Hin

4th Dec 2024 Soul Sustenance Telugu

December 4, 2024

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని స్మరించుకుంటే పరిస్థితి దానంతట అదే పరిష్కారమవుతుందని భావిస్తాము. కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో పరిస్థితిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడంలో ఏదైనా ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత దిగజారిపోయి, అది మన చేతులు దాటిపోతుంది. కాబట్టి, మన మరియు భగవంతుని నుండి మనం తీసుకునే సానుకూల శక్తి మన మనస్సు నుండి పరిస్థితికి ప్రసరించాల్సిన అవసరం ఉంది. ఇక మనం ఇతరులతో చర్చించి, మనం ఇప్పుడూ, ఇకముందు ఏమి చేయాలో కూడా ఆలోచించవచ్చు. మనం పరిస్థితిపై వ్యవహరించేటప్పుడు, భగవంతుడిని మనకు సమీపంలో ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటూ జ్ఞానంతో నిండిన వారి దివ్యబుద్ధితో మనకు తెలియజేస్తున్న వాటిని గ్రహించాలి. ఇతరులతో మాట్లాడటం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదవడం కూడా మంచిది మరియు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భగవంతుడు కొన్నిసార్లు ఇతరుల ద్వారా, వారి జ్ఞానం ద్వారా మనకు మార్గనిర్దేశం చేస్తారు. పరిస్థితులు త్వరగా పరిష్కరించబడేలా లేవని మనకు అనిపించినప్పుడు మనం చదివే లేదా వినే భగవంతుని జ్ఞానం త్వరగా పరిష్కారం వైపుకు తీసుకువెళ్తుంది.

 

చివరగా, పరిష్కారం వైపు అడుగులు వేసేటప్పుడు, మిమ్మల్ని మీరు ఓర్పుతో ఉంచుకోండి. పరిష్కారం వైపుకు ముందుకు వెళ్తున్నప్పుడు భగవంతుడు కూడా మీ పురోగతి ఆధారంగా మీకు మార్గనిర్దేశం చేస్తారని, సమస్య పరిష్కారానికి వారు మిమ్మల్ని తీసుకువెళతారని గుర్తుంచుకోండి. మనం ఏ విధమైన పరిష్కార చర్యలు తీసుకోకపోతే, భగవంతుడు కూడా మనకు సరిగ్గా మార్గనిర్దేశం చేయలేరు. ఎందుకంటే మనం వారిపై అతిగా ఆధారపడి మనం ఏమీ చేయకుండా పూర్తిగా ప్రతిదీ వారికి వదిలే స్తాము. మీరు దృఢత్వంతో నిండిన ఒక అడుగు వేస్తే, నేను మీకు వెయ్యి రెట్లు ఎక్కువ సహాయం చేస్తానని భగవంతుడు చెబుతారు. కానీ మనం ఆ ఒక్క అడుగు వేయకపోతే, భగవంతుడు కూడా పరిస్థితి నుండి దూరంగా ఉంటారు. మనం ఆశించినంతగా వారి సహాయం మనకు లభించదు. మరోవైపు, భగవంతుని సహాయం అద్భుతాలను సృష్టిస్తూ పరిస్థితి అనిపించినంత పెద్దది కాదని మనకు అనిపించేలా చేస్తుంది. కానీ మనం కూడా కార్యాచరణలో చురుకుగా ఉంటూ పరిస్థితిని సరిచేయడానికి మన వంతు కృషి చేయాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

12th May 2025 Soul Sustenance Telugu

సంఘర్షణల సమయంలో వ్యక్తులతో మాట్లాడండి … వారి గురించి మాట్లాడకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సంబంధంలో విభేదాలు ఏర్పడినప్పుడు, మనలోని నెగటివ్ భావోద్వేగాలు తరచుగా అవతలి వ్యక్తితో మన సంభాషణలో అవరోధంగా మారతాయి. అవతలి వ్యక్తి గురించి

Read More »
11th May 2025 Soul Sustenance Telugu

మన పోజిటివిటీ కవచాన్ని బలంగా చేసుకోవటం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం కఠినమైన సమయాలను ఎదురవుతున్నాము మరియు జీవితం మనపై వివిధ నెగెటివ్  పరిస్థితుల బాణాలను మళ్లీ మళ్లీ విసురుతుంది. మనందరికీ పాజిటివిటీ

Read More »
10th May 2025 Soul Sustenance Telugu

విసుగు ను(కోపం యొక్క మరో రూపం) అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలో మనం ఎప్పటికీ మార్చలేని రెండు విషయాలు: – గతం మరియు – వ్యక్తులు ఇది మనల్ని ఎదో ఒక రకంగా

Read More »