Hin

13th Jan 2024 Soul Sustenance Telugu

January 13, 2024

ప్రతి అడుగులో దృఢంగా మరియు సానుకూలంగా ఉండండి (పార్ట్ 2)

దృఢత్వం ఒక మానసిక బలం, ఇది ఎంతోకొంత మనందరిలో ఉంటుంది, దీనిని మనం ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ముందుగా, నేను దృఢంగా అవ్వాలి, నేను ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలి, నేను నా ఆంతరిక వ్యక్తిత్వాన్ని దోహదపరుచుకోవాలి, నేను జీవితంలో ప్రతి క్షేత్రంలో విజయాన్ని పొందాలి అని గుర్తించాలి. వీటితోపాటు జీవితంలో ఉండవలసిన ఇతర ఉద్దేశాలు – అందరితో ప్రేమగా ఉండటం, అందరి గురించి మంచిగా ఆలోచించడం, నా బంధాలను మరింత చక్కగా, శాంతియుతంగా మరియు ఆనందమయంగా చేసుకోవడం, మంచి వృత్తిని ఏర్పరచుకోవడం, నా పాత్రను మరింత సానుకూలంగా మల్చుకోవడం వంటివి. ఇవి మన జీవితంలోని వివిధ దశలలో ఉండవలసిన వివిధ లక్ష్యాలు మరియు ఉద్దేశాలు. వీటిని సాధించడానికి భౌతికంగా ఏదో ఒకటి చేయడంతో పాటు, ముందుగా, మన లోపల బలమైన దృఢమైన సంకల్పం ఉండటం అవసరం.

దృఢత్వం లేకుండా, బాహ్యంగా మనం ఎన్ని చేసినా, ఆశించిన లక్ష్యాన్ని విజయవంతంగా సాధించలేము. ఎందుకంటే, మన లక్ష్యాన్ని సాధించే దిశలో చేసే ప్రయాణ మార్గంలో మనకు ఆటంకాలు ఎదురవుతాయి, ఆటంకాన్ని చూసిన మరుక్షణం దానిని దాటగలిగే ఆత్మ శక్తి మనలో లేకపోవచ్చు. ఆశ, ఓర్పు, దృఢత్వం నిండిన ఆత్మ శక్తి మనసులో ఆలోచనలుగా, భావాలుగా ఉండాలి. కనుక, ప్రారంభం మన మనసులో జరగాలి, చాలా చాలా జాగ్రత్తగా, దృఢత్వం వైపుగా మన అడుగులు పడాలి, దృఢత్వం మన కర్మలలో కనిపించాలి. అప్పుడు ఈ దృఢత్వం క్రొత్త అవకాశాలను తెరిచేందుకు తాళం చెవి అవుతుంది, ఇది మీరు ఆశించిన విజయ గమ్యానికి తీసుకువెళ్తుంది.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

12th May 2025 Soul Sustenance Telugu

సంఘర్షణల సమయంలో వ్యక్తులతో మాట్లాడండి … వారి గురించి మాట్లాడకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సంబంధంలో విభేదాలు ఏర్పడినప్పుడు, మనలోని నెగటివ్ భావోద్వేగాలు తరచుగా అవతలి వ్యక్తితో మన సంభాషణలో అవరోధంగా మారతాయి. అవతలి వ్యక్తి గురించి

Read More »
11th May 2025 Soul Sustenance Telugu

మన పోజిటివిటీ కవచాన్ని బలంగా చేసుకోవటం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం కఠినమైన సమయాలను ఎదురవుతున్నాము మరియు జీవితం మనపై వివిధ నెగెటివ్  పరిస్థితుల బాణాలను మళ్లీ మళ్లీ విసురుతుంది. మనందరికీ పాజిటివిటీ

Read More »
10th May 2025 Soul Sustenance Telugu

విసుగు ను(కోపం యొక్క మరో రూపం) అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలో మనం ఎప్పటికీ మార్చలేని రెండు విషయాలు: – గతం మరియు – వ్యక్తులు ఇది మనల్ని ఎదో ఒక రకంగా

Read More »