Hin

3rd august 2024 soul sustenance telugu

August 3, 2024

ప్రతికూల పరిస్థితుల యొక్క 4 ప్రయోజనాలు (పార్ట్ 1)

  1. ప్రతికూల పరిస్థితులు మనల్ని మరింత శక్తివంతం చేస్తాయి – మనం ఊహించలేని ప్రతికూల సన్నివేశాల ప్రపంచంలో ఉన్నాము. అవి కొన్నిసార్లు మనల్ని కలవరపరచి కదిలిస్తాయి. చాలా మందికి, ప్రతికూల పరిస్థితులు చాలా ఆందోళన కలిగిస్తాయి. అవి వచ్చిన వెంటనే, వారు ప్రతికూల మరియు అనవసరమైన ఆలోచనలను సృష్టిస్తారు, పరిస్థితిని సమర్థవంతంగా మరియు సానుకూలంగా నిర్వహించడానికి బదులుగా కృంగిపోతారు. అలాగే, ఈ రకమైన ప్రతికూల అవగాహన మన మనస్సు-బుద్ధిని కలవర పెడుతుంది. అందువలన మన స్పృహలో స్పష్టత లేకపోవడం వల్ల పరిస్థితిని ఎలా పరిష్కరించాలో మనకు అర్థం కాదు. తరచుగా పరిస్థితులు కనిపించేంత పెద్దవిగా ఉండవు, కానీ భయం మరియు ఆందోళనతో నిండిన మన తప్పు ఆలోచన వాటిని పెద్దదిగా చేస్తుంది. ఆధ్యాత్మికత యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం మన ఆత్మ శక్తిని పెంచి కఠిన పరిస్థితులను శాంతియుత మరియు సంతృప్తికరమైన స్పృహతో ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడం. ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో మనం ఎంత ఓపికగా ఉంటామో, అంతగా మన ఆత్మ శక్తి పెరుగి ప్రస్తుత పరిస్థితిని వేగంగా పరిష్కరించడమే కాకుండా, భవిష్యత్ పరిస్థితులకు కూడా మనల్ని సిద్ధం చేస్తుంది, తద్వారా మనం వాటిని మరింత శక్తివంతంగా ఎదుర్కోగలము.
  2. ప్రతికూల పరిస్థితులు మనల్ని మరింత అనుభవజ్ఞులుగా మరియు వివేకవంతులుగా చేస్తాయి – కఠిన పరిస్థితులు మనకు జీవిత రహస్యాలను వెల్లడించి, ఆత్మపరిశీలన చేసుకునేలా చేసి, వివేకవంతులుగా చేస్తాయి, ఎందుకంటే మనం మన మనస్సు-బుద్ధిని ఉపయోగించి పరిస్థితిని దాటడానికి అనేక కొత్త విషయాలను నేర్చుకుంటాము. అలాగే, మనం జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు గత పరిస్థితి అనుభవాన్ని మనం కలిగి ఉంటాము. జీవితం మార్పులు, ఆశ్చర్యజనకమైన అనుభవాలు కలిగి ఉండడంతో స్వపరివర్తనలో మనకు సహాయపడటమే కాకుండా ఇతరులకు మార్గనిర్దేశం చేయడంలో కూడా సహాయపడుతుంది. స్వయం పట్ల, భగవంతునిపై, ప్రపంచ నాటకంపై మనకున్న సానుకూలత, విశ్వాసంతో ప్రతి పరిస్థితిని అనుభవం చేసుకుంటాము మరియు ప్రతి సవాలును ఎదుర్కొంటాము. ఇది మనల్ని చాలా విజయవంతం చేసి అడుగడుగునా జ్ఞానం, గుణాలు మరియు శక్తులతో నింపుతుంది.

(సశేషం …)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

14th sep 2024 soul sustenance telugu

ఆంతరికంగా ఉన్న స్వయాన్ని గుర్తించి అనుభవం చేసుకోవటం (పార్ట్ 1)

జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్ను వ్రాసుకొని నటించాలని కోరుతుంది. కానీ, తరచూ మనం మన స్క్రిప్ట్లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మనం మనసులో

Read More »
13th sep 2024 soul sustenance telugu

ఇతరుల స్క్రిప్ట్ను రాసే  ప్రతికూల అలవాటు

జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్ను వ్రాసుకొని నటించాలని కోరుతుంది. కానీ, తరచూ మనం మన స్క్రిప్ట్లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మనం మనసులో

Read More »
12th sep 2024 soul sustenance telugu

మీ జీవితంలో భగవంతుని  జ్ఞానాన్ని తీసుకురావడానికి 5 మార్గాలు

ప్రతిరోజూ మీ మనస్సులో భగవంతుని జ్ఞానంపై దృష్టి పెట్టండి – ప్రతిరోజూ భగవంతుడు మనతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకుంటారు. దానిని చదివి మనం మన డైరీలు మరియు హృదయాలలో నోట్ చేసుకుంటాము. వ్రాసుకున్న తరువాత,

Read More »