HI

24th jan 2024 soul sustenance telugu

January 24, 2024

ప్రతి అడుగునూ విలువలతో వేయండి

మనం ఉన్నతిని పొందాలంటే, ఎక్కువ సంపాదించాల్సిన అవసరం లేదు, కానీ మనకు ఉన్న వాటిని – మన విశేషతలను కోల్పోకుండా చూసుకోవాలి. సాధారణంగా మన ప్రవర్తన మనతో ఎవరైనా ప్రవర్తించే విధానాన్ని ప్రతిబింబిస్తుంది. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాము. లేకపోతే మనం వారి పట్ల ప్రతికూలంగా మారతాము. కానీ వారి చర్యలను కాపీ చేయడం ద్వారా, మన స్వంత విశేషతలు  మసకబారకూడదు. ప్రపంచంలో క్షీణిస్తున్న నైతిక విలువల  వల్ల మీరు తరచుగా నిరుత్సాహానికి గురవుతున్నారా? మీరు మీ సుగుణాలతో ఎవరితోనైనా మాట్లాడితే, ఆ వ్యక్తి ఏ మాత్రం సానుకూలంగా స్పందించనప్పుడు, మీరు వారి  ప్రవర్తనను కాపీ చేయాలని భావిస్తున్నారా? మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏదైనా విలువను పాటించనందున మీరు దానిని వదులుకున్నారా? మనమందరం మనకు వీలైనంత మంచిగా మరియు దయతో ఉండటానికి ప్రయత్నిస్తాము. సమస్య ఏమిటంటే అవతలి వ్యక్తి అంతే మంచిగా (లేదా ఇంకా మెరుగ్గా) ఉండాలని మనం ఆశిస్తాము. అంతకన్నా పెద్ద సమస్య ఏమిటంటే, ఆ వ్యక్తి మనతో సరిగ్గా లేకపోతే, మనము వారి ప్రవర్తనను కాపీ చేస్తాము. మనం ఒకరి తప్పుడు  ప్రవర్తనను కాపీ చేసిన ప్రతిసారీ, మనం మన సుగుణాలకు దూరంగా అవుతాము. చివరికి మనం మన విశేషతలను వదులుకుంటాము. మన విలువలు, సుగుణాలు, సూత్రాలు మరియు నైతికత మన శక్తి . మనం వాటికి కట్టుబడి ఉందాము. మన చుట్టుపక్కల ఉన్నవారెవరూ వాటిని ఉపయోగించకపోయినా, ఇతరులు మానవ విలువలు పని చేయవని భావించినా, మనం వాటిని వదులుకోవద్దు. ఇతర వ్యక్తులు పూర్తిగా భిన్నమైన సుగుణాలను కలిగి ఉండవచ్చు, అవి మీలో లోపించవచ్చు. ప్రతిసారీ, మీ విలువలను ప్రతి ఒక్కరితో  ఉపయోగించాలని నిర్ధారించుకోండి. మీకు మీరు గుర్తు చేసుకోండి – నేను ఎల్లపుడూ పరిస్థితులు మరియు  చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధం లేకుండా అందరితో నా సద్గుణాలను ఉపయోగిస్తాను. నా విలువలు నా శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

 

మీలోని ఏ విశేషతనైనా మీ జీవితంలో వేసే ప్రతి అడుగులో, అది మీ నుండి ప్రతి ఒక్కరికి, ప్రతి పరిస్థితిలో ప్రవహించేలా చూసుకోవడం ప్రారంభించండి. ఇతరులలో ఆ విశేషత ఉండాలని ఆశించకూడదు. కేవలం అది వారిలో లేదని మీరు వదులుకోకూడదు. మీకు మీరే గుర్తు చేసుకోండి – నా గుణాలు నా ఆస్తులు. నేను వాటిని అన్ని సమయాలలో ప్రసరిస్తాను. వ్యక్తులు మరియు పరిస్థితులతో సంబంధం లేకుండా నా విలువలు ఉంటాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th feb 2024 soul sustenance telugu

గతం నుండి నేర్చుకుందాం

మీరు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా నిజాయితీగా గతంలో చేసిన పొరపాట్ల నుండి ఏమైనా నేర్చుకున్నారా లేక కేవలం గతంలోనే ఆగిపోతున్నారా? చివరకు గతాన్ని వృధాగా తలుచుకుంటూ చాలా తక్కువ నేర్చుకోవడం జరుగుతుందా?

Read More »
18th feb 2024 soul sustenance telugu

ఆపేక్షలను విడిచిపెట్టండి

మీ సహోద్యోగి సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయడంలో మీరు ఎప్పుడూ సహాయం చేస్తూనే వచ్చారు, కానీ ఒక్కసారి మీరు అతడిని సహాయం అడిగితే అతను నిరాకరించాడు. మీరు ఇంటికి చేరుకునేసరికి బాగా అలసిపోయారు. మీ

Read More »
17th feb 2024 soul sustenance telugu

దూకుడు స్పందనలను సమర్థించవద్దు

కొన్ని సందర్భాలలో మన మాటలను, ప్రవర్తనను నియంత్రించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది, అలాంటప్పుడు మనం దూకుడుగా స్పందించేస్తుంటాం. అప్పుడు మన పొరపాటును అంగీకరించకపోగా, తరచూ మన స్పందనను సమర్థించుకుంటూ ఉంటాము. ఈరోజుల్లో మన పాత్రలు

Read More »