Hin

22nd july 2024 soul sustenance telugu

July 22, 2024

ప్రశంసల కోరిక నుండి విముక్తి పొందడం (పార్ట్ 1)

మన రోజువారీ జీవితంలో, మనలో కొందరు అనుభవం చేసుకునే  చాలా సాధారణ భావన ఏమిటంటే మనం చేసిన పనికి ప్రశంసలు పొందాలనే కోరిక. మీ కోసం, మీ కుటుంబం మరియు స్నేహితుల కోసం అలాగే ప్రపంచం కోసం మంచి పనులు చేయండి, కానీ ఆ పనులకు బదులుగా ప్రశంసలను కోరుకోవద్దు అని సాధారణంగా చెబుతారు. ఇది కొన్నిసార్లు గుర్తుంచుకోవడం సులభం, కానీ చాలా మందికి అమలు చేయడం కష్టం. సమాజంలో లేదా నా కార్యాలయంలో లేదా ఇంట్లో నేను చేసే పనులకు గుర్తింపు ఆశించడం సహజం కాదనీ కొందరు అంటారు. కొంతమంది తమ మంచి చర్యలు తప్పక చాలా మందికి కనిపించాలి అని కూడా భావిస్తారు. లేకపోతే మంచి  చేయడానికి ప్రేరణ కలగదు.

ఒక నటుడి ఉదాహరణను చూద్దాం. ఒక నటుడు మంచి నటనను ప్రదర్శించినపుడు, అతని నటనకు ప్రశంసలు అందుకుంటాడు. అతను మంచి నటన చేయనప్పుడు, వ్యక్తులు ప్రదర్శనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. కాబట్టి అతను తన రెండు ప్రదర్శనల కోసం సమాన అంకితభావంతో కష్టపడి పనిచేసినప్పటికీ, అతని పనితీరును బట్టి అందరు గ్రహించినట్లుగా అతను సంతోషంగా మరియు విచారంగా భావిస్తాడు. అదే విధంగా, ప్రసిద్ధి చెందిన, విజయవంతమైన క్రీడాకారుడు, అతను పదవీ విరమణ చేసిన తర్వాత తన కీర్తిని గణనీయంగా కోల్పోతాడు. ఇతర యువ క్రీడాకారులు అదే క్రీడలో తన స్థానాన్ని పొందుతారు, వారు కొన్నిసార్లు అతని కంటే ఎక్కువ విజయాలు సాధిస్తారు. కాబట్టి, మిమ్మల్ని ప్రశంసించినప్పుడు సంతోషంగా ఉండటం తప్పు కాదు. కానీ మీ సంతోషాన్ని ప్రశంసలపై ఆధారం చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే అప్పుడు అది ఆధారపడటం అవుతుంది. అలాగే, నిర్లిప్త భావంతో చర్యలను చేయండి, ఎందుకంటే మీరు ఆ చర్యలకు ప్రశంసలు పొందవచ్చు లేదా పొందకపోవచ్చు, కానీ మీరు రెండు సందర్భాల్లోనూ సంతోషంగా ఉండాలి. ఈ సందేశంలో మనం అటువంటి కోరికల నుండి విముక్తి పొందడానికి కొన్ని సరళమైన పద్ధతులను చూద్దాం.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

11th july 2025 soul sustenance telugu

చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల

Read More »
10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »