Hin

21st june 2025 soul sustenance telugu

June 21, 2025

ప్రశంసలు మరియు విమర్శలలో స్థిరత్వం

ప్రశంసలు మన అహంభావాన్ని పెంచితే, విమర్శించినప్పుడు మనం ఖచ్చితంగా కలత చెందుతాము. ప్రశంసలు లేదా విమర్శల వల్ల ప్రభావితం కాకుండా మనం మన చర్యలపై దృష్టి పెట్టాలని ఆధ్యాత్మిక జ్ఞానం మనకు బోధిస్తుంది.

  1. మీరు ఏదైనా ఫీడ్‌బ్యాక్ అందుకున్నప్పుడు మీ మొదటి ప్రతిస్పందనను పరిశీలించండి: మీరు ప్రశంసలపై మక్కువ చూపుతారా? విమర్శలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు సమర్ధించుకోవడం లేదా తిరిగి స్పందించడం చేస్తారా? అలా అయితే, తదుపరి సారి స్థిరత్వంతో స్పందించేందుకు ఒక క్షణం విరామం తీసుకునే సాధనను ప్రారంభించండి.
  2. భగవంతుని పరికరం అనే భావనతో వినమ్రతతో ఉండండి — భావోద్వేగాల నుండి దూరంగా ఉంటూ బాధ్యతతో ఉండాలి. ప్రతి ఒక్కరి అభిప్రాయం వేరుగా ఉంటుందని తెలుసుకుని మీ కార్యాచరణ రంగంలోకి ప్రవేశించండి.
  1. ప్రశంసల వల్ల ప్రభావితమవకుండా ఉండటం అభ్యాసించండి. ప్రశంసలు అనేవి ఇతరుల దృక్కోణం, వారి శుభాభిప్రాయం మరియు వారి ఔదార్యం యొక్క ప్రతిబింబం. అవతలి వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పండి, భగవంతునికి ప్రశంసలను సమర్పించి, సానుకూల కార్యాలలో ఒక సాధనంగా ఉపయోగపడినందుకు కృతజ్ఞతతో ఉండండి.
  2. ప్రశంసలు వచ్చినప్పుడు స్థిరంగా ఉండగలగటం, విమర్శను కూడా గౌరవంతో స్వీకరించడంలో సహాయపడుతుంది. ఎవరైనా మిమ్మల్ని విమర్శించడం అంటే, వారు వారి దృక్కోణం, మనస్థితి మరియు వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరిస్తున్నారని అర్థం. అందులో ఉన్న భావోద్వేగాలను పక్కన పెట్టి, ఆ అభిప్రాయాన్ని నిశితంగా పరిశీలించి, అవసరమైతే చర్య తీసుకోండి. అవసరం లేకపోతే దాన్ని పూర్తిగా పక్కనపెట్టి, వదిలేసి మీ స్థిరతను నిలుపుకోండి. మిమ్మల్ని మరియు వారిని గౌరవించండి.

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »