిస్తారు,

Read More »