Hin

14th jan 2024 soul sustenance telugu

January 14, 2024

ప్రతి అడుగులో దృఢంగా మరియు సానుకూలంగా ఉండండి (పార్ట్ 3)

ఇంచుమించు, ప్రతిరోజూ, మన దృఢత్వానికి పరీక్ష జరుగుతూ ఉంటుంది. ఇది మనందరికీ సర్వ సాధారణంగా అనుభవమైన విషయమే. ప్రతిసారీ, దృఢంగా ఉంటాను అని మనతో మనం ప్రతిజ్ఞ చేసుకుంటాం. మన ప్రతిజ్ఞను భంగ పరిచేందుకు, మానసికంగా మనల్ని అస్థిరంగా మరియు బలహీనంగా చేసేందుకు ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది. మనం బలహీనపడకుండా ఉండేలా చూసుకుంటూ, దృఢత మార్గంలో నడుస్తూ మనం ఆశించిన విజయాన్ని తక్కువ సమయంలోనే చేరుకునేలా మనం జాగ్రత్తపడాలి. దృఢంగా ఉండటం అంటే ఒక్క ఆలోచన కూడా బలహీనంగా, శక్తిహీనంగా ఉండకూడదు; కేవలం సానుకూల ఆలోచనలు మరియు విజయ సంకల్పాలే ఉండాలి, నిశ్చితమైన విజయాన్ని మీతో మీరు చెప్పుకుంటూ ఉండాలి.

 

కనుక, ఈ విధంగా, మనం విజయులుగా అవుతాము. విజయం నా జన్మసిద్ధ అధికారం, అది ఎప్పటికీ, ఒక్క క్షణం కూడా నా నుండి దూరమవ్వదు అన్న ఆలోచనలు మన కర్మలకు బలాన్నిచ్చే ఇంధనంగా అవుతాయి. ఫలితంగా, ప్రతి అడుగులో సానుకూల విజయం లభిస్తుంది. దృఢత్వం లేనిదే నిరంతర విజయం లభించదు. కొన్నిసార్లు, మన మనసులో నెగెటివ్ ఆలోచనలున్నాగానీ, మనం విజయాన్ని పొందుతుంటాము. ఒక్కోసారి, మనసు బలహీనంగా ఉన్నాగానీ, మనం ఊహించనిది, ఆశించనిది కూడా అకస్మాత్తుగా జరిగిపోతుంది. ఇలా అలవాటు అయిపోయి మనం ఎప్పుడూ అలాగే జరుగుతుంది అని అనుకుంటాము. కానీ ఇలా ప్రతిసారీ జరగదు. మొత్తానికి, మనల్ని మనం ఎంతగా సాధికారపరుచుకోవాలంటే మనలో వచ్చే శక్తిశాలి సంకల్పాలతో పరిస్థితులు బలహీనపడాలి, అవి మనలోని దృఢత్వాన్ని తగ్గించకూడదు. ఇలా చేసుకోవడం మనకు చాలా అవసరం, ఎందుకంటే, మరోసారి కష్టం వచ్చినప్పుడు, మనసు సంసిద్ధంగా ఉంటుంది, ప్రతికూలతను సానుకూలతలోకి విజయవంతంగా మార్చగలుగుతాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »
7th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సరిదిద్దుకోవటం – ఆత్మలో జ్ఞాపకాలు ఆత్మపై ముద్రలు వంటివి. కొన్ని ముద్రలు లోతైనవి, కొన్ని కాకపోవచ్చు. గత నెగిటివ్ అనుభవాలు ఆత్మపై

Read More »
6th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు పాజిటివ్ సమాచారం మరియు ఆధ్యాత్మిక నషా – మనం ప్రతిరోజూ 10 నిమిషాల పాటు పాజిటివ్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా

Read More »