Hin

2nd dec 2024 soul sustenance telugu

December 2, 2024

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 1)

మనం అనూహ్యమైన జీవితాన్ని గడుపుతున్నాము. మన జీవితంలో తరచూ ఊహించని పరిస్థితులు వస్తున్నాయి. దీనికంతటికీ కారణం ఏమిటి? ఈ రోజు మన జీవితాలలో క్లిష్ట పరిస్థితులు ఎందుకు పెరుగుతున్నాయి? భగవంతుడు వెల్లడించిన ప్రపంచ నాటకం యొక్క జ్ఞానం ప్రకారం, మనమందరం ప్రస్తుతం ప్రపంచ నాటకం యొక్క చివరి దశలో, కలియుగం లేదా ఇనుప యుగం చివరిలో ఉన్నాము. ఈ సమయంలో ప్రపంచంలోని ఆత్మలందరూ తమ గత జన్మలలో చేసిన అనేక విభిన్న ప్రతికూల చర్యల యొక్క ప్రతికూల సంస్కారాలను కలిగి ఉన్నారు. ఈ ప్రతికూల సంస్కారాలు మనస్సుకు ఇబ్బందులు కలిగిస్తూ ప్రతికూల ఆలోచనలు, భావాల రూపంలో శరీరం, ఇతర ఆత్మలకు మరియు పర్యావరణానికి నిరంతరం ప్రతికూల శక్తిని ప్రసరించేలా చేస్తాయి. శరీరం, సంబంధాలు, సంపద మరియు పాత్ర యొక్క కష్టమైన పరిస్థితులను ఆకర్షిస్తాయి. కాబట్టి, మనం ఈ విభిన్న ప్రతికూల పరిస్థితులను సహనముతో, శక్తితో పరిష్కరించాలి. కష్టమైన పరిస్థితులను విజయవంతంగా తక్కువ వ్యవధిలో పరిష్కరించగల 3 దశలను ఈ సందేశంలో చూద్దాం –

స్టెప్ 1 – పరిస్థితిని శాంతియుతంగా అంగీకరించడం – ఏదైనా క్లిష్ట పరిస్థితిని పరిష్కరించడంలో మొదటి అడుగు దానిని అర్థం చేసుకొని వివేకంతో శాంతియుతంగా అంగీకరించడం. మనం ఏదైనా పరిస్థితిని ప్రతిఘటించి, దానికి భయపడితే, అది పెద్దదిగా మారి, పరిష్కరించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొన్నిసార్లు పరిస్థితి అంత పెద్దది కాదు, కానీ మన జీవితంలో కష్టమైన పరిస్థితి ఉందని, జీవితం ఇక ఇంతకు ముందులా ఉండదనే ఆలోచన పరిస్థితిని మరింత పెద్దదిగా చేస్తుంది. అలాగే, మన మనస్సు యొక్క సానుకూల స్థితిని సృష్టించుకొని మన సరైన ఆలోచన, భగవంతుని సహాయం, ఇతరుల మార్గదర్శకత్వంతో పరిస్థితిని మార్చడం ప్రారంభించక ముందు, ఇది మన గత జన్మల లేదా ఈ జన్మ లోని కొన్ని మన ప్రతికూల చర్యల ఫలితం అనే అవగాహనతో పరిస్థితిని అంగీకరించాలి. అంతేకానీ, ఇది ఏ వ్యక్తి లేదా ఇతర బాహ్య శక్తి వల్ల సంభవించలేదని అర్థం చేసుకోవాలి. మనం మనతో మాట్లాడుకొని మన మనస్సులో తేలికగా ఉండాలి. మనం ఈ రోజు బాధపడే అంతగా మనమేమి అంత చెడ్డ ఆత్మలం కాదని లేక అనేక ప్రతికూల చర్యలను చేసిన ఆత్మలం కాదని లోతుగా భావించాలి.  బదులుగా, మనం అనేక ప్రత్యేకతలతలున్న మంచి ఆత్మలమని, భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనకు మనం చెప్పుకోవాలి. కానీ ఈ రకమైన పరిస్థితి ఎవరి జీవితంలోనైనా రావచ్చు, మనం ఒంటరిగా లేము. అంగీకారం మనల్ని బలంగా, మరింత స్థిరంగా చేస్తుంది.  ప్రతిఘటన మనల్ని భావోద్వేగపరంగా బలహీనంగా, అస్థిరంగా చేస్తుంది.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »
13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »