Hin

12th Jan 2024 Soul Sustenance Telugu

January 12, 2024

ప్రతి అడుగులో దృఢంగా మరియు సానుకూలంగా ఉండండి (పార్ట్ 1)

మన జీవితంలో వేసే ప్రతి అడుగులో మనం ఎంత దృఢంగా ఉంటున్నాము, ఆ దృఢత శక్తిని ఉపయోగించి అనేక ఆటంకాలను ఎలా అధిగమిస్తున్నామన్నది చాలా ముఖ్యమైన మరియు ప్రభావవంతమైన విషయం, అయితే కొన్నిసార్లు మనం ఈ విషయానికి సరైన ప్రాముఖ్యతను ఇవ్వము. విశ్వాసం పర్వతాలను కదిలించగలదు, విశ్వాసం అంటే జీవితంలోని ప్రతి అడుగులో దృఢమైన  సంకల్పం అని అంటారు. నెగెటివ్ నుండి, అనవసరమైన ఆలోచనల నుండి నేను దూరంగా ఉంటాను అని మీతో మీరు చెప్పుకోవడమే విశ్వాసం. అలాగే, ప్రతి పరిస్థితిలో, కష్టాలను అధిగమించే సమయాలలో అవసరమైన సానుకూల ఆలోచనలను మనసులో నింపుకుని విజయాన్ని సాధించడమే విశ్వాసం.

ప్రతికూల పరిస్థితుల గాలులు ఎంత తీవ్రంగా ఉన్నాగానీ, బాహ్య పరిస్థితికన్నా నా ఆంతరిక మానసిక స్థితి గొప్పది అన్న నమ్మకంతో స్ట్రాంగ్‌గా ఉండటమే దృఢత. మనం గట్టిగా ఉంటే, పరిస్థితి బలహీనపడి తక్కువ సమయంలోనే అది వెళ్ళిపోతుంది. కనుక, పరిస్థితితో ఎన్ని రకాలుగా పోరాడుతారు అన్నది ముఖ్యం కాదు, మీ ఆత్మ బలంతో, మీరు కోరుకున్న విధంగా కష్టంలో వచ్చే దృశ్యాలను మార్చడం ముఖ్యం. చాలాసార్లు మనం కోరుకున్నట్లుగా పరిస్థితులు ఉండవు, మనకు కావలసిన విధంగా మరల్చుకోవడానికి మనం ముందుగా బాహ్యంగా పోరాడుతుంటాం. ఒక్కోసారి మనం గెలవవచ్చు, ఒక్కోసారి గెలవకపోవచ్చు, ఇందుకు కారణం మనకు సరిపడేంత ఆత్మ బలం లేకపోవడమే. ఇందుకు ముఖ్య కారణం, మన ఆంతరిక స్థితి, మనలో దృఢత బలంగా లేకపోవడమే. కనుక, స్వయాన్ని శక్తివంతమైన స్థితిలోకి తీసుకురావాలి, శక్తి అంటే బాహ్య శక్తి కాదు. ఆంతరిక శక్తితో మనసును శక్తివంతంగా చేసుకుని కష్టాల ప్రభావానికి మనసును దూరంగా ఉంచాలి. బాహుబలంకన్నా, పాత్ర బలంకన్నా, హోదా బలంకన్నా మనో బలం గొప్పది. మనో బలం కష్టాలను అనతి కాలంలోనే మార్చివేసి వాటిని సానుకూలంగా మార్చగలదు.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

12th May 2025 Soul Sustenance Telugu

సంఘర్షణల సమయంలో వ్యక్తులతో మాట్లాడండి … వారి గురించి మాట్లాడకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సంబంధంలో విభేదాలు ఏర్పడినప్పుడు, మనలోని నెగటివ్ భావోద్వేగాలు తరచుగా అవతలి వ్యక్తితో మన సంభాషణలో అవరోధంగా మారతాయి. అవతలి వ్యక్తి గురించి

Read More »
11th May 2025 Soul Sustenance Telugu

మన పోజిటివిటీ కవచాన్ని బలంగా చేసుకోవటం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం కఠినమైన సమయాలను ఎదురవుతున్నాము మరియు జీవితం మనపై వివిధ నెగెటివ్  పరిస్థితుల బాణాలను మళ్లీ మళ్లీ విసురుతుంది. మనందరికీ పాజిటివిటీ

Read More »
10th May 2025 Soul Sustenance Telugu

విసుగు ను(కోపం యొక్క మరో రూపం) అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలో మనం ఎప్పటికీ మార్చలేని రెండు విషయాలు: – గతం మరియు – వ్యక్తులు ఇది మనల్ని ఎదో ఒక రకంగా

Read More »