Hin

4th august 2024 soul sustenance telugu

August 4, 2024

ప్రతికూల పరిస్థితుల యొక్క 4 ప్రయోజనాలు (పార్ట్ 2)

  1. ప్రతికూల పరిస్థితులు మన కర్మల ఖాతాలను పరిష్కరించి ఆత్మను శుద్ధి చేస్తాయి – కఠిన పరిస్థితులు ఈ జన్మలో లేదా గత జన్మలో మనం చేసిన కొన్ని ప్రతికూల చర్యల ఫలితం అని లోతుగా గ్రహించడం ఒక ముఖ్యమైన అంశం. ఆత్మ యొక్క ప్రయోజనం మరియు దాని రక్షణ కోసం, ఆత్మలో గత ప్రతికూల చర్యలలో ఉన్న సంస్కారాలను మనం తొలగించాల్సిన అవసరం ఉందని మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ సంస్కారాలు నిరంతరం వాతావరణానికి ప్రతికూల శక్తిని ప్రసరిస్తున్నందున ఇతర ఆత్మలు మరియు వాతావరణం రెండూ ప్రతికూలతను ఆకర్షిస్తాయి. ఆ ప్రతికూల శక్తి మనకు చేరి అనేక రకాలుగా ఆత్మకు హాని చేస్తుంది. మన జీవితంలో ప్రతికూల పరిస్థితి ఏర్పడినప్పుడు, మనం లోతైన ఆత్మ పరిశీలన చేసుకొని స్వపరివర్తనను తీసుకువస్తాము, మన అహాన్ని కూడా ముగించుకుంటాము. ఆ సమయంలో మనకు అవసరమైన గుణాలు కూడా మనలో ఉద్భవిస్తాయి. మనం భగవంతునితో అనుసంధానమై వారి నుండి శక్తిని పొంది మంచితనానికి కూడా దగ్గరగా వెళ్తాము. ఇవన్నీ చేయడం ద్వారా, మన ప్రతికూల కర్మల ఖాతాలు తొలగి పోయి, గతం యొక్క ప్రతికూల చర్యలకు సంబంధించిన మన సంస్కారాలను క్లియర్ చేస్తుంది. ఆత్మను శుద్ధి చేసి ప్రతికూల పరిస్థితుల ప్రభావాల నుండి విముక్తి చేస్తుంది. ఏదో ఒక సమయంలో దాన్ని పరిష్కరిస్తుంది.
  2. ప్రతికూల పరిస్థితులు విజయానికి కొత్త మార్గాలను తెరుస్తాయి – చివరిది మరియు చాలా ముఖ్యమైనది, ప్రతికూల పరిస్థితిని అధిగమించడం చాలా కష్టంగా అనిపించినప్పుడు, మనం తరచుగా మన ఒకే రకమైన ఆలోచనలు, ప్రస్తుత జీవనశైలి మరియు పని చేసే విధానాల నుండి బయటపడి అన్నింటిలో మార్పులను తీసుకువస్తాము. ఈ పరివర్తన తరచుగా మనల్ని కొత్త మార్గాల్లోకి తీసుకువెళ్లి అది ఈ కొత్త పద్ధతులు మరియు ఆలోచనలతో సవాళ్లను అధిగమిస్తాము. ప్రతికూల పరిస్థితి కారణంగానే ఈ మార్గాలు తెరుచుకున్నాయని లోతుగా గ్రహించడం మంచిది. ప్రతికూల పరిస్థితి లేకుంటే అవి తెరుచుకునేవి కావు, ఆ సందర్భంలో మార్పులు తీసుకురావాలని మనం ఆలోచించము. అలాగే, ఈ ప్రయోజనం యొక్క చాలా ముఖ్యమైన కోణం ఏమిటంటే, కొన్నిసార్లు కొత్త మార్గాలు మన జీవితాంతం మనతోనే ఉంటాయి, అడుగడుగునా మనకు సహాయపడతాయి మరియు జీవితంలోని వివిధ రంగాలలో నిరంతరం విజయాన్ని కలిగిస్తాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »
15th march 2025 soul sustenance telugu

ద్వేషం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అనేక విభిన్న సంబంధాల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒక అందమైన సంబంధం ఎలాంటి ద్వేషం లేని నిజమైన ఆత్మిక ప్రేమ పై

Read More »