ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం
మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ
November 12, 2024
మన విశేషతలు వాలనో లేదా మనం సాధించిన విజయానికో ఇతరులు మనల్ని మెచ్చుకున్నప్పుడు, వారు మన గురించి చెప్పేది నిజానికి మన గురించి కాదు. మనలో మంచితనాన్ని చూడగలిగే వారి సుగుణాన్ని వారు కనబరుస్తారు. ఇది మన గురించి వారి అభిప్రాయం, వారి దృక్పథం. అది మారుతూ ఉంటుంది. వారి హావభావానికి వారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం, కానీ మోసపోకూడదు లేదా ప్రశంసలకు బానిస కాకూడదు. మీ సోషల్ మీడియా పోస్ట్ కు చాలా తక్కువ లైక్లు వచ్చాయి. వారాంతంలో మీరు ఒక ప్రాజెక్ట్ కోసం చేసిన కృషిని మీ బాస్ గుర్తించలేదు. మీ కుటుంబం వారి పట్ల మీ శ్రద్ధను, ప్రేమను చాలా అరుదుగా గుర్తించింది. ఈ అంశాలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నాయా? మీకు సూక్ష్మంగానైనా సరే తప్పకుండా మెచ్చుకోవాలని అనిపిస్తుందా? పొగడ్తను పొందడం ఒక విషయం, దానిని కోరుకోవడం పూర్తిగా మరొకటి. ప్రశంస అనేది వ్యక్తిగతమైనది. ఒక వ్యక్తి మనల్ని ప్రశంసించవచ్చు, మరొకరు మనల్ని దిగజార్చవచ్చు. ప్రశంసలకు బానిస కావడం మన జీవిత నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది అంటే నిరంతరం మనం వ్యక్తులపై ఒక ముద్ర వేయడానికి పనులు చేస్తాము. ఎవరైనా మనల్ని మెచ్చుకున్నప్పుడు, మనలోని మంచితనాన్ని చూడటం ఆ వ్యక్తి యొక్క మంచి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి ప్రశంస అనేది వారి గురించి ఎక్కువగా ఉంటుంది, మన గురించి కాదు. ఈ అవగాహన మనము స్థిరంగా, వినయంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది మన అహంభావాన్ని అదుపులో ఉంచుతుంది. ప్రశంసలను స్వీకరించవద్దు. బదులుగా, భగవంతునికి కృతజ్ఞతలు చెప్పి పొగడ్తలను వారికి అప్పగించండి. మిమ్మల్ని ప్రశంసించడానికి మంచితనాన్ని చూపిన వ్యక్తికి కూడా వినయంగా ధన్యవాదాలు తెలపండి.
మీరు వినయపూర్వకమైన వ్యక్తి అని ఎల్లప్పుడూ మీకు మీరు గుర్తు చేసుకొని ఆ స్వరూపంగా ఉండండి. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ మరియు శ్రద్ధను ప్రసరింపజేయండి. మీ పాత్రలు, బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించండి. వ్యక్తులు మీ గుణాలతో, ప్రతిభతో సంతోషంగా ఉన్నప్పుడు, వారు మిమ్మల్ని మెచ్చుకుంటారు. కానీ మీరు గుర్తింపు కోసం కాకుండా నిస్వార్థంగా చేసే పనిని చేస్తున్నప్పుడు మీరు ప్రభావితం లేదా ఉత్సుకతతో ఉండకూడదు. మీరు మీ నిజమైన స్వభావంతో ఉండండి. మీరు ప్రశంసించబడిన ప్రతిసారీ, మీరు భగవంతుని సాధనం అని వెంటనే మీ మనస్సుకు గుర్తు చేయండి. మీరు దీన్ని చేయడానికి ఎంపిక చేయబడ్డారు, ఆ వ్యక్తులు దానిని పొందే భాగ్యం కలిగి ఉన్నారు మరియు ఆ సన్నివేశంలో భాగం కావడం మీ అదృష్టం. మీరు భగవంతునికి కృతజ్ఞతలు తెలిపి ప్రశంసలను వారికి సమర్పించండి, అవకాశం ఇచ్చినందుకు వ్యక్తులకు కృతజ్ఞతలు తెలపండి. వారి ప్రశంస వారి మంచితనానికి ప్రతిబింబం అని మీరు తెలియచేయండి. ఇతరులలో మంచితనాన్ని గమనించడం వారి స్వభావాన్ని చూపుతుంది. ప్రశంసలలో స్థిరంగా ఉండండి. ప్రశంసలు ఆశించకండి, మీ కోసం అని అంగీకరించకండి, అది మిమ్మల్ని ప్రభావితం చేయదు. వినయాన్ని మీ సహజ జీవన విధానంగా చేసుకోండి.
మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ
స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని
స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో
Start your day with a breeze of positivity and stay motivated with these daily affirmations
After Clicking on Join, You will be redirected to Whatsapp Community to receive daily message. Your identitiy will be secured and no group member will know about another group member who have joined.