Hin

3rd dec 2024 soul sustenance telugu

December 3, 2024

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో శక్తివంతమైన సానుకూల మానసిక స్థితిని సృష్టించడం. మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితికి అనుగుణంగా మీ కోసం ఒక చిన్న ధృవీకరణను సృష్టించుకొని ఉదయం లేచిన వెంటనే, రోజులో ఏదైనా తినడానికి, త్రాగడానికి ముందు మరియు నిద్రపోయే ముందు ఒకసారి మనస్సులో ఆలోచించడం ఉత్తమ అభ్యాసం. ఎటువంటి భావాలు లేకుండా కేవలం మనస్సులో రిపీట్ చేయకుండా ధృవీకరణను పూర్తి విశ్వాసంతో, నిశ్చయంతో సాధన చేయాలి. అలాగే, మనం నిర్భయంగా, స్థిరంగా ఉంటూ ప్రపంచంలోని ఏ పరిస్థితిని ఎలా పరిష్కరించాలో తెలిసిన జ్ఞానసాగరుడైన, విశ్వంలోనే సర్వశక్తివంతుడైన భగవంతుడి సహాయం తీసుకుంటే ఈ పరిస్థితి సులభంగా పరిష్కరించబడుతుందని మనకు మనం గుర్తుచేసుకోవాలి. మనం ప్రతి అడుగులోనూ వారి తోడును, శక్తిని అనుభవం చేసుకుంటూ వారి సహాయ హస్తాన్ని గట్టిగా పట్టుకుని, పూర్తిగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి.

భగవంతుని శక్తిని గ్రహించడానికి, ధ్యానంలో వారితో కనెక్ట్ అవ్వడానికి సమయం కేటాయించండి. వారితో సూక్ష్మ సంభాషణలు కూడా చేయండి. ప్రతికూల పరిస్థితి గురించి మీ ఆలోచనలను వారితో పంచుకొని వారి సానుకూల వైబ్రేషన్లు, ఏ చర్యలు తీసుకోవాలి అనే దాని యొక్క ప్రేరణలను పొందండి. చాలా కష్టంగా అనిపించే leda విజయానికి మార్గం అంధకారంగా ఉన్న ఏ పరిస్థితినైనా దాటడం అనేది మీరు ధ్యానంలో భగవంతుని నుండి తీసుకునే వారి ప్రకాశం, దృష్టితో సులభం అవుతుంది. చివరగా, మీరు ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి భగవంతుని నుండి విని నేర్చుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అంశాలను కూడా గుర్తు చేసుకొని సవరించండి. ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా మీ మనస్సును ఉల్లాసం, సంతృప్తితో నింపుకోండి. అలాగే, భగవంతుని సహాయం మరియు ఆధారంగా మీరు అధిగమించిన గతంలోని వివిధ ప్రతికూల పరిస్థితుల గురించి మీ అనుభవాన్ని గుర్తుంచుకోండి. ఈ తేలికతనం అనేది సానుకూల పరిష్కారాలను సులభంగా, వేగంగా ఆకర్షించి మన మనస్సులలో, ఆలోచనలలో ఎటువంటి ఒత్తిడితో కాకుండా సులభంగా పరిస్థితిని ఎదుర్కోవటానికి కూడా మనల్ని బలంగా చేస్తుంది.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »
27th april 2025 soul sustenance telugu

మీ సంతోషాల గురించి మాట్లాడండి, బాధల గురించి కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో ఎన్ని మంచి విషయాలు జరిగినా, మంచి మరియు సానుకూల విషయాలకు బదులుగా మన ఆరోగ్యం, ఆర్థిక, సంబంధాలు మరియు

Read More »