Hin

20th july 2024 soul sustenance telugu

July 20, 2024

ప్రతి ఒక్కరికీ పట్ల మీ దృష్టిని నిష్పాక్షికంగా, ఆధ్యాత్మికంగా మార్చుకోండి

గౌరవం మరియు వినయం అనే మీ వాస్తవిక లక్షణాల ద్వారా ఇతరులతో కనెక్ట్ అవ్వండి. మీ లక్షణాలు మీవే, వాటిని ప్రతి ఒక్కరితో, ప్రతి పరిస్థితిలో మరియు ప్రతిసారీ ఉపయోగించుకోండి. మీరు ఒక వ్యక్తితో మర్యాదగా, మరొకరితో అహంభావంగా ఉంటే, లేదా మీ ప్రవర్తన ఇతరులు మీతో ప్రవర్తించే విధానాన్ని ప్రతిబింబిస్తే, ఈ ప్రక్రియలో మీ వ్యక్తిత్వం కోల్పోతుంది. మీ చుట్టూ ఎవరూ సరిగ్గా లేనప్పటికీ, మీ లక్షణాల నుండి పక్కదారి పట్టకండి. మన పక్షపాతాలు మన స్వంత నమ్మకాలకు, వాస్తవికతకు మధ్య అడ్డంకులను సృష్టించగలవు. కొన్నిసార్లు మనం ఒక వ్యక్తిని మరొకరి కంటే ఎందుకు ఇష్టపడతాము, ఒక స్థలాన్ని ఎందుకు ఇష్టపడము లేదా ఒక వస్తువు బ్రాండ్ను ఎందుకు తిరస్కరిస్తాము అనే విషయాన్ని సమర్థించలేము. మనం ఎంత పక్షపాతంగా ఉంటామో, అంత అసమంజసమైనవాళ్ళం అవుతాము.

  1. మీ రూపం, స్థానం, సంస్కృతి, జాతీయత, మతం – మీరు సంపాదించుకున్నవి, మీరు కాదు. కాబట్టి పాత్రను బట్టి లేదా హోదాను బట్టి వ్యక్తులతో కనెక్ట్ అవ్వకండి. ఇది ఆధిపత్యం లేదా హీనత్వం యొక్క ఆలోచనలను సృష్టిస్తుంది, ఇది పక్షపాతాలకు దారితీస్తుంది.
  2. మీ మనస్సు ఎవరి కోసమైనా లేదా దేని కోసమైనా సరైనదిగా ఆలోచించకపోతే, సమాజం కోసం లేదా ఇతరుల ఆమోదం కారణంగా మీరు పక్షపాతంతో ఉన్నారా అని తనిఖీ చేయండి. నమ్మకాలని సరిచేసి, మీ అభిప్రాయాన్ని మార్చుకోండి.
  3. మీరు మరొక పవిత్రమైన వ్యక్తితో సంభాషించే పవిత్రమైన వ్యక్తి అని మీకు మీరే గుర్తు చేసుకోండి. మర్యాదను విస్తరించండి మరియు పాత్రల ప్రకారం సామాజిక నియమాలను పాటించండి. కానీ గౌరవం అనేది వ్యక్తి పట్ల ఉంటుంది, కాబట్టి అది వ్యక్తుల పాత్రలు, విశ్వాసం, జాతీయత లేదా మరే ఇతర కారకాన్ని బట్టి మారకూడదు.
  4. స్వచ్ఛమైన మనస్సుతో వ్యక్తులను కలవండి, వారి గురించి మీరు కలిగి ఉన్న గత అభిప్రాయాలను తొలగించండి. కొత్త ఆలోచనా విధానంతో, కొత్త ప్రవర్తనతో వారిని గ్రహించండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »
23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »
22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »