Hin

22nd dec 2023 soul sustenance telugu

December 22, 2023

ప్రతికూలంగా నియంత్రించడం మానేయండి మరియు సానుకూలంగా ప్రభావితం చేయడం ప్రారంభించండి

సంబంధాల ద్వారా ప్రభావితం చేయడం యొక్క శక్తి అతిశయమైనది, కానీ మనం నియంత్రణ మరియు బలవంతం చేయడానికి ప్రయత్నించినప్పుడు అది తప్పకుండా  అదృశ్యమవుతుంది.

మీరు అనేక విధాలుగా ఎవరినైనా సానుకూలంగా ప్రభావితం చేయవచ్చు:

– ప్రోత్సాహకరంగా,

– పంచుకుంటూ,

– వింటూ,

– సరైన విధంగా కమ్యూనికేట్ చేస్తూ

ప్రతికూలంగా నియంత్రించడంలో మనం ఒత్తిడి, విసుగు మరియు కోపాన్ని సృష్టిస్తాము. సానుకూలంగా  ప్రభావితం చేసినపుడు శక్తి ప్రశాంతమైన దిశలో, సామరస్యంగా ప్రవహిస్తుంది, అది భయపెట్టేదిగా  ఉండదు. ప్రతి ఒక్కరినీ వారి ప్రత్యేకతలకు గౌరవం ఇచ్చేలా చేసి అందరూ వారిలా ఉండేలా చేస్తుంది.

సానుకూలంగా ప్రభావితం చేయడానికి, మనం ఏమి ఆలోచించాలి, మాట్లాడాలి మరియు చేయాలనే విషయంలో పరిశీలన మరియు నిర్ణయ శక్తి అవసరం. ఉదా. అవతలి వ్యక్తి సమస్య అని మీరు అనుకున్నప్పుడు; సాధారణంగా సమస్య ఇతరులు ఏమి మాట్లాడతారు లేదా ఏమి చేస్తారు అనేది కాకుండా  మీరు వారిని ఎలా గ్రహిస్తున్నారు అనే దాన్నిబట్టి ఉంటుంది. మీరు పరిస్థితిని పరిశీలించి నిర్ధారించే విధానం వారి గురించి మీ ప్రతికూల భావాలను సృష్టిస్తుంది. ఇతరులను ముప్పుగా, సమస్యగా లేదా అవకాశంగా భావించే ఎంపిక మనకు ఉంది; నేర్చుకోవడానికి, స్వపరివర్తన కోసం, సంభాషణ మరియు అవగాహన కోసం ఒక అవకాశం. మనం ప్రేమగా ఉండడాన్ని ఎంచుకోవచ్చు; మరొకరిని సమస్య అని భావించడం దయ లేకపోవడాన్ని సూచిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »
17th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ

Read More »
16th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి

Read More »