Hin

5th dec 2024 soul sustenance telugu

December 5, 2024

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ ఆత్మపై రికార్డ్ చేయబడి, ఈ జీవితంలో లేదా భవిష్యత్ జీవితంలో పరిణామాలను తెస్తుంది. ఆంతరిక శక్తితో మనం సరైన కర్మలను సృష్టించడం నేర్చుకుంటాము మరియు గత కర్మల పరిణామాలను స్థిరత్వంతో ఎదుర్కొంటాము. జీవితం సాఫీగా జరిగిపోతుంటే అందుకు కారణం మీరు అని, కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిని లేక మనుషులను నిందిస్తన్నారా? మీరు మీ విధిని సృష్టించారని నమ్ముతున్నారా, లేదా అది ముందుగా నిర్ణయించబడిందనా? మన విధులకు సృష్టికర్తలం మనం. ప్రతి కర్మకు ఒక పరిణామం ఉంటుంది, అది మనకు ఈ రోజు, కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాలలో లేదా కొన్ని జన్మలలో రావచ్చు. మనకు ఏమి జరుగుతుందో దానికి ప్రతిస్పందనగా ఈ రోజు మనం చేసేది మన ప్రస్తుత కర్మ, అది పూర్తిగా మన ఎంపిక. పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రస్తుత కర్మగా ఇప్పుడు సరైన ఆలోచన, మాటలు మరియు ప్రవర్తనలను సృష్టించుకుందాం. సరైన వర్తమాన కర్మ గత కర్మల ఖాతాలను తీరుస్తుంది, ఈ రోజు ఆహ్లాదకరమైన అనుభవాన్ని మరియు మన భవిష్యత్తుకు అందమైన విధిని సృష్టిస్తుంది. వ్యక్తులు, పరిస్థితులు మనకు ఏమి చేస్తాయనే దానిపై దృష్టి పెట్టవద్దు. మన కర్మలను సరిగ్గా ఉంచడంపై దృష్టి పెట్టండి.

 

మీరు మీ జీవిత ప్రయాణంలో ఉన్నారు. మీ జీవితాన్ని మీ ప్రకారంగా, మీ విలువలు మరియు సూత్రాల ప్రకారం గడుపుతున్నారు. అది సాధారణ ఆహారం తీసుకోవటం, త్రాగటం, దుస్తులు ధరించడం లేదా జీవన అలవాట్లు లేదా సంస్కారాలు అయినా, మీ కర్మల ఖాతాకు సరైనది మాత్రమే ఎంచుకోండి. మీ ఆంతరిక శక్తిని పెంచేది, సంతోషాన్ని వ్యాప్తి చేసేది మాత్రమే చేయండి. పరిస్థితులతో సంబంధం లేకుండా మీ ప్రతి ఆలోచన, మాట, ప్రవర్తన స్వచ్ఛంగా, శక్తివంతంగా ఉండాలి. మీ అసలైన సుగుణాలు శాంతి, సంతోషాలను బయటకు తీయండి. ప్రతి కర్మలో వాటిని ఉపయోగించండి. వ్యక్తులతో, ప్రకృతితో, వస్తువులతో, మీ కోసం ఉన్న ప్రతిదానితో మంచి కర్మ సంబంధాలను కలిగి ఉండండి. ఈ రోజు మీ సంతోషం, ఆరోగ్యం, సామరస్యం మరియు విజయాలన్నీ మీ మంచి గత కర్మల వల్లనే. మరియు కొన్ని సవాళ్లు అంతగా సరైనవి కాని మీ గత కర్మల పరిణామాలు. ప్రశ్నలు లేకుండా వాటిని అంగీకరించండి, మీ శక్తి వర్తమానంలో ఉందని తెలుసుకుని వాటిని ఎదుర్కొనండి. గతాన్ని తీర్చుకోవటానికి, సంతోషకరమైన భవిష్యత్తును భద్రపరచడానికి స్వచ్ఛమైన వర్తమాన కర్మను ఎంచుకోండి. మీతో సరిగ్గా ఉన్న ప్రతి ఒక్కరికీ, మీ ఆంతరిక శక్తిని పెంచుకోవడానికి, మీ గత కర్మను తీర్చుకోవటానికి మీకు అవకాశం ఇచ్చినందుకు, మీతో ఎవరైనా సరిగ్గా లేని వారికి కూడా కృతజ్ఞతతో ఉండండి. ప్రతి క్షణం మీ కర్మల ఖాతాలన్నింటినీ తీర్చుకుంటూ ఉండండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »
27th april 2025 soul sustenance telugu

మీ సంతోషాల గురించి మాట్లాడండి, బాధల గురించి కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో ఎన్ని మంచి విషయాలు జరిగినా, మంచి మరియు సానుకూల విషయాలకు బదులుగా మన ఆరోగ్యం, ఆర్థిక, సంబంధాలు మరియు

Read More »